డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ దేవరకొండ హీరోగా స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్‌లో వస్తున్న సినిమా ‘లైగర్’. రెండు రోజుల క్రితమే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు చిత్రయూనిట్. సెప్టెంబర్ 9వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు అధికారికంగా తెలిపారు. నిజానికి ఈ సినిమా షూటింగ్ కూడా ఎప్పుడో పూర్తవ్వాలి కానీ కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడింది. ఇప్పటికే ముంబైలో కొద్దిరోజులు షూటింగ్ జరుపుకుంది కూడా. లాక్ డౌన్ వల్ల ఇక్కడికి రావాల్సి వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ సెట్స్ పైకి వెళ్లనుంది. లైగర్’ ముంబైలో ల్యాండ్ అయిందంటూ హీరో విజయ్ దేవరకొండ ఫొటోలను ఛార్మి కౌర్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. త్వరలోనే షూటింగ్‌లో పాల్గొనబోతున్నారనిపోస్ట్ లో పేర్కొంది.
View this post on Instagram
కాగా బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ ఒక కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తున్నాడు. ఓ డాన్ పాత్రలో సునీల్ శెట్టి కనిపిస్తారట ఈ మూవీ కి మణిశర్మ సంగీతం అందించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: