కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

మరోసారి అజిత్ తో త్రిష

trisha will be acting with Thala Ajith Kumar back to back

మరోసారి అజిత్ తో త్రిష

trisha will be acting with Thala Ajith Kumar back to back

trisha will be acting with Thala Ajith Kumar back to back

తమిళ హీరో తల అజిత్ తో వెంటనే మరో సినిమా చేయడానికి ఓకే చెప్పింది హీరోయిన్ త్రిష.అందులో భాగంగా అజిత్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో విడా ముయార్చి ఒకటి.మగిజ్ తిరుమనేని ఈసినిమాను తెరకెక్కిస్తుండగా అర్జున్ సర్జా ఆండ్రియా జెర్మియా,అరుణ్ విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఇందులో అజిత్ కు జోడిగా త్రిష కనిపించనుంది.షూటింగ్ కూడా అయిపొయింది.అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది.ఈసినిమాను ఈఏడాది చివర్లో విడుదలచేసేలా ప్లాన్ చేస్తున్నారు.

ఇక ఈసినిమా కాకుండా అజిత్ ప్రస్తుతం మార్క్ ఆంటోనీ డైరెక్టర్ అద్విక్ రవిచంద్రన్ తో గుడ్ బ్యాడ్ అగ్లీ చేస్తున్న విషయం తెలిసిందే.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.ఇక ఇందులో కూడా అజిత్ కు జోడీగా త్రిషనే తీసుకున్నారని సమాచారం.త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది.అలా త్రిష,అజిత్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది.

గుడ్ బ్యాడ్ అగ్లీ లో అజిత్ మూడు గెటప్ లలో కనిపించనున్నాడు.ఇందులో సునీల్ ,ప్రేమలు హీరో నస్లేన్ కీలక పాత్రలో కనిపించున్నారు.రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా వచ్చే సంక్రాంతికి ఈసినిమాను తమిళంతోపాటు తెలుగులోనూ విడుదలచేసేలా సన్నాహాలు చేస్తున్నారు.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్