ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు విశ్వక్ సేన్. ఈ నగరానికి ఏమైంది సినిమాలో ఆకట్టుకున్న విశ్వక్ సేన్.. ఆ తర్వాత ఫలక్‌నామా దాస్ సినిమాకు హీరో గా డైరెక్టర్ గా చేసి సక్సెస్ కొట్టాడు. ఆ సినిమాలోని మాస్ యాక్షన్ తో మాస్ కా దాస్ అనిపించుకున్నాడు. ఆ తర్వాత వెంటనే ‘హిట్’ అంటూ క్రైమ్ థ్రిల్లర్ తీసి హిట్ కొట్టాడు.
విశ్వక్ సేన్ ప్రస్తుతం లక్కీ మీడియా బ్యానర్ పై నూతన దర్శకుడు నరేష్ కుప్పిలి దర్శకత్వంలో ‘పాగల్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక గతకొద్ది రోజుల క్రితమే షూటింగ్ ను మొదలుపెట్టగా.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసి.. రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. ఏప్రిల్ 30న థియేటర్ లో సందడి చేయనుంది ఈ సినిమా. ఇక ఈ సినిమా నుండి టీజర్ కూడా రిలీజ్ చేయనున్నారు. దీనికి ముహూర్తం కూడా పెట్టేసారు. రేపు ఉదయం 11 గంటలకు టీజర్ రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
‘Mass ka Dass’ @VishwakSenActor’s #Paagal Teaser Tomorrow at 11AM 💥#PaagalOnApril30th@SVC_official @NaresshLee @radhanmusic #Manikandan #Garry @BekkemVenugopal @luckymediaoff #VS5 #VishwakSen pic.twitter.com/ohVywpQky2
— Sri Venkateswara Creations (@SVC_official) February 17, 2021
కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారో అన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, లక్కీ మీడియా పతాకాలపై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రధాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా మణికందన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
ఇక ఈ సినిమాతో పాటు విశ్వక్ సేన్ తమిళ్ హిట్ మూవీ ‘ఓ మై కడవులే’ తెలుగు రీమేక్ లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా కూడా ప్రారంభమైంది. త్వరలో ఈ సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. పీవీపీ సినిమాస్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అశ్వథ్ మరిముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందిస్తున్నాడు.




Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.