కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Latest Tollywood News

ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 95

సినిమా వార్తలు

గ్లామర్ రోల్స్ కు సిద్ధమే - నివేత పేతురాజ్

సక్సెస్ ఫుల్ "మెంటల్ మదిలో "మూవీ తో తమిళ యాక్ట్రెస్ నివేత పేతురాజ్ టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. తమిళ , తెలుగు భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో నివేత అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. నివేత ప్రస్తుతం రెండు తమిళ మూవీస్ తో పాటు "RED ", "విరాటపర్వం " మూవీస్ లో నటిస్తున్నారు. స్రవంతి మూవీస్ బ్యానర్ పై కిషోర్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కథానాయకుడిగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "RED"మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీ రిలీల్ కానుంది. ఈ మూవీ లో ముగ్గురు హీరోయిన్స్ లో ఒక హీరోయిన్ గా నటించిన నివేత మూవీ రిలీజ్ సందర్భంగా పాత్రికేయులతో ముచ్చటించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

‘లూసీఫర్’ రీమేక్‌ ‌కు ముహూర్తం ఖరారు..?

మలయాళంలో హిట్టయిన 'లూసిఫర్' చిత్రాన్ని చిరంజీవి హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఈ సినిమాకు డైరెక్టర్ విషయంలో మాత్రం కొంత కన్ఫ్యూజన్ నెలకొన్నా ఇటీవలే ఈ రీమేక్ డైరెక్టర్ విషయంలో క్లారిటీ వచ్చింది. త‌మిళ ఇండ‌స్ట్రీలో రీమేక్ స్పెష‌లిస్టుగా పేరుగాంచిన మోహ‌న్ రాజా ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

భారీ ప్రమోషన్స్ తో "క్రాక్ "

సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ , శృతి హాసన్ జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ " మూవీ భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా జనవరి 9 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో రవితేజ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ మూవీ లో తెలుగు , తమిళ భాషలలో లేడీ విలన్ గా పేరు పొందిన వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో నటించారు. సముద్ర ఖని , అలీ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

"పెళ్ళిసందD" షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా రూపొందిన "పెళ్ళి సందడి "(1996 ) మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా ప్రేక్షకులను అలరించిన "పెళ్ళి సందడి "మూవీ సీక్వెల్ "పెళ్ళిసందD" మూవీ తెరకెక్కుతుంది. ఆర్కా మీడియా వర్క్స్ , ఆర్ కె ఫిల్మ్స్ అసోసియేట్స్ బ్యానర్స్ పై దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణ లో గౌరీ రోనంకి దర్శకత్వంలో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ , మాళవిక నాయర్ జంటగా "పెళ్ళిసందD" మూవీ రూపొందుతుంది.

Team TFNవాట్సాప్
Actress Rakul Preet Singh Gets Into Mayday Movie Sets Today,After Recovering From Corona Rakul Preet Joined Mayday Movie Sets,Ajay Devgn,Rakul Preet Singh,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Latest
సినిమా వార్తలు

"మేడే " మూవీ సెట్స్ లో రకుల్

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు , తమిళ , హిందీ భాషల పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రకుల్ ప్రస్తుతం 2హిందీ , 2 తమిళ , 2 తెలుగు మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందిన మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేశారు. మరో బాలీవుడ్ మూవీ లో రకుల్ కథానాయికగా ఎంపిక అయ్యారు. కరోనా ఎఫెక్ట్ తో కొన్ని రోజులు ఇంటికే పరిమితం అయిన రకుల్ కరోనా నుండి కోలుకుని తిరిగి షూటింగ్ లో జాయిన్ అయ్యారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

‘గాడ్సే’గా సత్యదేవ్

‌‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సత్యదేవ్‌... పూరీ జగన్నాథ్‌ ‘జ్యోతి లక్ష్మీ’తో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, హీరోగా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు. టాలీవుడ్ లో ఉన్న టాలెంటడ్ నటుల్లో సత్యదేవ్ ఒకడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో బిజీ గా వున్నాడు. ఇప్పుడు మరో కథతో రావడానికి రెడీ అయ్యాడు.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

హైదరాబాద్ లో ఐశ్వర్య రాయ్

మిస్ వరల్డ్ (1994) ఐశ్వర్య రాయ్ ,మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన "ఇరువర్ " తమిళ తో కెరీర్ ప్రారంభించారు. సక్సెస్ ఫుల్ "ఔర్ ప్యార్ హోగయా" మూవీ తో ఐశ్వర్య రాయ్ బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. బాలీవుడ్ లో ఐశ్వర్య కథానాయికగా నటించిన పలు మూవీస్ ఘనవిజయం సాధించాయి. సూపర్ హిట్ "జీన్స్ ", "రోబో "వంటి మూవీస్ తో ఐశ్వర్య తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. "హమ్ దిల్ దే చుకే సోనమ్ ", "దేవదాస్ " మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఐశ్వర్య బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. 2010 సంవత్సరం లో "ఏంథిరన్ "(రోబో ) మూవీ నటించిన ఐశ్వర్య 10 సంవత్సరాల తరువాత ఒక తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మరోసారి జంటగా ?

పెన్ స్టూడియోస్ , ఎ స్టూడియోస్ బ్యానర్స్ పై సూపర్ హిట్ "రాక్షసుడు "మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వం లో మాస్ మహారాజా రవితేజ హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ "ఖిలాడి " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో హీరో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. హైదరాబాద్ లో జరుపుకున్న షూటింగ్ షెడ్యూల్ తో 40 శాతం షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయ్యింది. మరో షెడ్యూల్ ముంబై లో 15 రోజులపాటు జరగనుందని సమాచారం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'ట‌క్ జ‌గ‌దీష్' డబ్బింగ్ మొదలు

వరుస సినిమాలను కమిట్ అవుతూ ఫుల్ బిజీలో ఉన్నాడు న్యాచురల్ స్టార్ నాని. వరుస పెట్టి సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ప్రస్తుతం నాని ‘నిన్ను కోరి ' సినిమా తెరకెక్కించిన శివ నిర్వాణ దర్శకత్వంలో 'టక్ జగదీష్' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నాని కెరీర్‌లో 26వ చిత్రంగా ఈ సినిమా రూపొందుతుంది. ఇప్పటికే క్రిస్మ‌స్ సంద‌ర్భంగా రిలీజ్ చేసిన `ట‌క్ జ‌గ‌దీష్ ఫ‌స్ట్‌లుక్‌`కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఇంద్రగంటి - సుధీర్ బాబు కాంబినేష‌న్ లో మూడో సినిమా

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నాని-సుధీర్ బాబు కాంబినేష‌న్ లో 2018లో సమ్మోహనం అనే సినిమాను వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా అందరి ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వ‌చ్చిన ‘వి’ మూవీ ఇటీవలే అమెజాన్ లో రిలీజ్ అయిన సంగతి కూడా విదితమే. ఈ సినిమా విజయం సంగతి పక్కన పెడితే.. ఈ సినిమాలో పోలీస్ పాత్రలో నటించిన సుధీర్ బాబుకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఇక ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. వీరి కాంబోలో ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను ప్లాన్ చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రష్మిక డ్రీమ్ రోల్స్

టాలీవుడ్ , శాండల్ వుడ్ లలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతూ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న రష్మిక కోలీవుడ్ , బాలీవుడ్ లకు కథానాయికగా పరిచయం అవుతున్నారు. యాక్షన్ థ్రిల్లర్ "పుష్ప"మూవీ లో కథానాయికగా నటిస్తున్న రష్మిక "ఆడాళ్ళూ మీకు జోహార్లు "మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. "మిషన్ మజ్ను" మూవీ తో బాలీవుడ్ కు రష్మిక ఎంటర్ అవుతున్నారు. రష్మిక కథానాయికగా పలు భాషల మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

పొంగల్ రేస్ - అడ్వాన్స్ బుకింగ్స్

మళ్లీ పొంగల్ రేస్ మొదలైంది. ప్రతి సమత్సరం లాగానే ఈ ఏడాది కూడా సాంక్రాంతి బరిలోకి దిగేందుకు హీరోలు సిద్ధమయ్యారు. గత ఏడాది వచ్చిన అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు, రజినీ దర్బార్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్, సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇక ఆ తర్వాత ఆ రేంజ్ లో థియేటర్స్ లో సందడి చేసిన అవకాశం లేకుండా పోయింది. కరోనా వల్ల దాదాపు ఎనిమిది నెలలు థియేటర్ ల మొహం చూడలేదు. ఇక క్రిస్మస్ కు రిలీజ్ అయిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా మంచి సాలిడ్ ఓపెనింగ్ ఇచ్చింది. ఒక రకంగా ఈ సినిమా మంచి బూస్టప్ ఇచ్చిందని చెప్పొచ్చు. కేవలం 50% ఆక్యూపెన్సీ ఉన్నాకానీ మంచి కలెక్షన్స్ రాబట్టుకుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

"ఒక్కడు" మూవీ సీక్వెల్ ?

సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్ బాబు,భూమిక జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "ఒక్కడు "మూవీ ఘనవిజయం సాధించి మహేష్ బాబు సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. 8 నందిఅవార్డ్స్ ,4 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్న"ఒక్కడు" మూవీ కన్నడ , తమిళ , బెంగాలీ , హిందీ భాషలలో రీమేక్ జరుపుకుని ఘనవిజయం సాధించింది. చార్మినార్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన "ఒక్కడు" మూవీ కై భారీ వ్యయం తో చార్మినార్ సెట్ ను రూపొందించడం విశేషం. మణిశర్మ సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సిమ్లా లో కొత్త జంట

టాలీవుడ్ ,కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న కాజల్ అగర్వాల్ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లోతన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న కాజల్ ప్రస్తుతం "ఆచార్య ", "మోసగాళ్ళు ", "ఇండియన్ 2", "హే సినామికా" (తమిళ ), "ముంబై సాగ"(హిందీ ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. ఒక ఫాంటసీ హారర్ కామెడీ తమిళ మూవీ కి కాజల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'చెక్' ఫస్ట్ గ్లింప్స్ - ఖైదీ చదరంగం

నితిన్-చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో చెక్ సినిమా తెరకెక్కుతుంది. లాక్‌డౌన్‌కు ముందు ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈసినిమా నుండి న్యూ ఇయర్ సందర్భంగా కొత్త అప్ డేట్ ఇచ్చారు. ఈ సినిమా నుండి చిన్నపాటి వీడియోను ఒకటి రిలీజ్ చేసారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
Dirty Hari Movie To Hit Theatres On January 8th,Dirty Hari to Release in Theatres on Jan 8th,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Latest Tollywood News,Dirty Hari,Dirty Hari Movie,Dirty Hari Film,Di
సినిమా వార్తలు

థియేటర్ లోకి 'డర్టీ హరి'

శ్రవణ్ రెడ్డి, సిమ్రత్ కౌర్, రుహానిశర్మలు హీరో హీరోయిన్లుగా ఎం.ఎస్‌.రాజు తెరకెక్కిస్తున్న సినిమా ’డ‌ర్టీ హ‌రి‘. రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే ఓటీటీల రిలీజ్ అయింది. నిజానికి ఈసినిమా ట్రైలర్స్ చూసి ఇందులో అడల్ట్ కంటెంట్ ఉంటుందేమో.. ప్రేక్షకులను ఎలా రిసీవ్ చేసుకుంటారో అనుకున్నారు కానీ.. మంచి సస్పెన్స్ ఎలిమెంట్స్ తో మంచి టాక్ తో దూసుకుపోతుంది. మొదట స్ట్రీమింగ్ పెట్టగా మంచి వ్యూవ్స్ రావడంతో.. ఆ తర్వాత ఆహా లో రిలీజ్ చేశారు. ఇక ఏటీటీ, ఓటీటీలలో వచ్చిన స్పందన చూసిన దర్శకనిర్మాతలు ఈ సినిమాను థియేటర్ లో కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తి చేసుకున్న 'క్రాక్'

మహారాజా ర‌వితేజ‌, బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో మూడో చిత్రం 'క్రాక్‌'. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా వుంది. ఇక రవితేజ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ‘క్రాక్’ ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్ వీడియోగా నిలవడమే గాక రవితేజ ఖాతాలో సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఈ ట్రైలర్ కేవలం 24 గంటల్లోనే 7 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకోడమే కాదు 2 లక్షల మేర లైక్స్ ను సొంతం చేసుకుంది.

TFN Adminవాట్సాప్
Yuganiki Okkadu 2,Yuganiki Okkadu Movie 2,Yuganiki Okkadu 2 Announcement,Yuganiki Okkadu 2 Hero Dhanush,Dhanush,Selvaraghavan,Yuganiki Okkadu Telugu Movie,Dhanush Yuganiki Okkadu 2,Actor Dhanush,Director Selvaraghavan,Selvaraghavan Yuganiki Okkadu 2,
ఫస్ట్ లుక్

"యుగానికి ఒక్కడు 2" మూవీ పోస్టర్ రిలీజ్

సూపర్ హిట్ "7/G బృందావన కాలని ", "ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే "మూవీస్ ఫేమ్ సెల్వ రాఘవన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా డ్రీమ్ వ్యాలీ బ్యానర్ పై రూపొందిన "ఆయిరిత్తిల్ ఒరువన్ "(యుగానికి ఒక్కడు )తమిళ మూవీ 2010 సంవత్సరంలో రిలీజ్ అయ్యి విజయం సాధించింది. చోళ డైనాస్టీ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ లో ప్రతీ సన్నివేశాన్నీ దర్శకుడు సెల్వ రాఘవన్ అద్భుతంగా తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. గ్రాఫిక్స్ , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ మూవీ కి హైలైట్ గా నిలిచాయి.

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

సంక్రాంతికి 'వకీల్ సాబ్' టీజర్

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో హిందీ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ ను తెలుగులో 'వకీల్ సాబ్' గా చేస్తున్నసంగతి తెలిసిందే కదా. ఇక ఇటీవలే వకీల్ సాబ్ చిత్రయూనిట్ కూడా షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లోకి అడుగుపెట్టింది.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

"పొగరు "తెలుగు ట్రైలర్ రిలీజ్

శ్రీ జగద్గురు మూవీస్ బ్యానర్ పై నంద కిషోర్ దర్శకత్వంలో ధృవ సర్జా , రష్మిక జంటగా కన్నడ , తెలుగు భాషలలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ "పొగరు"మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మూవీ లో "భైరవ గీత "మూవీ ఫేమ్ ధనంజయ్ , రాఘవేంద్ర రాజ్ కుమార్ , సంపత్ రాజ్ , రవికుమార్ , ఇంటర్ నేషనల్ బాడీ బిల్డర్స్ నటిస్తున్నారు. చందన్ శెట్టి సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్