
ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 74

ఇటలీ లో స్టార్ యాంకర్ అనసూయ
భారీ బడ్జెట్ తో అఖిల్ అక్కినేని 5వ సినిమా
ప్రిన్స్ కు ఫిట్ నెస్ అవార్డ్
"ఉప్పెన "మూవీ సక్సెస్ మీట్ డేట్ ఫిక్స్
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న నాగార్జున

సూపర్ స్టార్ సినిమాలో జగ్గుభాయ్

ఆమీర్ ఖాన్ సినిమాలో చైతు..?
"మోసగాళ్ళు "ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కాజల్ సందడి
"జాతిరత్నాలు "మూవీ పై విజయ్ దేవరకొండ ప్రశంసలు
"లైగర్ "మూవీ రిలీజ్ పోస్టర్

సోషల్ మీడియాకు అమీర్ గుడ్‌బై
వాలిమై ఫస్ట్ లుక్ కు డేట్ ఫిక్స్
టాలీవుడ్ లో బిజీ
'మేజర్' గ్లింప్స్ - టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
సోషల్ మీడియా లో రికార్డ్

శశి మూవీ రివ్యూ

అఫీషియల్ గా ఓల్డ్ అయ్యా
అఫీషియల్ గా ఓల్డ్ అయ్యా అనే ఫీలింగ్ వస్తుంది అంటున్నారు న్యాచురల్ స్టార్ నాని. దీనికి కారణం ఏంటనుకుంటున్నారా ఒక ఎయిర్ హోస్టెస్. రీసెంట్ గా నాని గోవా నుండి హైద్రాబాద్ వస్తుండగా తను ఎక్కిన ఫ్లైట్ లో ఒక ఎయిర్ హోస్టెస్ అభిమానంతో ఒక చిన్న లెటర్ ఇచ్చింది. అందులో నాని గారు నేను చిన్నప్పుటినుండి మీ సినిమాలు చూస్తూ పెరిగాను.. మీరు చాలా గొప్ప యాక్టర్.. నాతరువాత ఒక చిన్న లవ్ టోకెన్ అంటూ లెటర్ లో పేర్కొంది. ఇక ఈ లెటర్ ను నాని సోషల్ మీడియాలో పోస్ట్ ఇలాంటిది మనకు ఎవరైనా ఇస్తే ఎలా ఉంటుంది.. అది కూడా ఒక అందమైన ఎయిర్ హోస్టెస్.. దీనిబట్టి నేను అఫీషియల్ గా ఓల్డ్ అయ్యాననిపిస్తుంది అంటూ చమత్కరించాడు.
ఇటలీ లో స్టార్ యాంకర్ అనసూయ
అద్భుతమైన యాంకరింగ్ తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ యాంకర్ గా కొనసాగుతున్న అనసూయ నటన కు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను సెలక్టివ్ గా ఎంపిక చేసుకుంటున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ "రంగస్థలం "మూవీ లో రంగమ్మత్త గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అనసూయ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్అందుకున్నారు . టాలెంటెడ్ యాక్ట్రెస్ అనసూయ ప్రస్తుతం "ఆచార్య ", "పుష్ప ", "రంగమార్తాండ ", "థ్యాంక్యూ బ్రదర్ ", "ఖిలాడి ", "భీష్మ పర్వం "(మలయాళ ) మూవీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు.
భారీ బడ్జెట్ తో అఖిల్ అక్కినేని 5వ సినిమా
హీరో అఖిల్ అక్కినేని ప్రస్తుతం అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్ బ్యానర్ పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న కామెడీ ఎంటర్ టైనర్ "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ "మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. అఖిల్ హీరో రూపొందుతున్న ఈ మూవీ లో పూజేహెగ్దే కథానాయిక. "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ "మూవీ జూన్ 19 వ తేదీ రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి.
ప్రిన్స్ కు ఫిట్ నెస్ అవార్డ్
టాలీవుడ్ లో రాకుమారుడు అంటే ఇంకెవరు మన సూపర్ స్టార్ మహేష్ బాబు అని అంటారు. టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ అందం గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. వయసు పెరుగుతున్న కొద్ది ఆయన ఇంకా హ్యాండ్ సమ్ గా తయారవుతున్నారు. ఇప్పుడున్న మన యంగ్ హీరోలు కూడా మహేష్ ముందు పోటీ రాలేరు అని చెప్పొట్టు. హాలీవుడ్ హీరో లకు సైతం పోటీ ఇస్తాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి ఇలా ఉండటం అంటే అదేతో లక్కీగా వచ్చింది అనుకోవడం తప్పే. దానికోసం మహేష్ కూడా ఎంతో హార్ట్ వర్క్ చేస్తే కానీ ఇప్పుడు కూడా ఇలా యంగ్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఫిస్ నెస్ విషయంలో మహేష్ చాలా శ్రద్దగా ఉంటారు. తన ఇంట్లోనే స్పెషల్ గా తన కోసం జిమ్ కూడా ఏర్పాటు…
"ఉప్పెన "మూవీ సక్సెస్ మీట్ డేట్ ఫిక్స్
మెగా స్టార్ చిరంజీవి మేనల్లుడు , హీరో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ సూపర్ హిట్ “ఉప్పెన “మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యారు. తమిళ సక్సెస్ ఫుల్ చిత్ర హీరో విజయ్ సేతుపతి ఒక కీలక పాత్రలో నటించిన “ఉప్పెన “మూవీ ఫిబ్రవరి 12 వ తేదీరిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి కలెక్షన్స్ లో రికార్డ్స్ క్రియేట్ చేసి 100కోట్ల క్లబ్ లో చేరింది. మెగా స్టార్ చిరంజీవి ” ఉప్పెన ” మూవీ టీమ్ కు అభినందనలు తెలిపారు. వరస మూవీస్ తో యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ టాలీవుడ్ లో బిజీగా మారారు.
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న నాగార్జున
2020 కరోనా ప్రభావం ఎలా ఉందో చూశాం. కాస్త ఆమధ్య కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇప్పుడు మళ్లీ కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో అందరిలో మళ్లీ భయం మొదలైంది. అందుకే ఎవరి జాగ్రత్తల్లో వాళ్లు ఉంటున్నారు. ఇక ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి కూడా వచ్చింది. రాజకీయ నాయకులు, సినీ తారలు, సామాన్య ప్రజలందరూ వ్యాక్సినేషన్ తీసుకుంటున్నారు.

సూపర్ స్టార్ సినిమాలో జగ్గుభాయ్
శివ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా అన్నాత్తే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ముందే ఈ సినిమా షూటింగ్ చాలావరకు పూర్తయింది. అయితే ఇంకా కొంత భాగం షూటింగ్ మిగిలివుంది. ఇటీవలే మళ్లీ ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టి కొద్దిరోజులు హైదరాబాద్ లో కూడా షూటింగ్ జరిపారు. అయితే అదే సమయంలో చిత్ర యూనిట్ లో కరోనా కలకలంతో షూటింగ్ కు బ్రేక్ వేశారు. ఆ తర్వాత రజినీకాంత్‌కి ఆరోగ్య సమస్య తలెత్తడంతో.. చెన్నై వెళ్లిపోయారు. మళ్లీ ఇప్పటి వరకూ షూటింగ్ విషయంలో ఎలాంటి అప్ డేట్ లేదు.

ఆమీర్ ఖాన్ సినిమాలో చైతు..?
మన తెలుగు సినిమాల కోసం బాలీవుడ్ నుండి నటీనటులను ఎప్పటినుండో అద్దెకు తెచ్చుకుంటున్నాం మనం. ఇప్పుడు మన టాలీవుడ్ హీరోలు కూడా బాలీవుడ్ లో మార్కెట్ ఏర్పాటు చేసుకోవడానికి బాగానే ట్రై చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేస్తుండగా.. విజయ్ దేవరకొండ, రానా, సందీప్ కిషన్, అడివి శేష్, నవీన్ పోలిశెట్టి, సత్యదేవ్ వీళ్ళంతా కూడా హిందీ చిత్రాలలో నటిస్తున్నారు. ఇప్పుడు మరో యంగ్ హీరో కూడా ఇదే బాటలో వెళుతున్నట్టు తెలుస్తుంది. ఆహీరో ఎవరో కాదు నాగ చైతన్య.
"మోసగాళ్ళు "ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కాజల్ సందడి
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ , ఎ వి ఎ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో విష్ణు మంచు , కాజల్ అగర్వాల్ ,సునీల్ శెట్టి ప్రధాన పాత్రలలో ఐటి స్కామ్ నేపథ్యంలో నిజ సంఘటనలతో తెలుగు , ఇంగ్లీష్ భాషలలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ "మోసగాళ్ళు "మూవీ మార్చి 19 వ తేదీ రిలీజ్ కానుంది. రూహి సింగ్ , నవీన్ చంద్ర , నవదీప్ ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ లో కాజల్ , విష్ణు అక్కా తమ్ముడు గా నటించడం విశేషం. శామ్ సి ఎస్ సంగీతం అందించారు.
"జాతిరత్నాలు "మూవీ పై విజయ్ దేవరకొండ ప్రశంసలు
స్వప్న సినిమా బ్యానర్ పై బ్లాక్ బస్టర్ "మహానటి "మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ నిర్మాణ సారథ్యంలో అనుదీప్ కె వి దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి , ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలలో రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ "జాతిరత్నాలు" మూవీ శివరాత్రి కానుకగా 11 వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. ఫరియా అబ్దుల్లా కథానాయిక కాగా మురళీశర్మ , బ్రహ్మానందం , వెన్నెల కిషోర్ , నరేష్ ముఖ్య పాత్రలలో నటించారు. రాధన్ సంగీతం అందించారు.
ఫ్యాషన్ పరంగా "రాధేశ్యామ్ "ప్రత్యేకం - పూజాహెగ్డే
గోపీకృష్ణా మూవీస్ సమర్పణ లో యు వి క్రియేషన్స్ బ్యానర్ పై పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం లో రూపొందిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ ” మూవీ దక్షిణాది భాషలలో తో పాటు హిందీ లో కూడా జులై 30 వ తేదీ రిలీజ్ కానుంది. జార్జియా దేశంలో సుందర లొకేషన్స్ తో పాటు హైదరాబాద్ లో భారీ సెట్స్ లో "రాధేశ్యామ్ "మూవీ తెరకెక్కింది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి .
"లైగర్ "మూవీ రిలీజ్ పోస్టర్
సూపర్ హిట్ "పెళ్ళిచూపులు" మూవీ తో హీరో గా ఎస్టాబ్లిష్ అయిన విజయ్ దేవరకొండ సెన్సేషనల్ హిట్ "అర్జున్ రెడ్డి "మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించి క్రేజీ హీరోగా మారారు. "గీత గోవిందం ", "టాక్సీవాలా "వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. విజయ్ ప్రస్తుతం తెలుగు , హిందీ భాషలలో రూపొందుతున్న "లైగర్ "మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ లో పాత్రకై విజయ్ మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేకంగా శిక్షణ పొందారు.

సోషల్ మీడియాకు అమీర్ గుడ్‌బై
ఇప్పట్లో సెలబ్రిటీస్ కు సోషల్ మీడియా ఖాతాలు ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులకు తెలియచేయాలంటే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండక తప్పదు. అయితే అప్పుడప్పుడువారికి కూడా సోషల్ మీడియా మీద విరక్తి వస్తుందేమో తెలియదు కానీ సడెన్ సోషల్ మీడియాకు కొద్దిరోజులు దూరంగా ఉంటారు. ఇప్పటికి ఎంతో మంది సెలబ్రిటీలు సోషల్ మీడియాకు బ్రేక్ ఇచ్చి రెస్ట్ తీసుకోగా ఇప్పుడు మరో హీరో కూడా కొద్ది రోజులు సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పి ఫ్యాన్స్ కు షాకిచ్చారు.
"సలార్" మూవీ లో శ్రీనిధి శెట్టి స్పెషల్ సాంగ్ ?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హోం బలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “కెజియఫ్ చాప్టర్ 1″మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న గ్యాంగ్ స్టర్ మూవీ “సలార్” షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ మైనింగ్ ఏరియా లో భారీ సెట్స్ లో చిత్రీకరణ జరుపుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు షూటింగ్ రెండవ షెడ్యూల్ కూడా ఒక కొండ ప్రాంతం లో దర్శకుడు ప్లాన్ చేశారు . యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న "సలార్ "మూవీ లో యాక్షన్ సీన్స్ హైలైట్ కానున్నాయి. శృతి హాసన్ కథానాయిక. రవి సంగీతం అందిస్తున్నారు.
వాలిమై ఫస్ట్ లుక్ కు డేట్ ఫిక్స్
హెచ్. వినోత్ దర్శకత్వంలో అజిత్ హీరోగా ‘వాలిమై’ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో అజిత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు ఇక ఈసినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. దాదాపు చాలా వరకూ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇటీవలే ఈ సినిమా హైద్రాబాద్ లో షూటింగ్ ను ముగించుకుంది. ఇక ఇటీవలే ఈసినిమా ఫస్ట్ లుక్ ను త్వరలోనే రిలీజ్ చేస్తామని చిత్రయూనిట్ తెలిపింది. ఇక నేడు ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించింది చిత్రయూనిట్. అజిత్ పుట్టిన రోజు సందర్భంగా ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను మే1వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.

చావు కబురు చల్లగా మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే బస్తీ బాలరాజు బాగానే సందడి చేశాడు. ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ రెండూ కలిపి తీసిన సినిమా చావు కబురు చల్లగా. అన్ని వర్గాల వారికి ఈసినిమా ఖచ్చితంగా నచ్చుతుందని చెప్పొచ్చు.
టాలీవుడ్ లో బిజీ
స్వధర్మ్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై స్వరూప్ ఆర్ ఎస్ జె దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, శృతి శర్మ జంటగా రూపొందిన కామెడీ థ్రిల్లర్సాయి "ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయ " మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ తో నవీన్ టాలీవుడ్ కు కథానాయకుడిగా పరిచయం అయ్యారు. "ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ" మూవీ లో నవీన్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ మూవీ తరువాత సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న కామెడీ ఎంటర్ టైనర్ "జాతిరత్నాలు "మూవీ తో నవీన్ ప్రేక్షకులను అలరిస్తున్నారు.
'మేజర్' గ్లింప్స్ - టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
గూఢచారి, ఎవరు లాంటి థ్రిల్లర్ సినిమాలతో అలరించిన అడివి శేష్ ఇప్పుడు మేజర్ సినిమాతో వచ్చేస్తున్నాడు. అడివి శేష్ ప్రధాన పాత్రలో శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో 26/11 ముంబై దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా 'మేజర్' సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. జులై 2, 2021న మేజర్ మూవీ ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా అది అందర్నీ ఆకట్టుకుంది.
సోషల్ మీడియా లో రికార్డ్
రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా ,తెలుగు , హిందీ భాషలలో రూపొందిన పీరియాడికల్ లవ్ స్టోరీ "రాధేశ్యామ్ " భారీ అంచనాలతో జులై 30వ తేదీ దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా రూపొందుతున్న "సలార్ ", "ఆదిపురుష్ "మూవీస్ చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. బ్లాక్ బస్టర్ "మహానటి "మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం లో ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ కి హీరో ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
