శ్రీ విష్ణు కొత్త సినిమా టైటిల్ ‘భళా తందనాన’

Sree Vishnu New Movie Titled Bhala Thandanana,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Sree Vishnu,Actor Sree Vishnu,Hero Sree Vishnu,Sree Vishnu New Movie,Sree Vishnu New Movie Title,Bhala Thandanana,Bhala Thandanana Movie,Bhala Thandanana Film,Bhala Thandanana Telugu Movie,Bhala ThandananaMovie Telugu,Bhala Thandanana Sree Vishnu,Sree Vishnu Bhala Thandanana,Bhala Thandanana Shoot Begins,Sree Vishnu,Catherine Tresa,Mani Sharma,Chaitanya Dantuluri,Sree Vishnu Bhala Thandanana Movie,Sree Vishnu Bhala Thandanana Film,Sree Vishnu New Movie News,Sree Vishnu New Movie Updates,Sree Vishnu New Movie Announced,Sree Vishnu New Movie Bhala Thandanana,Sree Vishnu New Movie Title Fix,Sree Vishnu Next Bhala Thandanana

ప్రస్తుతం శ్రీవిష్ణు వరుస సినిమాలకు ఓకే చెప్తూ మంచి జోరు చూపిస్తున్నాడు. ఇప్పటికే హసిత్ గోలి దర్శకత్వంలో ‘రాజ రాజ చోర’ సినిమా చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ కలిసి నిర్మిస్తున్న ఈసినిమా చివరి దశకు వచ్చింది. శ్రీ విష్ణు, ల‌వ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా అనీష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ‘గాలి సంపత్’ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో రాజేంద్ర ‌ప్ర‌సాద్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కూడా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా మరో సినిమాను ప్రారంభించాడు. ‘బాణం’ ఫేమ్ చైతన్య దంతులూరి దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా ”భళా తందనాన” అనే సినిమా ప్రారంభమైంది. ఈ సినిమా మోషన్ పోస్టర్ ను కూడా నేడు రిలీజ్ చేశారు. ఇక మోషన్ పోస్టర్ లో కలం మరియు కత్తి లను చూపించడంతో మరో సారి శ్రీ విష్ణు కొత్త కాన్సెప్ట్ తో వస్తున్నట్టు అర్ధమవుతుంది.

కాగా ఈ సినిమాలో కేథరిన్ థెరిస్సా హీరోయిన్ గా నటిస్తుండగా.. వారాహి చలన చిత్రం బ్యానర్ పై సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక కె.జి.యఫ్’ సినిమాలో తన విలనిజంతో భయపెట్టిన రామచంద్రరాజు (గరుడ) ఈ చిత్రంలో మెయిన్ విలన్ గా కనిపించనున్నాడు. మెలోడీ బ్రహ్మా మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సురేష్ రగుతు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మార్చి నుండి ప్రారంభించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + 14 =