టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ తాజాగా నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ శుభ సందర్భంగా ఆయన స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ లోని హైటెక్స్ నోవోటెల్ హోటల్ వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. సాయి ప్రియ కన్‌స్ట్రక్షన్స్ మెయిన్ స్పాన్సర్‌గా సుచిర్ ఇండియా కిరణ్‌తో కలిసి ఇండియాస్ నెంబర్ వన్ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ అయిన శ్రేయాస్ మీడియా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ వేడుకకు నందమూరి కుటుంబ సభ్యులతోపాటు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ఎంతోమంది ప్రముఖులు హాజరయ్యారు. అయితే అందరిలోకీ మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “బాలకృష్ణ ఈ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నందుకు సంతోషం. ఈ వేడుకలో మేము పాలు పంచుకోవడం చాలా ఆనందం. ఇది బాలయ్యకు మాత్రమే కాదు, తెలుగు చలన చిత్రానికి జరుగుతున్న వేడుకలా భావిస్తున్నా. ఎన్టీఆర్ గారికి ప్రజల మదిలో ప్రత్యేక స్థానం ఉంది. ఆయన కొడుకుగా బాలయ్య తండ్రికి తగ్గ తనయుడిగా తన ప్రత్యేకత చాటుకున్నారు” అని పేర్కొన్నారు.
ఇంకా ఆయన ఇలా అన్నారు.. “నేను ‘ఇంద్ర’ సినిమా చేయడానికి ఇన్స్పిరేషన్ ‘సమరసింహారెడ్డి’. నాకు బాలయ్యతో కలిసి ఒక ఫాక్షన్ సినిమా చేయాలని కోరిక. ఇండస్ట్రీలో పోటీ కారణంగా మా ఇద్దరి అభిమానులు గొడవలు పడుతుంటారు. అయితే అలాంటి ఫ్యాన్స్ కోసం హీరోల మధ్య ఎటువంటి మంచి బంధం ఉంటుందో తెలియడం కోసం కొన్ని వేడుకలు చేసుకునేవాళ్లం. మా ఇంట్లో ఎటువంటి శుభకార్యం జరిగినా బాలయ్య రాకుండా ఉండరు. అందరూ కలిసి డ్యాన్స్ కూడా చేస్తారు” అని తెలిపారు.
“అందుకే మా అభిమానులు కూడా కలిసికట్టుగా ఉంటున్నారు. 50 సంవత్సరాలే కాదు, ఇంకా హీరోగా నటించే ఘనత బాలయ్యకే సొంతం. భగవంతుడు ఆయనకు ఇదే ఎనర్జీ ఇవ్వాలని, బాలయ్య 100 ఏళ్లు బావుండాలని కోరుకుంటున్నాను. కేవలం సినిమాలే కాకుండా రాజకీయ, వైద్య రంగాలలో కూడా బాలయ్య సేవలు అందించడం న భూతో.. న భవిష్యత్. మేము అంతా ఒక కుటుంబం లాంటి వాళ్ళం, ఫ్యాన్స్ అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నా.. లాంగ్ లివ్ బాలయ్య” అని అన్నారు మెగాస్టార్ చిరంజీవి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: