బిగ్ బాస్ రియాలిటీ షో గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పేదేముంది. మన తెలుగులో అయితే ఇప్పటికి 4 సీజన్స్ ముగిసాయి. ఇక ప్రతి సీజన్ లో ఎవరో ఒకరు ఆడియన్స్ కు కనెక్ట్ అవుతారు వారు విజేతగా నిలుస్తారు. అయితే ఈ రియాలిటీ షో లో లవ్ బర్డ్స్ అంటూ కొన్ని జంటలు మాత్రం స్పెషల్ గా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి. సీజన్ వన్ లో పెద్దగా అలాంటిది ఏం లేకపోయినా.. ప్రిన్స్-దీక్షా అంటూ ఏడిపించేవాళ్లు. అయితే సీజన్ 2 లో మాత్రం సామ్రాట్-తేజస్వి లవ్ బర్డ్స్ గా ఉండేవారు.. ఇక సీజన్ 3 లో రాహుల్-పునర్నవి.. సీజన్ 4 లో అఖిల్-మోనాల్ ఇలా సీజన్ కు ఒక జంట హైలైట్ అవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే అన్ని సీజన్స్ తో పోల్చుకుంటే అఖిల్-మోనాల్ కాస్త ఎక్కువే ఫేమస్ అయ్యారని చెప్పొచ్చు. కొట్టుకున్నా, తిట్టుకున్నా, ప్రేమ, అలకలు ఇలా ఒకరిపై ఒకరు చూపించుకున్నారు.. కలిసిపోయారు.. చివరి వరకూ మోనాల్ కు చాలా సపోర్టివ్ గా ఉన్న మనిషి అఖిల్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే అఖిల్-మోనాల్ జంట ఇంకొంచం ఎక్కువ రిజిస్టర్ అయింది.
ఇక ఇప్పుడు ఈ జంట మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తున్నారు. అఖిల్, మోనాల్ జంటగాతెలుగు అబ్బాయి గుజరాతీ అమ్మాయి అనే వెబ్ సిరీస్‌తో త్వరలోనే ప్రేక్షకులని పలకరించబోతున్నారు. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల కాగా, ఇది ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా మోనాల్ అఖిల్ కోసమే ఈ ప్రాజెక్ట్‌కు సైన్ చేసానని.. అఖిల్ అని చెప్పేసరికి ఏ మాత్రం ఆలోచించకుండా సైన్ చేశాను… ప్రేక్షకులు మా ఇద్దరిని స్క్రీన్‌పై చూడాలిని అనుకుంటున్నారనే విషయం నాకు తెలుసు అని మోనాల్ స్పష్టం చేసింది. కాగా సరస్వతీ క్రియేషన్స్ పతాకంపై భాస్కర్ బంటుపల్లి దర్శకత్వంలో ఎ. భాస్కర్ రావు ఈ వెబ్ సిరీస్ నిర్మిస్తున్నారు. మరి ఈ వెబ్ సిరీస్ చూడాలంటే వచ్చేంత వరకూ వెయిట్ చేయాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: