లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘మాస్టర్’. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు. జనవరి 13న ఈ సినిమా విడుదలవుతుంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్ రిలీజ్ అవ్వగా వాటికి వచ్చిన రెస్పాన్స్ తో సినిమాపై మరింత భారీ అంచనాలు పెరిగాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా మాస్టర్ సినిమా ఇప్పుడు బంపర్ ఛాన్స్ కొట్టేసింది. కరోనా వల్ల ఇన్ని నెలలు థియేటర్స్ మూతపడిన సంగతి తెలిసిందే కదా. అయితే ఈ మధ్యనే అనుమతులు వచ్చాయి. ప్రజల భద్రత నేపథ్యంలో 50% ఆక్యూపెన్సీతో పర్మిషన్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మాస్టర్ టీం ప్రభుత్వాన్ని ఫుల్ ఆక్యూపెన్సీ ఇవ్వాలని కోరగా… ఇప్పుడు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం దానికి అనుమతి ఇచ్చినట్టు తెలుస్తుంది . కరోనా తగ్గుముఖం పట్టడంతో సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సుల్లో ప్రేక్షకుల సీటింగ్ సామర్థ్యాన్ని 50 శాతం నుంచి 100 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇక దాంతో విజయ్ సినిమాకు అదిరిపోయే ఓపెనింగ్స్ రావడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు.
కాగా ఈ సినిమాలో విజయ్ కు జోడీగా మాళవిక మోహనన్ నటిస్తుంది. ఎక్స్‌బి ఫిల్మ్ క్రియేటర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి విలన్‌గా నటించనున్నాడు. మలయాళ నటుడు ఆంటొని, శాంతను కీలక పాత్రలు చేస్తున్నారు. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. తమిళంతో పాటు తెలుగులోను కూడా రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో విజయ్ గ్యాంగ్ స్టర్ గా .. కాలేజ్ ప్రొఫెసర్ గా రెండు విభిన్నమైన లుక్స్ తో కనిపించనున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: