సినిమా బావుంటే తెలుగు ఆడియన్స్ తలమీద పెట్టుకుంటారు

Saripodhaa Sanivaaram is A Long Running Movie, Says Natural Star Nani

నేచురల్ స్టార్ నాని, క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా, ఎస్‌జే సూర్య పవర్‌ఫుల్ రోల్‌లో నటించగా.. సాయికుమార్, శివాజీరాజా కీలక పాత్రలు పోషించారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్‌, భారీ కాన్వాస్‌తో నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదలై అద్భుతమైన రెస్పాన్స్‌తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని, హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ థాంక్స్ మీట్ నిర్వహించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా హీరో నాని ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. నాని ఏమన్నారో ఆయన మాటల్లోనే చూద్దాం.. “15 రోజులుగా టీంలో ఎవరికీ నిద్రలేదు. అప్పుడు పని చేసే ఒత్తిడితో నిద్ర లేదు, ఈ మూడు రోజులుగా సక్సెస్ ఎక్సయిట్మెంట్‌తో నిద్రలేదు. రిలీజ్ రోజు నుంచి ఎన్నో అభినందనలు, ప్రసంశలు వస్తున్నాయి. సినిమాని మీరంతా ఆదరిస్తాని తెలుసు. థియేటర్‌లో అందరితో కలసి ఆడియన్స్ ఎనర్జీ చూసినప్పుడు మేము ఇంకా తక్కువగా అంచనా వేశామనిపించింది. సినిమా బావుంటే తెలుగు ఆడియన్స్ తలమీద పెట్టుకుంటారని మరోసారి ప్రూవ్ చేసినందుకు థాంక్ యూ సో మచ్.”

“ఇంతటి భారీ వర్షంలో కూడా అన్ని చోట్లా హౌస్ ఫుల్స్ అవుతున్నాయంటే వి హేవ్ గ్రేటెస్ట్ ఆడియన్స్ ఇన్ ది వరల్డ్. ఆడియన్స్ అందరికీ థాంక్స్. అందుకే మా టీం అందరి తరపున ఆడియన్స్‌కి థాంక్స్ చెప్పడానికి కలిశాం. ‘సరిపోదా శనివారం’ నాట్ వీకెండ్ ఫిల్మ్.. దీనికి లాంగ్ రన్ వుండబోతోంది. హెవీ రెయిన్స్ వుండి ఈ వీకెండ్ చూడలేకపోతే ఎలా అని భయపడకండి, సినిమా మీ చూట్టే వుంటుంది. మీ దగ్గరలోనే వుంటుంది, ఎప్పుడు కుదిరితే అప్పుడు చూడండి. చాలా స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే మూవీ ఇది.”

“సాయి కుమార్, శివాజీ రాజా గారు చాలా ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఒక సోల్ యాడ్ చేశారు. బాయ్స్ కి ప్రియాంక బ్యాలెన్స్ చేసేసింది. SJ సూర్య గారి పెర్ఫర్ఫార్మెన్స్‌ని ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే మీ అందరికి కంటే ముందు సెట్‌లో ఆయన పెర్ఫార్మెన్స్‌ని ఎంజాయ్ చేశాను. ఆయనకి బిగ్ థాంక్స్, వివేక్ విషయంలో చాలా ప్రౌడ్ గా వుంది. సెప్టెంబర్ 5న ‘సరిపోదా శనివారం’ గ్రాండ్ సెలబ్రేషన్స్ ఈవెంట్ వుంటుంది” అని హీరో నాని తెలిపారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.