కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Latest Tollywood News

ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 94

సినిమా వార్తలు

యువరాణి గా కేథరిన్

మోడల్ ,సింగర్ , డ్యాన్సర్ కేథరిన్ ట్రెసా "శంకర్ ఐపిఎస్ "కన్నడ మూవీ తో కెరీర్ ప్రారంభించారు. కన్నడ , తమిళ పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన కేథరిన్ "చమ్మక్ చల్లో "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. "ఇద్దరమ్మాయిలతో ", "పైసా ", "రుద్రమదేవి ", "సరైనోడు ", నేనే రాజు నేనే మంత్రి " వంటి సూపర్ హిట్ మూవీస్ లో కేథరిన్ తన అందం , అభినయంతో ప్రేక్షకులను అలరించారు. కేథరిన్ ఇప్పుడు ఒక తెలుగు మూవీ లో కథానాయికగా ఎంపిక అయ్యారు.

Team TFNవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

థియేటర్ లోకి రాబోతున్న అరణ్య - రిలీజ్ డేట్ ఫిక్స్

గత ఏడాది రిలీజ్ కావాల్సిన సినిమాలు ఈ ఏడాది వరుసపెట్టి రెలీజ్ కు సిద్ధమవుతున్నాయి. కరోనా వల్ల లాక్ డౌన్ విధించడంతో కొన్ని సినిమాలు షూటింగ్ మధ్యలోనే ఆగిపోగా కొన్ని సినిమాలు రిలీజ్ లను కూడా ఆపాల్సి వచ్చింది. ఇక ఎలాగోలా కరోనా ప్రభావం కాస్త తగ్గడంతో థియేటర్స్ ఓపెన్ చేయడంతో పెండింగ్ లో ఉన్న సినిమాలన్నీ రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. అలా పెండింగ్ లో ఉన్న సినిమాల్లో రానా నటించిన అరణ్య సినిమా కూడా ఒకటి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

"పొన్నియిన్ సెల్వన్ "మూవీ అప్ డేట్

లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో చియాన్ విక్రమ్ , కార్తీ , జయం రవి , ఐశ్వర్య రాయ్, త్రిష , శోభిత ధూళిపాళ ప్రధాన పాత్రలలో కల్కి కృష్ణ మూర్తి నవల పొన్నియిన్ సెల్వన్ ఆధారంగా చోళ రాజవంశం నేపథ్యంలో హిస్టారికల్ డ్రామా "పొన్నియిన్ సెల్వన్" మూవీ 2 భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపొందుతున్న ఈ మూవీ లో బిగ్ బీ అమితాబ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఆడియెన్స్ కు రవితేజ రిక్వెస్ట్

సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ , శృతి హాసన్ జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “క్రాక్ ” మూవీ భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా జనవరి 9 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో రవితేజ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ మూవీ లో లేడీ విలన్ గా పేరు పొందిన వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో నటించారు. సముద్ర ఖని , అలీ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.. 6వ తేదీ (ఈ రోజు )“క్రాక్ ” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.

Team TFNవాట్సాప్
Telugu Film Producers Council Requests Government To Increase Theatre Occupancy Ratio To 100 Per Cent,Telugu Film Producers Requests Governments,Increase The Occupancy In Theatres From 50 To 100 Per Cent,Telugu Film Industry Roots For 100 Per Cent Oc
సినిమా వార్తలు

100% ఆక్యుపెన్సీ కోసం టాలీవుడ్

కరోనా వల్ల దాదాపు ఎనిమిది నెలలు పైన థియేటర్స్ మూతపడిన సంగతి తెలిసిందే. ఇటీవలే థియేటర్స్ ఓపెన్ చేయడానికి ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. అయితే కరోనా నిబంధనలు అనుసరిస్తూ కేవలం 50శాతం ఆక్యూపెన్సీ ఇచ్చారు. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా తమిళనాడు ప్రభుత్వం 50 శాతం నుంచి 100 శాతంకు పెంచుతూ, కరోనా జాగ్రత్తలు పాటిస్తూ థియేటర్లు నడుపుకునేందుకు అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. దీనితో తెలుగు రాష్ట్రాలు కూడా 100 అక్యూపెన్సీ కోరుతూ ప్రభుత్వాలను కోరింది టాలీవుడ్ పరిశ్రమ .

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

థ్రిల్లర్ మూవీ "దృశ్యం "

సురేష్ ప్రొడక్షన్స్ , రాజ్ కుమార్ థియేటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ , వైడ్ యాంగిల్ క్రియేషన్స్ బ్యానర్స్ పై తెలుగు , తమిళ , మలయాళ సక్సెస్ ఫుల్ చిత్ర సీనియర్ హీరోయిన్ శ్రీప్రియ దర్శకత్వంలో వెంకటేష్ , మీనా జంటగా రూపొందిన థ్రిల్లర్ "దృశ్యం " మూవీ ఘనవిజయం సాధించింది. మలయాళ చిత్రపరిశ్రమ లో పలు రికార్డ్స్ క్రియేట్ చేసిన బ్లాక్ బస్టర్ "దృశ్యం " మూవీ కి రీమేక్ గా రూపొందిన ఈ మూవీ లో నదియా , నరేష్ , పరుచూరి వెంకటేశ్వర రావు , సప్తగిరి ముఖ్య పాత్రలలో నటించారు. శరత్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్ తో మూవీ చేస్తా - సంతోష్ శ్రీనివాస్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ “అల్లుడు అదుర్స్ ” మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 15 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో నభా నటేష్ , అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. “అల్లుడు అదుర్స్ ” మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ తో మోనాల్ ప్రేక్షకులను అలరించనున్నారు.

Team TFNవాట్సాప్
Akira Fun Meme On 2020 Is A Must Watch,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Akira,Akira Fun Meme On 2020,2020 kira Fun Meme,Watch Akira Fun Meme On 2020,Akira Fun Meme,Akira Fu
సినిమా వార్తలు

2020పై అకీరా ఫన్నీ మీమ్

రేణు దేశాయ్ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. పవన్, తన పిల్లలకు సంబంధించిన ఫొటోలను కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూనే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు ఏదో ఒక పోస్ట్ పెడుతూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది రేణు. ఇక తాజాగా అకీరా చేసిన మీమ్ ఒకటి పోస్ట్ చేసింది. వారు పెంచుకునే రెండు పిల్లులు ఉంటే పెద్దది చిన్న పిల్లిని రెండు చేతుల్లో పట్టుకొని ఉంది. దానికి పెద్ద దాని చేతుల్లో నలిగిపోయినట్టుగా 2020వ సంవత్సరంపై అకీరా ఫన్నీ మీమ్ క్రియేట్ చేసాడు. పైగా ఆ ఫోటోను కూడా అకీరానే తీసి ఆ మీమ్ ను తయారు చేసినట్టుగా రేణు దేశాయ్ తెలిపారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అలిమేలు మంగ గా తాప్సీ

టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ తేజ, గోపీచంద్ హీరోగా "అలిమేలుమంగ వెంకటరమణ "మూవీ ని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ లో కథానాయికగా కాజల్ అగర్వాల్ , కీర్తి సురేష్ , అనుష్క పేర్లు వినిపించాయి. బాలీవుడ్ లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న స్టార్ హీరోయిన్ తాప్సీ ని దర్శకుడు తేజ అలిమేలుమంగ క్యారెక్టర్ కు ఎంపిక చేశారు. తాప్సీ ప్రస్తుతం పలు బాలీవుడ్ మూవీస్ తో బిజీగా ఉన్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

న్యూ బిగినింగ్స్ 2021 -పూజాహెగ్డే

టాలీవుడ్ స్టార్ హీరోల మూవీస్ లో కథానాయికగా నటిస్తూ పూజాహెగ్డే పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గ రాణిస్తున్న విషయం తెలిసిందే. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ "రాధేశ్యామ్ "మూవీ షూటింగ్ లో పూజాహెగ్డే పాల్గొంటున్నారు. అఖిల్ అక్కినేని , పూజాహెగ్డే జంటగా రూపొందిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ "మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందే తెలుగు మూవీ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సినీ గేయ రచయిత వెన్నెలకంటి కన్నుమూత

2020 లో ఎంతో మంది సినీ సెలెబ్రటీస్ మరణించిన సంగతి చూసాం. కొంత మంది వ్యక్తిగత అనారోగ్యాల వల్ల మరణిస్తే.. కొంతమంది కరోనా వల్ల.. మరికొంత మంది సూసైడ్ చేసుకున్న సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. ఏ రకంగా చూసినా సినీ పరిశ్రమలకు మాత్రం 2020 చేదు అనుభూతులనే మిగిల్చింది అని చెప్పొచ్చు. ఇక ఎన్నో ఆశలతో మొదలుపెట్టిన ఈ ఏడాదిలో కూడా అప్పుడే సినీ పరిశ్రమకు చెందిన మరో ప్రముఖ గేయ రచయితను కోల్పోవాల్సి వచ్చింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

పూరి , యశ్ ల పాన్ ఇండియా మూవీ ?

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ పాన్ ఇండియా "ఫైటర్ "మూవీ ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ "కె జి ఎఫ్ చాప్టర్ 1" మూవీ ఘనవిజయం సాధించి పలు రికార్డ్స్ క్రియేట్ చేసింది. పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందిన యశ్ ప్రస్తుతం ఆ మూవీ సీక్వెల్"కె జి ఎఫ్ చాప్టర్2 "మూవీ లో నటిస్తున్నారు. ఆ మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది.

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'అల్లుడు అదుర్స్' ట్రైలర్ రిలీజ్ - కామెడీ ప్లస్ యాక్షన్

కరోనా వల్ల ఇన్ని నెలలు థియేటర్స్ మూతపడగా లాక్‌డౌన్‌ తర్వాత విడుదలైన ‘సోలో బ్రతుకే సో బెటర్‌’కి మంచి ప్రేక్షకాదరణ లభించడంతో అందరికీ ధైర్యం వచ్చింది. ఇక ఈ సంక్రాంతి సినీ లవర్స్ కు పెద్ద పండగ అని చెప్పొచ్చు. చాలా సినిమాలు థియేటర్ వద్ద సందడి చేయడానికి రెడీ అయ్యాయి. అందులో సాయి శ్రీనివాస్ సినిమా 'అల్లుడు అదుర్స్' సినిమా కూడా ఒకటి. సంక్రాంతి పండుగకు ఈ అల్లుడు కూడా సందడి చేయడానికి వచ్చేస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

స్టార్ హీరో సూర్య నేచురల్ లుక్

"నేరుక్కు నేర్ "మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయిన సూర్య పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ తమిళ ప్రేక్షకులను అలరిస్తున్నారు. సూర్య హీరో గా రూపొందిన పలు తమిళ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ ఘనవిజయం సాధించాయి. కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా హీరో సూర్య కు అభిమాన గణం అధికమే. నిర్మాతగా పలు సూపర్ హిట్ మూవీస్ ను ప్రేక్షకులకు అందించిన సూర్య "రక్త చరిత్ర 2" తెలుగు స్ట్రెయిట్ మూవీ లో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించారు. సూపర్ హిట్ "ఆకాశం నీ హద్దురా !" మూవీ లో అద్భుతం గా పెర్ఫార్మ్ చేసి సూర్య ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

Team TFNవాట్సాప్
Tamilnadu Movie Theatres Get Hundred Percent Occupancy For Vijay Master Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Thalapathy Vijay,Hero Thalapathy Vijay,Actor Vijay,Master,Mas
సినిమా వార్తలు

'మాస్టర్' 100% ఆక్యుపెన్సీకి అనుమతి

లోకేష్ కనకరాజ్‌ దర్శకత్వంలో విజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా 'మాస్టర్‌'. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు. జనవరి 13న ఈ సినిమా విడుదలవుతుంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్ రిలీజ్ అవ్వగా వాటికి వచ్చిన రెస్పాన్స్ తో సినిమాపై మరింత భారీ అంచనాలు పెరిగాయి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సోనూ సూద్ హీరోగా "కిసాన్ "

తెలుగు , కన్నడ , తమిళ , హిందీ మూవీస్ లో స్టార్ విలన్ గా సోనూ సూద్ రాణిస్తున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ "అరుంధతి " మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సోనూసూద్ బెస్ట్ విలన్ గా నంది అవార్డ్ అందుకున్నారు. పలు భాషల బ్లాక్ బస్టర్ మూవీస్ లో ప్రతినాయకుడిగా ప్రేక్షకులను అలరించిన సోనూసూద్ ప్రస్తుతం "ఆచార్య ", "అల్లుడు అదుర్స్ ", "పృథ్విరాజ్" (హిందీ ), "తమిళరసన్ "(తమిళ ) మూవీస్ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

"పుష్ప" మూవీ లో పోలీస్ ఆఫీసర్ గా తమిళ హీరో ఆర్య ?

మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యం లో యాక్షన్ థ్రిల్లర్ "పుష్ప "మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. జగపతి బాబు , ప్రకాష్ రాజ్ , సునీల్ , వెన్నెల కిషోర్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

హ్యాపీ బర్త్ డే సూపర్ స్టార్ దీపికా

దీపికా పదుకొనే ఈ పేరును తెలుగు వారికి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్స్ తో స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. ఇక ఇప్పుడు తెలుగు తెరపై కూడా కనిపించనుంది. నాగ్ అశ్విన్ తో ప్రభాస్ 21 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె నటిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

హీరో కళ్యాణ్ రామ్ న్యూ లుక్

"బాలగోపాలుడు "మూవీ తో చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ కు కళ్యాణ్ రామ్ పరిచయం అయ్యారు.సూపర్ హిట్ "అతనొక్కడే ", "హరే రామ్ ", "పటాస్ ", "118" మూవీస్ తో కళ్యాణ్ రామ్ ప్రేక్షకులను అలరించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రొడక్షన్ హౌస్ నెలకొల్పి కళ్యాణ్ రామ్ పలు సక్సెస్ ఫుల్ మూవీస్ ను నిర్మించారు. హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ తో కలసి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా "NTR 30 " మూవీ ని నిర్మించనున్నారు. కళ్యాణ్ రామ్ ఇప్పుడు హీరోగా రెండు మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'రాధే శ్యామ్' టీజర్ అప్ డేట్ త్వరలో

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలను చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక అభిమానులు కూడా తమ హీరో సినిమా అప్ డేట్స్ కోసం ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఒకప్పటిలా కాదులే కానీ ఈ మధ్యకాలంలో బాగానే అప్ డేట్స్ ఇస్తున్నారు.

TFN Adminవాట్సాప్

షేర్