మోస్ట్ ఇంట్రెస్టింగ్ రియాల్టీ షో బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్ ప్రారంభమైంది. కింగ్ నాగార్జున ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ఈ షో గ్రాండ్‌గా లాంచ్ అయింది. ఫుల్ ఫన్ అండ్ ఎంటర్‌టైనింగ్‍గా సాగిన ఈ వేడుకలో కంటెస్టెంట్లను హోస్ట్ నాగ్ పరిచయం చేశారు. మొత్తం 14 మంది, ఏడు జోడీలుగా.. యష్మి గౌడ – నిఖిల్, అభయ్ నవీన్ – ప్రేరణ, ఆదిత్య ఓం – సోనియా, బెజవాడ బేబక్క – ఆర్జే శేఖర్ బాషా, కిర్రాక్ సీత – నాగ మణికంఠ, పృథ్విరాజ్ – విష్ణుప్రియ భీమినేని, నైనిక – నబీల్ ఆఫ్రిది హౌస్ లోకి అడుగుపెట్టారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ గ్రాండ్ లాంచ్ ఈవెంట్‍లో కొందరు టాలీవుడ్ స్టార్స్ మెరిశారు. సరిపోదా శనివారం సినిమా ప్రమోషన్ కోసం నేచురల్ స్టాన్ నాని, హీరోయిన్ ప్రియాంక మోహన్ గెస్టులుగా వచ్చి అలరించారు. అలాగే, ‘35 ఇది చిన్న కథ కాదు’ మూవీ ప్రమోషన్ కోసం దీనికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్న దగ్గుబాటి రానా, అందులో ప్రధాన పాత్ర పోషించిన నివేదా థామస్ హౌస్‍లోకి వెళ్లి కంటెస్టెంట్లతో సరదా టాస్కులు ఆడించారు.
ఇక చివరిలో స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి హౌస్‍లోకి గెస్టుగా ఎంట్రీ ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు. మిలో ఒకరిని బయటికి పంపిస్తానంటూ కంటెస్టెంట్లను టెన్షన్ పెట్టారు. ఓటింగ్ నిర్వహించగా.. నాగ మణికంఠను బయటికి పంపాలంటూ 5 ఓట్లు వచ్చాయి. దీంతో అతడిని బయటికి తీసుకెళ్లేందుకు అనిల్ సిద్దమవడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. అయితే, ఇది ప్రాంక్ అని చెప్పటంతో నవ్వులు పూశాయి. కాగా నేటి నుంచి బిగ్ బాస్ షో అసలు ఆట మొదలుకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: