‘అల్లుడు అదుర్స్’ ట్రైలర్ రిలీజ్ – కామెడీ ప్లస్ యాక్షన్

Bellamkonda Sreenivas New Movie Alludu Adhurs Trailer Is Out,Alludu Adhurs Trailer,Alludu Adhurs Movie,Bellamkonda Sreenivas,Nabha Natesh,DSP,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News, Alludu Adhurs Trailer, Alludu Adhurs Movie Trailer,Bellamkonda Srinivas New Movie Trailer,Bellamkonda Srinivas New Trailer,Bellamkonda Srinivas New Film, Alludu Adhurs Release Date,Upcoming Telugu Movies 2021,Telugu Movie Trailer,New Trailers,Aditya Music,Alludu Adhurs Trailer Is Out,Bellamkonda Sai Sreenivas Alludu Adhurs Trailer,#AlluduAdhurs

కరోనా వల్ల ఇన్ని నెలలు థియేటర్స్ మూతపడగా లాక్‌డౌన్‌ తర్వాత విడుదలైన ‘సోలో బ్రతుకే సో బెటర్‌’కి మంచి ప్రేక్షకాదరణ లభించడంతో అందరికీ ధైర్యం వచ్చింది. ఇక ఈ సంక్రాంతి సినీ లవర్స్ కు పెద్ద పండగ అని చెప్పొచ్చు. చాలా సినిమాలు థియేటర్ వద్ద సందడి చేయడానికి రెడీ అయ్యాయి. అందులో సాయి శ్రీనివాస్ సినిమా ‘అల్లుడు అదుర్స్’ సినిమా కూడా ఒకటి. సంక్రాంతి పండుగకు ఈ అల్లుడు కూడా సందడి చేయడానికి వచ్చేస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లం కొండ సాయి శ్రీనివాస్ హీరోగా ‘అల్లుడు అదుర్స్’ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 15న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా జోరుగా మొదలుపెట్టారు చిత్రయూనిట్. దీనిలో భాగంగాగే ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

ఇక ట్రైలర్ విషయానికొస్తే ఈ సినిమాలో కామెడీ యాంగిల్ ను కూడా ఉండేలా చూసుకున్నాడు సాయి శ్రీనివాస్. కొన్ని అనివార్య‌మైన కార‌ణాల వ‌ల్ల‌ ల‌వ్ అంటే నాన్సెస్ అని ఫీల‌య్యే అబ్బాయి.. ప్రేమ‌లో ప‌డితే ఎలా ఉంటుంద‌న్న‌ది సినిమా “ఒక్క‌సారి నాదీ అనుకుంటే దాని కోసం ప్రాణం ఇస్తా.. జాన్ దేదూంగా..” అంటూ తన పాత్రను పరిచయం చేస్తాడు. అంతేకాదు సాయి.. అప‌రిచితుడిలా మారి.. చంద్ర‌ముఖి అవ‌తారం ఎత్తి, దెయ్యంలా భ‌య‌పెట్ట‌డం, గొంతులు మార్చ‌డం… ట్రైల‌ర్‌లో చూపించారు. “శీనుగాడు నా ఫ్రెండు.. యాక్ష‌న్ సీక్వెన్స్‌లో వాడిది సెప‌రేట్ ట్రెండు.. ఇక్క‌డ హ్యాష్ ట్యాగ్స్ లేవ‌మ్మా..” అంటూ వెన్నెల కిషోర్ డైలాగ్ ఇవన్నీ ట్రైలర్ ను ఆకట్టుకునేలా చేసాయి. మొత్తానికి సాయి ఈసారి కొత్తగా కనిపిస్తాడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పొచ్చు.

కాగా ఈ సినిమాలో నభానటేశ్‌, అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్స్‌గా నటిస్తుండగా… సోనూసూద్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు… గొర్రెల సుబ్ర‌హ్మ‌ణ్యం నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × three =