‘రాధే శ్యామ్’ టీజర్ అప్ డేట్ త్వరలో

Update on Radhe Shyam Movie Teaser To Come Soon,Radhe Shyam,Radhe Shyam Movie,Radhe Shyam Telugu Movie,Director Radha Krishna,Radhe Shyam Movie Teaser Update,Radhe Shyam Movie Latest Updates,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Radha Krishna Kumar on Twitter,Radhe Shyam teaser very soon,Teaser of Radhe Shyam is on the way,Prabhas,Rebel Star Prabhas,Actor Prabhas,Hero Prabhas,Actress Pooja Hegde,Pooja Hegde,Heroine Pooja Hegde,Radhe Shyam Teaser Update Soon

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలను చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక అభిమానులు కూడా తమ హీరో సినిమా అప్ డేట్స్ కోసం ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఒకప్పటిలా కాదులే కానీ ఈ మధ్యకాలంలో బాగానే అప్ డేట్స్ ఇస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ప్రస్తుతం రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వం లో ప్రభాస్ హీరోగా రాధేశ్యామ్ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమానుండి పలు పోస్టర్స్.. ‘బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్’ అంటూ థీమ్ వీడియోను కూడా రిలీజ్ చేసారు. అయితే అభిమానులు మాత్రం టీజర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేకాదు సోషల్ మీడియా వేదికగా అప్ డేట్ ఇవ్వమని కూడా అడుగుతున్నారు అభిమానులు. ఈ నేప‌థ్యంలోరాధాకృష్ణ త‌న ట్విట్ట‌ర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. టీజ‌ర్ అప్‌డేట్ త్వ‌ర‌లోనే రానుంది. కాస్త ఓపిక‌తో ఉండండి. మీ ఓపిక‌కు తగ్గ ప్ర‌తిఫ‌లం ద‌క్కేలా టీజ‌ర్ ఉంటుంద‌ని నేను ప్రామిస్ చేస్తున్నాను అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

కాగా ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. భాగ్య శ్రీ, మురళీ శర్మ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, సచిన్ ఖేదేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ప్ర‌ముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్ జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − 4 =