కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Latest Tollywood News

ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 78

షూటింగ్ అప్‌డేట్

స్పీడుమీదున్న అనిల్.. సెకండ్ షెడ్యూల్ పూర్తి

అలా సినిమా మొదలు పెట్టాడో లేదో ఇలా షూటింగ్ ను పూర్తి చేసేస్తున్నాడు అనిల్ రావిపూడి. అనిల్ రావిపూడి డైరెక్షన్ గురించి మనకు తెలిసిందే.. చాలా తక్కువ టైం షూటింగ్ ను కంప్లీట్ చేసే డైరెక్టర్స్ లో అనిల్ రావిపూడి కూడా ముందుంటాడు. ఒక్కసారి సినిమా మొదలు పెడితే మినిమమ్ 5 నెలల్లో కంప్లీట్ చేసేస్తాడు. ఇప్పటికే మనం చూశాం. ఇప్పుడు ఎఫ్3 సినిమా షూటింగ్ కూడా రాపిడ్ స్పీడ్ లో అవ్వగొడుతున్నాడు.

TFN Adminవాట్సాప్
Rebel Star Krishnam Raju Shares His Excitement For Radhe Shyam Movie With A Tweet,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Rebel Star Krishnam Raju,Prabhas,Actor Prabhas,Rebel Star
సినిమా వార్తలు

ప్రభాస్ తో ఆ కాలం చూద్దాం

రాధా కృష్ణ దర్శకత్వంలో ప్రభాస్, పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో రాధే శ్యామ్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చివరి దశకు వచ్చేసింది. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేయగా అది ఇంకా వ్యూస్ తో దూసుకుపోతూనే ఉంది. అంతేకాదు రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. జులై 30న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఆడియన్స్ లో మార్పు సినిమాలకు మంచిదే

ఒకప్పుడు సినిమాలు అంటే ఇలానే ఉండాలి అన్న కొన్ని ఫార్ములాలు ఉండేవి. కొన్ని సినిమాలు సందేశాత్మకంగా వచ్చినా చాలా వరకూ ఒకే ధోరణిలో నడిచేవి. హీరో హీరోయిన్.. ఫైట్స్.. పాటలు..కామెడీ.. ఇవే ఎలిమెంట్స్ తో కొన్ని వేల సినిమాలు వచ్చాయి ఇప్పటి వరకూ. ఇక క్లైమాక్స్ అయితే కొంచం కూడా తేడా ఉండకూడదు. ఏది ఏమైనా క్లైమాక్స్ లో హీరో హీరోయిన్ కలవాల్సిందే. లేకపోతే ఆడియన్సే డిజప్పాయింట్ అవుతారని..అలా లేకపోతే ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేరని దర్శక నిర్మాతలకి భయం. అందుకే పక్క ఇండస్ట్రీ వాళ్లు ఇలాంటి ధైర్యం చేసినా మనవాళ్లు మాత్రం చేయలేకపోయారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ప్రభాస్ ఫ్యాన్స్ కు నాగ్ అశ్విన్ సారీ

అందరి ఫ్యాన్స్ సంగతి ఏమో కానీ ప్రభాస్ ఫ్యాన్స్ కు మాత్రం ఈ మధ్య మంచి సర్ఫరైజ్ లే అందుతున్నాయి. ఒకప్పుడు ఒక అప్ డేట్ కోసం ఎదురుచూసే అభిమానులకు ఈ మధ్య అప్ డేట్స్ మీద అప్ డేట్స్ ఇస్తూ కుష్ చేస్తున్నారు ప్రభాస్ సినిమాల దర్శక నిర్మాతలు. ఈ నేపథ్యంలో ఒక డైరెక్టర్ మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ కు సారీ చెపుతున్నారు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు నాగ్ అశ్విన్. ఇంతకీ నాగ్ అశ్విన్ సారీ చెప్పడానికి కారణం ఏంటంటే.. గతంలో ‘జనవరి 29న కానీ ఫిబ్రవరి 26న కానీ ప్రభాస్ సినిమా అప్ డేట్ కచ్చితంగా ఇస్తానని నాగ్ అశ్విన్ ప్రభాస్ ఫ్యాన్స్ కు మాటిచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక ప్రామిస్ చేసినట్టే నాగ్ అశ్విన్ జనవరి 29 న ఈ సినిమాకు…

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'పాగల్' టీజర్ కు టైమ్ ఫిక్స్

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు విశ్వక్ సేన్. ఈ నగరానికి ఏమైంది సినిమాలో ఆకట్టుకున్న విశ్వక్ సేన్.. ఆ తర్వాత ఫలక్‌నామా దాస్ సినిమాకు హీరో గా డైరెక్టర్ గా చేసి సక్సెస్ కొట్టాడు. ఆ సినిమాలోని మాస్ యాక్షన్ తో మాస్ కా దాస్ అనిపించుకున్నాడు. ఆ తర్వాత వెంటనే ‘హిట్’ అంటూ క్రైమ్ థ్రిల్లర్ తీసి హిట్ కొట్టాడు.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'అక్షర' ట్రైలర్ రిలీజ్

బి.చిన్నికృష్ణ దర్శకత్వంలో నందిత శ్వేత ప్రధాన పాత్రలో ‘అక్షర’ అనే థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా కూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన సినిమా. కొన్ని కారణాల వల్ల రిలీజ్ కు బ్రేక్ పడితే.. కరోనా వల్ల మొత్తానికే లాంగ్ గ్యాప్ వచ్చింది. ఇక ఇప్పుడు థియేటర్స్ ఓపెన్ అయ్యాయి కాబట్టి థియేటర్ లో రిలీజ్ చేయనున్నారు. సినిమాపై నమ్మకంతోనే ఓటీటీ నుండి ఎన్ని ఆఫర్స్ వచ్చినా థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలని చిత్రయూనిట్ చూస్తుంది. ఈ సినిమాను ఫిబ్రవరి 26న రిలీజ్ చేస్తున్నట్టు ఇటీవలే ప్రకటించారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అఖిల్ కోసమే ఈ ప్రాజెక్ట్ చేస్తున్నా

బిగ్ బాస్ రియాలిటీ షో గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పేదేముంది. మన తెలుగులో అయితే ఇప్పటికి 4 సీజన్స్ ముగిసాయి. ఇక ప్రతి సీజన్ లో ఎవరో ఒకరు ఆడియన్స్ కు కనెక్ట్ అవుతారు వారు విజేతగా నిలుస్తారు. అయితే ఈ రియాలిటీ షో లో లవ్ బర్డ్స్ అంటూ కొన్ని జంటలు మాత్రం స్పెషల్ గా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి. సీజన్ వన్ లో పెద్దగా అలాంటిది ఏం లేకపోయినా.. ప్రిన్స్-దీక్షా అంటూ ఏడిపించేవాళ్లు. అయితే సీజన్ 2 లో మాత్రం సామ్రాట్-తేజస్వి లవ్ బర్డ్స్ గా ఉండేవారు.. ఇక సీజన్ 3 లో రాహుల్-పునర్నవి.. సీజన్ 4 లో అఖిల్-మోనాల్ ఇలా సీజన్ కు ఒక జంట హైలైట్ అవుతుంది.

TFN Adminవాట్సాప్
Sree Vishnu New Movie Titled Bhala Thandanana,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Sree Vishnu,Actor Sree Vishnu,Hero Sree Vishnu,Sree Vishnu New Movie,Sree Vishnu New Movie Ti
సినిమా వార్తలు

శ్రీ విష్ణు కొత్త సినిమా టైటిల్ 'భళా తందనాన'

ప్రస్తుతం శ్రీవిష్ణు వరుస సినిమాలకు ఓకే చెప్తూ మంచి జోరు చూపిస్తున్నాడు. ఇప్పటికే హసిత్ గోలి దర్శకత్వంలో ‘రాజ రాజ చోర’ సినిమా చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ కలిసి నిర్మిస్తున్న ఈసినిమా చివరి దశకు వచ్చింది. శ్రీ విష్ణు, ల‌వ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా అనీష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ‘గాలి సంపత్’ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో రాజేంద్ర ‌ప్ర‌సాద్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కూడా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ప్రవీణ్ సత్తారు- నాగార్జున సినిమా ప్రారంభం

యంగ్ హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా వరుస పెట్టి సినిమాలను లైన్ లో పెడుతున్నారు అగ్ర హీరోలు కూడా. ఇప్పటికే చిరు డైరీ లో ఆచార్య తో పాటు మరో మూడు సినిమాలు క్యూ లో ఉన్నాయి. ఆచార్య షూటింగ్ ఇంకా పూర్తి కాకముందే ఇటీవలే లూసిఫర్ సినిమాను కూడా లాంచ్ చేసాడు. ఇక ఇప్పుడు కింగ్ నాగార్జున కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. కొన్ని రోజులుగా కింగ్ నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో ఓ మూవీ వస్తున్న సంగతి తెలిసిందే కదా. గతంలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారికంగా ప్రకటించారు కూడా.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'షాదీ ముబారక్' టీజర్ రిలీజ్

పద్మశ్రీ దర్శకత్వంలో సాగర్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘షాదీ ముబారక్’. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఇటీవలే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా ఇప్ప్పుడు తాజాగా ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్ పూర్తి చేసుకున్న 'బ్ర‌హ్మాస్త్ర'

కరోనా వల్ల పెద్దా చిన్నా అనే తేడా లేకుండా అన్ని సినిమాల షూటింగ్ లు రద్దయ్యాయి. దాని ఎఫెక్ట్ వల్ల ఎప్పుడో రావాల్సిన సినిమాలు కూడా వాయిదా పడ్డాయి. అలాంటి సినిమాల్లో నాగ్ నటిస్తున్న బాలీవుడ్ సినిమా బ్రహ్మాస్త సినిమా కూడా ఉంది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ చేశారు. దాదాపు రెండేళ్లు అవ్వొస్తుంది. మధ్యలో కరోనా వల్ల ఇంకా లేట్ అయింది. అయితే లాక్‌డౌన్ సమయంలో విజువల్ ఎఫెక్ట్స్, డబ్బింగ్, ఇతర పనులను కొంతమేరకు పూర్తి చేసుకుంది చిత్రయూనిట్. ఇక ఇటీవలే మళ్లీ షూటింగ్ ను స్టార్ట్ చేసి ఫైనల్లీ ఫినిష్ చేసుకున్నారు.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

కపటధారి థీమ్ ట్రైలర్ రిలీజ్

ఈ మధ్య విభిన్నమైన సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు సుమంత్. ఇదం జగత్, సుబ్రహ్మణ్యపురం సినిమాల తర్వాత ఇప్పుడు మరో థ్రిల్లర్ సినిమాతో వస్తున్నాడు. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో సుమంత్ ఇప్పుడు 'కపటధారి' అనే మరో డిఫరెంట్ కథతో వస్తున్న సంగతి తెలిసిందే. క‌న్న‌డంలో సూప‌ర్‌హిట్ట‌యిన `కవలుదారి` సినిమాకు ఇది తెలుగు రీమేక్‌. కన్నడలో రిషి పోషించిన ట్రాఫిక్ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ పాత్రలో చేయిఫా సుమంత్ నటించారు. అన్ని పనులు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమా ట్రైలర్ ను కూడా ఇటీవలే రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ రావడంతో పాటు సినిమాపై అంచనాలు కూడా పెరిగాయి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'కళ్యాణ్ రామ్' కొత్త సినిమా ప్రారంభం

కళ్యాణ్ రామ్ కూడా స్పీడ్ పెంచాడు. ఇన్ని రోజులు గ్యాప్ తీసుకున్న కళ్యాణ్ రామ్ ఇప్పుడు వరుస పెట్టి సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే నూతన దర్శకుడు మల్లిడి వశిష్టతో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకి 'తుగ్లక్' అనే టైటిల్ ను అనుకున్నట్టు గతంలో వార్తలు వచ్చిన సంగతి కూడా విదితమే. ఈ సినిమాను ఎన్టీఆర్‌ బ్యానర్‌పై అతడే స్వయంగా నిర్మిస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

విశాల్ 'చక్ర' స్నీక్ పీక్

ఎం ఎస్ ఆనందన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా చక్ర సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈసినిమా సైబర్ క్రైమ్స్ నేపథ్యంలో రూపొందుతుంది. ఫుల్ టెక్నికల్ విలువ‌ల‌తో కొత్త క‌థ-క‌థనాల‌తో ఈ చిత్రం రూపొందించినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో కూడా మరోసారి విశాల్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా కూడా ఎప్పుడో అన్ని పనులు ముగించుకొని రిలీజ్ కు రెడీ గా ఉంది. ఇప్పటికే విడుద‌ల చేసిన ట్రైల‌ర్, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
ఫస్ట్ లుక్

'వాలిమై' నుండి త్వరలో ఫస్ట్ లుక్

కొంత మంది తమిళ్ హీరోలకు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అలాంటి హీరోల్లో అజిత్ కూడా ఒకరు. అందుకే తన సినిమాలను తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేస్తుంటారు. ప్రస్తుతం అజిత్ హెచ్. వినోత్ దర్శకత్వంలో ‘వాలిమై’ సినిమా చేస్తున్న తెలిసిందే. ఈ సినిమాలో అజిత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇటీవలే ఈ సినిమా హైద్రాబాద్ లో షూటింగ్ ను ముగించుకుంది. ఇంకా కొంత మేరకు మాత్రమే చిత్రీకరణ మిగిలి ఉంది.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'షాదీ ముబారక్' టీజర్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్

ఒకపక్క పెద్ద పెద్ద సినిమాలను తెరకెక్కిస్తూనే మరో పక్క చిన్న సినిమాలను కూడా ప్రోత్సహిస్తుంటారు టాలీవుడ్ టాప్ డైరెక్టర్ దిల్ రాజు. కథ నచ్చితే అది పెద్ద సినిమానా చిన్న సినిమానా అని చూడకుండా కొత్త వాళ్లతో చిన్న చిన్న సినిమాలను కూడా నిర్మిస్తూ.. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తున్నారు. తాజాగా మరో చిన్న సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు దిల్ రాజు.

TFN Adminవాట్సాప్
ఫస్ట్ లుక్

'గుర్తుందా శీతాకాలం' ఫస్ట్ లుక్ రిలీజ్

నాగశేఖర్ దర్శకత్వంలో స‌త్యదేవ్ హీరోగా, మిల్కీబ్యూటి త‌మన్నా హీరోయిన్‌గా ‘గుర్తుందా శీతాకాలం’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కన్నడలో సూపర్ హిట్ అయిన 'లవ్ మాక్ టైల్' సినిమాకు రీమేక్ ఇది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇటీవలే మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకొని.. మరో షెడ్యూల్ కోసం చూస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'పక్కా కమర్షియల్' అంటున్న మారుతి-గోపీచంద్

కమర్షియల్ సినిమాలకు కూడా తన మార్క్ కామెడీని జోడించి హిట్ కొట్టడంలో మారుతి ఎక్స్పర్ట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సాయి ధరమ్ తేజ్ తో ప్ర‌తీరోజు పండ‌గే వంటి సూప‌ర్ హిట్ చిత్రాన్ని అందించిన మారుతి కొత్త సినిమాకు చాలా గ్యాపే తీసుకున్నాడు. మధ్యలో కరోనా రావడం వల్ల ఇంకా లేట్ అయిందనుకోండి. ఇక ఇప్పడూ మ్యాచో హీరో గోపీచంద్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. గోపిచంద్ కు ఇది 29వ సినిమా కాగా.. మారుతికి 10వ సినిమా.

TFN Adminవాట్సాప్
Nandamuri Kalyan Ram Is Back As Agent Vinod,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Nandamuri Kalyan Ram,Actor Kalyan Ram,Hero Kalyan Ram,Agent Vinod,Agent Vinod Movie,Agent Vinod
సినిమా వార్తలు

'ఎజెంట్ వినోద్' గా కళ్యాణ్ రామ్

'118' సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన కళ్యాణ్ రామ్ ఆ తర్వాత వచ్చిన 'ఎంత మంచి వాడవురా' సినిమాతో కాస్త వెనక పడ్డాడు. ఇక ఇప్పుడు చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత మరో విభిన్నమైన కథతో వచ్చేందుకు సిద్దమయ్యాడు. బాబు బాగా బిజీ ఫేమ్ న‌వీన్ మేడారం డైరెక్టర్ తో సినిమా చేస్తున్న చేస్తున్న సంగతి తెలిసిందే కదా. నిజానికి ఈ సినిమాను 2020 లోనే ప్రకటించారు. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్ ను కూడా అప్పట్లో రిలీజ్ చేశారు. ఈ మూవీకి ఎజెంట్ వినోద్ గా టైటిల్ ఖ‌రారు చేశారు.

TFN Adminవాట్సాప్
Vijay Devarakonda Heads To Mumbai To Join Liger Movie Shoot,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Vijay Devarakonda,Actor Vijay Devarakonda,Hero Vijay Devarakonda,Vijay Devarako
సినిమా వార్తలు

ముంబై లో ల్యాండ్ అయిన 'లైగర్'

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ దేవరకొండ హీరోగా స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్‌లో వస్తున్న సినిమా 'లైగర్'. రెండు రోజుల క్రితమే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు చిత్రయూనిట్. సెప్టెంబర్ 9వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు అధికారికంగా తెలిపారు. నిజానికి ఈ సినిమా షూటింగ్ కూడా ఎప్పుడో పూర్తవ్వాలి కానీ కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడింది. ఇప్పటికే ముంబైలో కొద్దిరోజులు షూటింగ్ జరుపుకుంది కూడా. లాక్ డౌన్ వల్ల ఇక్కడికి రావాల్సి వచ్చింది.

TFN Adminవాట్సాప్

షేర్