అద్భుతమైన యాంకరింగ్ తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ యాంకర్ గా కొనసాగుతున్న అనసూయ నటన కు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను సెలక్టివ్ గా ఎంపిక చేసుకుంటున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ “రంగస్థలం “మూవీ లో రంగమ్మత్త గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అనసూయ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్అందుకున్నారు . టాలెంటెడ్ యాక్ట్రెస్ అనసూయ ప్రస్తుతం “ఆచార్య “, “పుష్ప “, “రంగమార్తాండ “, “థ్యాంక్యూ బ్రదర్ “, “ఖిలాడి “, “భీష్మ పర్వం “(మలయాళ ) మూవీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఎ స్టూడియోస్ , పెన్ స్టూడియోస్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “రాక్షసుడు “మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలోమాస్ మహారాజా రవితేజ హీరోగా యాక్షన్ కామెడీ ” ఖిలాడి “మూవీ మే 28 వ తేదీ రిలీజ్ కానుంది. మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. యాక్షన్ కింగ్ అర్జున్ , ఉన్ని ముకుందన్ , మురళీశర్మ , వెన్నెల కిషోర్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ”ఖిలాడి “మూవీ షూటింగ్ ప్రస్తుతం ఇటలీ దేశంలో జరుగుతుంది. “ఖిలాడి ” మూవీ ఇటలీ షూటింగ్ షెడ్యూల్ లో అనసూయ పాల్గొంటున్నారు. ఇటలీ దేశంలోని మిలాన్ సిటీ వీధుల్లో ఎంజాయ్ చేస్తున్న అనసూయ ఫొటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: