కమర్షియల్ సినిమాలకు కూడా తన మార్క్ కామెడీని జోడించి హిట్ కొట్టడంలో మారుతి ఎక్స్పర్ట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సాయి ధరమ్ తేజ్ తో ప్రతీరోజు పండగే వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన మారుతి కొత్త సినిమాకు చాలా గ్యాపే తీసుకున్నాడు. మధ్యలో కరోనా రావడం వల్ల ఇంకా లేట్ అయిందనుకోండి. ఇక ఇప్పడూ మ్యాచో హీరో గోపీచంద్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. గోపిచంద్ కు ఇది 29వ సినిమా కాగా.. మారుతికి 10వ సినిమా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈ సినిమా టైటిల్ ను ఫిక్స్ చేసేశారు చిత్రయూనిట్. ప్రేమికుల రోజు సందర్భంగా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇస్తూ చిత్ర టైటిల్ ను రిలీజ్ చేశారు. ‘పక్కా కమర్షియల్’ అనే ఆసక్తికర టైటిల్ ను ఈ సినిమాకు ఫిక్స్ చేశారు. మార్చి 5 నుండి రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించనున్నారు.
#PakkaCommercial It is..👌@YoursGopichand @DirectorMaruthi‘s
High dose of ‘Pakka Commerical’ entertainment Loading 💥Shoot begins from 5th March, In theatres from Oct 1st, 2021.#AlluAravind #BunnyVas @JxBe #KarmChawla #Raveendar @SKNonline @UV_Creations @GA2Official pic.twitter.com/H3DwloqSWV
— GA2 Pictures (@GA2Official) February 14, 2021
కాగా గీతా-2 ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై ఈ సినిమా తెరకెక్కుతుంది. జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్, బన్నీవాసు, మారుతి కాంబినేషన్ లో ఇది మూడో సినిమా రావడం. గతంలో ఈ బ్యానర్స్ ద్వారానే దర్శకుడు మారుతి ”భలేభలే మగాడివోయ్, ప్రతిరోజు పండగే” వంటి సినిమాలు తీశాడు. హిట్ కొట్టాడు. ఇక ఈ సినిమా కోసం మళ్లీ రాశీ ఖన్నానే హీరోయిన్ గా తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. దానిపైక్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వరకూ ఆగాల్సిందే. ఇతరనటీనటులు.. సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు. జేక్స్‌బిజోయ్ సంగీతం అందిస్తుండగా.. అక్టోబర్ 1న ఈ సినిమా ను రిలీజ్ చేయనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: