ప్రవీణ్ సత్తారు- నాగార్జున సినిమా ప్రారంభం

Director Praveen Sattaru and Nagarjuna Akkineni New Movie Hits The Sets Today,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Director Praveen Sattaru,Praveen Sattaru,Nagarjuna Akkineni,Actor Nagarjuna,Hero Nagarjuna,Praveen Sattaru and Nagarjuna Akkineni New Movie,King Nagarjuna New Movie Launching,Praveen Sattaru and Nagarjuna New Movie Start,Nagarjuna and Praveen Sattaru New Movie Launch,Praveen Sattaru and Nagarjuna New Movie Launch Ceremony,Nagarjuna and Praveen Sattaru Team Up,Nagarjuna and Praveen Sattaru New Movie Hits The Sets Today,Nagarjuna Akkineni Upcoming Movie,Nagarjuna Akkineni Next Project,Nagarjuna Akkineni Latest Film,Nagarjuna Akkineni New Movie News,Nagarjuna Akkineni Next

యంగ్ హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా వరుస పెట్టి సినిమాలను లైన్ లో పెడుతున్నారు అగ్ర హీరోలు కూడా. ఇప్పటికే చిరు డైరీ లో ఆచార్య తో పాటు మరో మూడు సినిమాలు క్యూ లో ఉన్నాయి. ఆచార్య షూటింగ్ ఇంకా పూర్తి కాకముందే ఇటీవలే లూసిఫర్ సినిమాను కూడా లాంచ్ చేసాడు. ఇక ఇప్పుడు కింగ్ నాగార్జున కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. కొన్ని రోజులుగా కింగ్ నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో ఓ మూవీ వస్తున్న సంగతి తెలిసిందే కదా. గతంలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారికంగా ప్రకటించారు కూడా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.. చిత్ర యూనిట్‌తో పాటు నాగార్జున కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. త్వరలోనే షూటింగ్ ప్రారంభించాలన్న ప్లాన్ లో ఉన్నారు. అంతేకాదు ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో బాలీవుడ్ బ్యూటీ గుల్ పానంగ్ నటించబోతున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ తెలిపింది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు.

ఇక కింగ్ నాగార్జున తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్ లో కూడా సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో బ్రహ్మాస్త్ర సినిమా చేయగా తాజాగా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక దీనితో పాటు వైల్డ్ డాగ్ సినిమా కూడా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా షూటింగ్ ను పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇంకా ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ‘నాన్ రుద్రన్’ భారీ మల్టీ స్టారర్ సినిమాలో కూడా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకా ఇక సోగ్గాడే చిన్ని నాయ‌నా సినిమాకు ప్రీక్వెల్‌గా బంగార్రాజు అనే సినిమా చేయ‌నున్నాడ‌ని కొన్నాళ్ళుగా వార్త‌లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని క‌ళ్యాణ్ కృష్ణ తెర‌కెక్కించ‌నున్నాడు. మరి ఇది ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 14 =