నాని సరిపోదా శనివారం సెన్సేషనల్ రన్ ను కొనసాగిస్తోంది.గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎడితెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.అయితే ఈ ప్రభావాన్ని తట్టుకొని సరిపోదా సాలిడ్ వసూళ్లను సొంతం చేసుకుంటుంది.కొన్ని ఏరియాల్లో వర్షం ఎఫెక్ట్ వున్నా నిన్న ఈసినిమా సూపర్ గా హోల్డ్ చేస్తుంది.తెలుగు రాష్ట్రాల్లో 4వరోజు దాదాపు 4కోట్ల షేర్ ను రాబట్టింది.ఇక నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 68.52కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.దాంతో బ్రేక్ ఈవెన్ లో 80శాతం రికవరీ చేసింది.ఈవారంలో 100కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది.నానికి ఇది రెండో 100కోట్ల సినిమా కానుంది.ఇంతకుముందు దసరాతో తొలిసారి ఆ క్లబ్ లో జాయిన్ అయ్యాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అటు నార్త్ అమెరికాలో అదరగొడుతుంది సరిపోదా శనివారం.నిన్నటితో అక్కడ 1.8 మిలియన్ మార్క్ ను క్రాస్ చేసింది.ఈరోజుతో 2మిలియన్ డాలర్ క్లబ్ లోకి జాయిన్ కానుంది.నానికి ఇది సెకండ్ 2 మిలియన్ డాలర్ మూవీ.సూపర్ వసూళ్లతో ఈసినిమా అక్కడ బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసి బ్లాక్ బాస్టర్ దిశగా దూసుకుపోతుంది.
మొత్తానికి నాని, సరిపోదా శనివారంతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నాడు.వివేక్ ఆత్రేయ ఈసినిమాను డైరెక్ట్ చేయగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించింది.ఎస్ జె సూర్య విలన్ పాత్రలో మెరిశాడు.జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా దానయ్య ఈసినిమాను నిర్మించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: