కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వంలో కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా
‘చావు కబురు చల్లగా’. ఇక ఈసినిమాలో బస్తీ బాలరాజుగా ఒక పవర్ ఫుల్ మాస్ క్యారెక్టర్ లో కార్తికేయ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి ‘బస్తి బాలరాజు’ ఫస్ట్ లుక్, టీజర్ గ్లిమ్ప్స్, మైనేమ్ ఈజ్ రాజు పాటను విడుదల చెయ్యగా వాటికి మంచి స్పందన లభించడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈసినిమాలో మురళీ శర్మ, ఆమని, శ్రీకాంత్ అయ్యంగర్, మహేష్,భద్రం తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈసినిమాను నిర్మించాడు. జేక్స్ బిజోయ్ సంగీతం అందించిన ఈసినిమాకు కరమ్ చావ్లా సినిమాటోగ్రాఫర్ గా పనిచేశాడు. మరి ఈసినిమా ఆ అంచనాలను అందుకుందో లేదో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మూవీ నేమ్ : చావు కబురు చల్లగా (తెలుగు)
రిటన్ అండ్ డైరెక్షన్ : కౌశిక్ పెగళ్ళపాటి
ప్రెసెంటెర్ : అల్లు అరవింద్
ప్రొడ్యూసర్ :బన్ని వాస్
ఎడిటర్ : సత్య . జి
మ్యూజిక్ డైరెక్టర్ : జేక్స్ బిజోయ్
ఆర్ట్ డైరెక్టర్ : జి యమ్ శేఖర్
ప్రొడక్షన్ డిసైనర్ : మనీషా ఏ దత్
కాస్ట్యూమ్ డిసైనర్: మౌన గుమ్మడి
అడిషనల్ డైలాగ్స్ : శివ కుమార్ బొజ్జుల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : శరత్ చంద్ర నాయుడు ,రాఘవ కరుతూరి
ఆడియో : ఆదిత్య మ్యూజిక్
పబ్లిసిటీ డిజైనర్ : అనిల్ అండ్ భాను
పి ఆర్ ఓ : ఏలూరు శ్రీను ,మేఘ శ్యామ్
కథ..
బస్తీ బాలరాజు ( కార్తీకేయ గుమ్మకొండ) ఎలాంటి బాధ్యతలు లేని వ్యక్తి. శవాలను మోసుకెళ్లే వాహనం డైవర్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తుంటాడు. అలాంటి బాలరాజు భర్తను కోల్పోయిన మల్లిక (లావణ్య త్రిపాఠి)ను ప్రేమిస్తాడు. అయితే బాలరాజు ప్రేమను మల్లికతోపాటు కుటుంబ సభ్యులు నిరాకరించినా బాలరాజు వెంటపడుతూనే ఉంటాడు. మరోవైపు బాలరాాజు తల్లి గంగమ్మ (ఆమని) వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందనితెలిసి వారిద్దరి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు. మరి తండ్రి బతికి ఉండగానే తన తల్లికి పెళ్లి చేయాలని బాలరాజు ఎందుకు నిర్ణయించుకొన్నాడు?
చివరకు మల్లికను ఒప్పించాడా? అన్నది మిగిలన కథ.
విశ్లేషణ..
సాధారణంగా హీరోయిన్ వెనుక హీరో పడటం.. టీజ్ చేయడం.. లవ్ ఎక్స్ ప్రెస్ చేయడం చాలా సినిమాల్లో చూశాం.. ఈసినిమాలో కూడా అవి ఉంటాయి.. కాకపోతే కొత్త పాయింట్ ఏంటంటే.. హీరోయిన్ కు ముందే పెళ్లి అయిపోవడం.. భర్తను కోల్పోవడం. వితంతువును హీరో ప్రేమించడం అనే కొత్త పాయింట్ తో డైరెక్టర్ చూపించాడు. మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేశాడు. మంచి కథను ఎంచుకోడమే కాకుండా ఎమోషన్స్ రాబట్టడంలో కీలక పాత్ర పోషించాడు. పెళ్లి వయసు ఉన్న కొడుకు తల్లికి మళ్ళీ పెళ్లి చెయ్యడం అనే సున్నితమైన అంశాన్ని బాగా హ్యాండిల్ చెయ్యడం చాలా బాగుంది.
మొదటిభాగం బాలరాజు క్యారెక్టర్‌ను ఎలివేట్ చేయడం.. మల్లిక వెనుక పడటం లాంటి సీన్లు.. బాలరాజు, తల్లి గంగి మధ్య సన్నివేశాలతో నడుస్తుంది. ఒక రకంగా ఫస్ట్ హాఫ్ కాస్త కామెడీగా వెళ్లిపోతుంది. ఇక సెకండ్ హాఫ్ మాత్రం ఎమోషన్ కు పెద్ద పీట వేశాడు డైరెక్టర్. ఆమని, కార్తీకేయ మధ్య సన్నివేశాలు, అలాగే శ్రీకాంత్ అయ్యంగార్‌తో కొన్ని సీన్లు ఆసక్తికరంగా సాగుతాయి. అలాగే లావణ్య త్రిపాఠిని తన ప్రేమను ఒప్పుకొనే విధంగా బాలరాజు చేసే ప్రయత్నాలు చాలా ఎమోషనల్‌గా సాగుతాయి. క్లైమాక్స్‌లో మురళీ శర్మతో బాలరాజు ఎపిసోడ్ మరింత ఎమోషనల్‌గా కనిపించి క్లైమాక్స్ ను పండిస్తాడు.
ఇక ఈసినిమాలో హీరోదే మెయిన్ హైలైట్. కార్తికేయ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఉన్న యంగ్ టాలెంటెడ్ హీరోల్లో కార్తికేయ పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఆర్ఎక్స్ 100 లోనే తన నటన చూశాం. ఇక ఈసినిమాలో కూడా ఫుల్ మాస్ క్యారెక్టర్ లో జీవించేశాడు. పాత్రకు ఏం కావాలో అలాంటి సాలిడ్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. నటనలో మరింత మెచ్యురిటీ కనిపించింది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్లలో చాలా బాగా నచించాడు. కమర్షియల్ హీరోగా, ఫెర్ఫార్మర్‌గాను తన రేంజ్‌ను చావు కబురు చల్లగా సినిమా ద్వారా పెంచుకొన్నాడనే చెప్పవచ్చు.
హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఈసినిమాలో ఖచ్చితంగా చాలా కొత్తగా కనిపిస్తుంది. మల్లిక గా డీ గ్లామరైజ్డ్ పాత్రలో చక్కగా నటించింది. సింపుల్ లుక్స్ తో తను చేసిన నటన ఆకట్టుకుంటుంది. ఇక ఆమని విషయానికి వస్తే.. చాలా కాలం అనంతరం తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమని మంచి రోల్ లో కనిపించారు. భారమైన పాత్రతో సినిమాకు ప్రత్యేకమైన ఆకర్షణగా మారారు. శ్రీకాంత్ అయ్యంగార్ తన పాత్ర పరిధి మేరకు మెప్పించాడు. మురళీ శర్మ, భద్రం, మహేష్ తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.
సాంకేతిక విభాగానికి వస్తే ..సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బావుంది. తన వల్ల సినిమా మరింత ఇంపాక్ట్ గా అనిపిస్తుంది. కర్మ్ చావ్లా సినిమాటోగ్రఫీ మరో హైలెట్. ప్రతిఫ్రేమ్ చాలా సహజంగా ఉండటానికి ప్రయత్నించారు.
ఓవరాల్ గా చెప్పాలంటే బస్తీ బాలరాజు బాగానే సందడి చేశాడు. ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ రెండూ కలిపి తీసిన సినిమా చావు కబురు చల్లగా. అన్ని వర్గాల వారికి ఈసినిమా ఖచ్చితంగా నచ్చుతుందని చెప్పొచ్చు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: