టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ తాజాగా నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ శుభ సందర్భంగా ఆయన స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ లోని హైటెక్స్ నోవోటెల్ హోటల్ వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. సాయి ప్రియ కన్‌స్ట్రక్షన్స్ మెయిన్ స్పాన్సర్‌గా సుచిర్ ఇండియా కిరణ్‌తో కలిసి ఇండియాస్ నెంబర్ వన్ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ అయిన శ్రేయాస్ మీడియా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు నందమూరి కుటుంబ సభ్యులతోపాటు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ఎంతోమంది ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో నందమూరి బాలకృష్ణ ఆహుతులను ఉద్దేశించి భావోద్వేగభరితంగా మాట్లాడారు. తండ్రితో తన చిన్ననాటి జ్ఞాపకాలు, వృత్తి, వ్యక్తిగత విషయాలు సహా పలు విషయాలను పంచుకున్నారు. బాలకృష్ణ ఏమన్నారో ఆయన మాటల్లోనే విందాం..
“నాకు జన్మను ఇచ్చిన తల్లి తండ్రులకు, నా తోటి నటీనటులకు, నాతో పని చేసిన ప్రతి ఒక్కరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంతటి అభిమానాన్ని చూపించిన మీ అందరినీ నా గుండెల్లో పెట్టుకుంటాను. అలాగే నా కుటుంబం అయిన నిర్మాతలు, దర్శకులు, నటులు, కళాకారులు, సాంకేతిక బృందం, నా హాస్పిటల్ బృందం, హిందూపూర్ ప్రజలు, నా అభిమానులు అంతా కలిసి ఈ వేడుకను ఇంత గొప్ప విజయం పొందేలా చేసినందుకు పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.”
“దీని వెనుక ఉండి నడిపించిన మా అసోసియేషన్, నిర్మాతల మండలి, ఛాంబర్, శ్రేయాస్ మీడియా, సాయి ప్రియ కన్స్ట్రక్షన్ వారికీ ప్రత్యేక ధన్యవాదాలు. నేను నా తండ్రి నుండి నేర్చుకున్నది నటన మాత్రమే కాదు. క్రమశిక్షణ, సమయానుకూలంగా, సంస్కారం. అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు దగ్గర నుండి అంతగానే నేర్చుకున్నాను. మేము అందరం చలన చిత్ర పరిశ్రమలో పోటీగా నటిస్తూ ఉన్నప్పటికీ ఒక ఆరోగ్య పరమైన పోటీ మాత్రమే ఉంటుంది.”
“కొత్తదనం అందిస్తే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని నమ్ముతాను. దానికి తగ్గట్లుగానే అలాంటి కొత్తదనంతో కూడిన కథలను నాకోసం తీసుకొస్తున్న దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. త్వరలో ‘అఖండ 2’ ప్రారంభించనున్నా. నేను సినీ, రాజకీయ, వైద్య సేవ రంగాలలో ఉంటూ ఇలా ఉన్నాను అంటే దానికి కారణం అయిన ప్రతి ఒక్కరికీ రుణపడిఉంటాను. అలాగే నా జర్నీలో, నేను వేసే ప్రతి అడుగులో అండగా నిలిచిన నా భార్య వసుంధరకు ప్రత్యేక ధన్యవాదాలు” అని పేర్కొన్నారు బాలకృష్ణ.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: