‘గుర్తుందా శీతాకాలం’ ఫస్ట్ లుక్ రిలీజ్

Gurthunda Seethakalam First Look Poster Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Gurthunda Seethakalam,Gurthunda Seethakalam Movie,Gurthunda Seethakalam Telugu Movie,Gurthunda Seethakalam Movie Poster,Gurthunda Seethakalam First Look Poster,Gurthunda Seethakalam First Look Poster Out,Gurthunda Seethakalam First Look Poster Released,Gurthunda Seethakalam First Look,Gurthunda Seethakalam Movie First Look Poster,Satya Dev,Actor Satya Dev,Hero Satya Dev,Satya Dev Gurthunda Seethakalam,Satya Dev Gurthunda Seethakalam First Look Poster,Tamannaah Bhatia,Gurthunda Seethakalam Trailer Release Update,Gurthunda Seethakalam Poster

నాగశేఖర్ దర్శకత్వంలో స‌త్యదేవ్ హీరోగా, మిల్కీబ్యూటి త‌మన్నా హీరోయిన్‌గా ‘గుర్తుందా శీతాకాలం’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కన్నడలో సూపర్ హిట్ అయిన ‘లవ్ మాక్ టైల్’ సినిమాకు రీమేక్ ఇది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇటీవలే మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకొని.. మరో షెడ్యూల్ కోసం చూస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ప్రేమికుల రోజున ఈ సినిమా నుండి కూడా అప్ డేట్ ఇచ్చారు చిత్రయూనిట్. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఇందులో సత్యదేవ్, తమన్నా చేతులు పట్టుకొని ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు. ఇక ఈ పోస్టర్ అందర్నీ ఆకట్టుకుంటుంది. అంతేకాదు త్వరలోనే ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలిపారు.

ఇంకా ఈ సినిమాలో మేఘా ఆకాష్, కావ్య‌శెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నాగ శేఖర్ మూవీస్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ సినిమాను నాగశేఖర్, భావన రవి నిర్మిస్తున్నారు. కీరవాణి తనయుడు కాల భైరవ సంగీతాన్ని అందిస్తుండగా.. సత్య హెగ్డే సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. ఈ సినిమాను కూడా తొందరగానే పూర్తి చేసి రిలీజ్ చేయాలన్న ప్లాన్ లో ఉన్నారు చిత్రయూనిట్. ఇక ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు.

ఇక ఈ సినిమాతో పాటు తమన్నా.. గోపీచంద్ నటిస్తున్న సీటిమార్ సినిమాలో నటిస్తుండగా… సత్యదేవ్ తిమ్మరుసు, అలానే గాడ్సే సినిమాలు చేస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − four =