ఏపీలో భారీ వరదలు.. ఆయ్ యూనిట్ కీలక నిర్ణయం

AAY Unit To Donate 25% Share From Collections Until Weekend For AP Flood Victims

నార్నే నితిన్ హీరోగా వచ్చిన ఆయ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అంజి కె. మణిపుత్ర దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో నయన్ సారిక హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రాన్ని బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో ఆగస్టు 15న విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గోదావరి ప్రాంత నేపథ్యంలో తెరకెక్కిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఆడియెన్స్, విమర్శకుల నుండి ప్రశంసలతో పాటు, మ్యాన్ ఆఫ్ మాస్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తండేల్ టీమ్ ఆయ్ యూనిట్‌ను అభినందించారు. ఈ చిత్రం ఇప్పటికీ మంచి ఆక్యుపెన్సీ, డీసెంట్ కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది.

ఇదిలావుంటే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆ ప్రాంతమంతా అల్లకల్లోలం అయిన సంగతి తెలిసిందే. వరదల వల్ల ఎంతో మందికి నీడ లేకుండాపోయింది. ఎంతో మందికి ఆహారం అందకుండా పోతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో వరదల వల్ల నష్టపోయిన వారికి సాయంగా ఆయ్ టీం నిలిచింది. వరద బాధితులకు అండగా నిలిచేందుకు నిర్మాత బన్నీ వాస్ ముందుకు వచ్చారు.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి ఉండే సామాజిక బాధ్యత నుంచి స్పూర్తి పొంది బన్నీ వాస్ అండ్ టీమ్ వరద బాధితులకు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. ఈరోజు నుండి వారాంతానికి వచ్చే ఆయ్ కలెక్షన్లలో నిర్మాత వాటాలో 25% జనసేన పార్టీ ద్వారా వరద బాధితులకు అందజేస్తామని నిర్మాత బన్నీ వాస్, గీతా ఆర్ట్స్ ప్రకటించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.