టాలీవుడ్ ట్యాలెంటెడ్ అండ్ వెర్సటైల్ యాక్టర్ సుహాస్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘జనక అయితే గనక’. అంబాబీపేట మ్యారేజీ బ్యాండు, ప్రసన్న వదనం సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఆయన ఈ సినిమాతో మరో హిట్ అందుకోబోతున్నారు. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతోన్న ఈ సినిమాను శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 7న గ్రాండ్‌గా విడుదల కానుంది. విడుదలకు మరో ఐదు రోజులే సమయం ఉండటంతో మేకర్స్ ప్రమోషన్స్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మూవీపై మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా జనక అయితే గనక ట్రైలర్ రిలీజ్ చేయగా.. హిలేరియస్‌గా ఉండి సినిమాపై అంచనాలను మరింత పెంచేస్తోంది.
ఇదే క్రమంలో జనక అయితే గనక సినిమాకు సంబంధించి తాజాగా మరో కీలక అప్డేట్ అందించారు మేకర్స్. సెప్టెంబర్ 7న మూవీ రిలీజ్ అవుతుండగా, దానికి ఒక్కరోజు ముందే అంటే.. సెప్టెంబర్ 6న ఈ చిత్రం స్పెషల్ ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా చిత్ర యూనిట్ వెల్లడించింది.
ఇక ఈ సినిమాలో సుహాస్‌కు జోడీగా సంగీర్తన ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, గోపరాజు, రఘుబాబు, పృథ్వీ, శివన్నారాయణ, రూపలక్ష్మి, విజయలక్ష్మి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విజయ్ బుల్గానిన్ సంగీతం సమకూరుస్తుండగా.. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, కోదాటి పవన్ కల్యాణ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అలాగే ప్రొడక్షన్ డిజైనర్‌గా అరసవిల్లి రామ్‌కుమార్, కాస్ట్యూమ్ డిజైనర్‌గా భరత్ గాంధీ పనిచేస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ మూవీ యుఎస్‌ఏ థియేట్రికల్ హక్కులను హీరో సుహాస్ స్వయంగా చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. ఇదిలావుంటే మరోవైపు సుహాస్ బాబీ దర్శకత్వంలో ‘గొర్రె పురాణం’ సినిమాలో కూడా నటిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: