100% ఆక్యుపెన్సీ కోసం టాలీవుడ్

Telugu Film Producers Council Requests Government To Increase Theatre Occupancy Ratio To 100 Per Cent,Telugu Film Producers Requests Governments,Increase The Occupancy In Theatres From 50 To 100 Per Cent,Telugu Film Industry Roots For 100 Per Cent Occupancy In Theatres,Tollywood Producers Urge Telangana Govts To Allow Full Seating Capacity, Telugu Producers Ask For 100% Theatre Occupancy After Ts Govt's Move,Telugu Producers Ask AP And TS Governments To Allow Full Occupancy In Theatres,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News

కరోనా వల్ల దాదాపు ఎనిమిది నెలలు పైన థియేటర్స్ మూతపడిన సంగతి తెలిసిందే. ఇటీవలే థియేటర్స్ ఓపెన్ చేయడానికి ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. అయితే కరోనా నిబంధనలు అనుసరిస్తూ కేవలం 50శాతం ఆక్యూపెన్సీ ఇచ్చారు. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా తమిళనాడు ప్రభుత్వం 50 శాతం నుంచి 100 శాతంకు పెంచుతూ, కరోనా జాగ్రత్తలు పాటిస్తూ థియేటర్లు నడుపుకునేందుకు అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. దీనితో తెలుగు రాష్ట్రాలు కూడా 100 అక్యూపెన్సీ కోరుతూ ప్రభుత్వాలను కోరింది టాలీవుడ్ పరిశ్రమ .

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తెలుగు సినిమా నిర్మాతల మండలి సీటింగ్‌ సామర్థ్యాన్ని 50 శాతం నుంచి 100 శాతానికి పెంచుకోడానికి అనుమతి ఇవ్వాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలనకు విజ్ఞప్తి చేస్తూ లేఖ రాసింది. అంతేకాదు 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో నడపడం వల్ల థియేటర్ల నిర్వహణకు ఎక్కవ ఖర్చు అవుతుందని, దీని వల్ల థియేటర్ల యాజమాన్యాలు నష్టాలను భరించాల్సి వస్తుందని నిర్మాతల మండలి పేర్కొంది. తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే దీనికి అనుమతి ఇచ్చిందని.. తెలుగు రాష్ట్రాల్లోనూ 100 శాతం సీటింగ్ కెపాసిటీతో చిత్ర ప్రదర్శనలకు అనుమతి ఇవ్వాలంటూ నిర్మాతల మండలి కోరింది. మరి చూద్దాం దీనికి రెండు ప్రభుత్వాలు ఒప్పుకుంటాయో..లేదో..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + 7 =