గత ఏడాది రిలీజ్ కావాల్సిన సినిమాలు ఈ ఏడాది వరుసపెట్టి రెలీజ్ కు సిద్ధమవుతున్నాయి. కరోనా వల్ల లాక్ డౌన్ విధించడంతో కొన్ని సినిమాలు షూటింగ్ మధ్యలోనే ఆగిపోగా కొన్ని సినిమాలు రిలీజ్ లను కూడా ఆపాల్సి వచ్చింది. ఇక ఎలాగోలా కరోనా ప్రభావం కాస్త తగ్గడంతో థియేటర్స్ ఓపెన్ చేయడంతో పెండింగ్ లో ఉన్న సినిమాలన్నీ రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. అలా పెండింగ్ లో ఉన్న సినిమాల్లో రానా నటించిన అరణ్య సినిమా కూడా ఒకటి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రభు సోలమన్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి, జోయా హుస్సేన్ జంటగా “హాథీ మేరే సాథీ ” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో ‘అరణ్య’, తమిళ్‌లో కదన్ పేరుతో రిలీజ్ కానుంది. నిజానికి ఈ సినిమా గత ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ కావాల్సి వుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. మార్చి 26వ తేదీన థియేటర్ లలో రిలీజ్ చేస్తున్నట్టు రానా తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు.
Welcoming the new year and the new normal, we are excited to bring #HaathiMereSaathi, #Aranya, and #Kaadan on 26th March, in a theatre near you! #PrabuSolomon @PulkitSamrat @TheVishnuVishal @zyhssn @ShriyaP @ErosSTX @ErosMotionPics @ErosNow
— Rana Daggubati (@RanaDaggubati) January 6, 2021
పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఈరోస్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు ఇంకా ఈ సినిమాలో శ్రియ పిల్ గోవింకర్, పులకిత్ సామ్రాట్, జగపతి బాబు, పోసాని, విష్ణు విశాల్, మన్సూర్ అలీ ఖాన్ ముఖ్య పాత్రలలో నటించారు. శాంతాను మొయిత్రా సంగీతం అందించారు. ఇదికాక రానా “విరాటపర్వం” మూవీ కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: