ఎన్టీఆర్ దేవర నుండి ఇప్పటివరకు వచ్చిన రెండు పాటలు ఒకదాన్ని మించి మరొకటి చార్ట్ బాస్టర్ అయ్యాయి.దాంతో మూడో పాట పై అంచనాలు భారీగా వున్నాయి.ఇక ఈ మూడో సాంగ్ దావూది రేపు రిలీజ్ కానుంది.అయితే లిరికల్ వీడియో కాకుండా ఏకంగా వీడియో సాంగ్ నే రిలీజ్ చేస్తున్నారు.అనిరుధ్ ట్యూన్స్ కు ఎన్టీఆర్ ,జాన్వీ కపూర్ వేసే స్టెప్స్ అదిరిపోనున్నాయట.ఈసందర్భంగా అందులోని డ్యాన్స్ స్టిల్ ను రిలీజ్ చేశారు.మరి ఈసాంగ్ ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మరోవైపు రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ లో జోరు పెంచనుంది దేవర టీం.అందులో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ప్లాన్ చేస్తున్నారు.పాన్ ఇండియా సినిమా కావడంతో తెలుగు తోపాటు మిగితా భాషల్లో కూడా ప్రమోట్ చేయనున్నారు.కల్కి తర్వాత తెలుగులో విడుదలవుతున్న పెద్ద సినిమా కూడా ఇదే.ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.బ్లాక్ బాస్టర్ టాక్ వస్తే 500కోట్ల మార్క్ ను టచ్ చేయనుంది.
కొరటాల శివ తెరకెక్కిస్తున్న దేవర రెండు భాగాలుగా రానుండగా మొదటి భాగం సెప్టెంబర్ 27న థియేటర్లలోకి రానుంది.ఎన్టీఆర్ ఆర్ట్స్ ,యువ సుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై హరికృష్ణ ,సుధాకర్ మిక్కిలినేని ఈసినిమాను నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: