కొంత మంది తమిళ్ హీరోలకు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అలాంటి హీరోల్లో అజిత్ కూడా ఒకరు. అందుకే తన సినిమాలను తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేస్తుంటారు. ప్రస్తుతం అజిత్ హెచ్. వినోత్ దర్శకత్వంలో ‘వాలిమై’ సినిమా చేస్తున్న తెలిసిందే. ఈ సినిమాలో అజిత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇటీవలే ఈ సినిమా హైద్రాబాద్ లో షూటింగ్ ను ముగించుకుంది. ఇంకా కొంత మేరకు మాత్రమే చిత్రీకరణ మిగిలి ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమా నుండి అప్ డేట్ కోసం.. ఫస్ట్ లుక్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బోనీ కపూర్ ఒక అప్ డేట్ ఇచ్చారు. వాలిమై సినిమా పై ఇంత ప్రేమ చూపిస్తున్న అభిమానులకు వందనం.. త్వరలోనే ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తామని ట్విట్టర్ ద్వారా తెలిపారు.
Wanakam. Humbled by your love towards our film “Valimai”. Bear with us as we work on presenting the First look soon. It’s in the best interests of the film. #Valimai #ValimaiUpdate #AjithKumar
— Boney Kapoor (@BoneyKapoor) February 15, 2021
ఇక యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ‘బేవ్యూ ప్రాజెక్ట్స్’ బ్యానర్ పై బోనీ కపూర్ నిర్మిస్తున్నాడు. ఇందులో కథనాయికగా బాలీవుడ్ నటి హుమా ఖురేషి నటిస్తుండగా… టాలీవుడ్ హీరో కార్తికేయ విలన్‌గా కనిపించనున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. అన్ని పనులు త్వరలోనే పూర్తి చేసి సినిమాను కూడా తొందర్లోనే రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు.
మరి వీరు ముగ్గురు అజిత్, బోనీకపూర్, దర్శకుడు హెచ్. వినోద్ కాంబినేషన్ లోనే వచ్చిన ‘నెర్కొండ పార్వై’ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్టైంది. దానితోనే మళ్లీ సేమ్ కాంబినేషన్ తో ఈ సినిమా తీస్తున్నారు. మరి ఈ సినిమా వారికి ఎంత వరకూ సక్సెస్ అందిస్తుందో చూద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: