వాలిమై ఫస్ట్ లుక్ కు డేట్ ఫిక్స్

Ajith Valimai Movie First Look Release Date Confirmed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Ajith,Thala Ajith,Valimai,Valimai Film,Valimai Movie,Valimai Update,Valimai Movie Latest Updates,Valimai Movie news,Valimai Movie Latest News,Valimai First Look,Valimai Movie First Look,Valimai Movie First Look Update,Valimai Movie First Look News,Ajith Valimai Movie First Look,Valimai First Look Release Date,Valimai First Look Release Date Out,Valimai First Look Release Date Fix,#AK50,Valimai First Look From May 1st,Valimai First Look On Ajith Kumar 50th Birthday,Boney Kapoor

హెచ్. వినోత్ దర్శకత్వంలో అజిత్ హీరోగా ‘వాలిమై’ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో అజిత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు ఇక ఈసినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. దాదాపు చాలా వరకూ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇటీవలే ఈ సినిమా హైద్రాబాద్ లో షూటింగ్ ను ముగించుకుంది. ఇక ఇటీవలే ఈసినిమా ఫస్ట్ లుక్ ను త్వరలోనే రిలీజ్ చేస్తామని చిత్రయూనిట్ తెలిపింది. ఇక నేడు ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించింది చిత్రయూనిట్. అజిత్ పుట్టిన రోజు సందర్భంగా ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను మే1వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ‘బేవ్యూ ప్రాజెక్ట్స్‌’ బ్యానర్ పై బోనీ కపూర్ నిర్మిస్తున్నాడు. ఇందులో కథానాయికగా బాలీవుడ్ న‌టి హుమా ఖురేషి న‌టిస్తుండగా… టాలీవుడ్ హీరో కార్తికేయ విల‌న్‌గా క‌నిపించ‌నున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. అన్ని పనులు త్వరలోనే పూర్తి చేసి సినిమాను కూడా తొందర్లోనే రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు.

మరి వీరు ముగ్గురు అజిత్, బోనీకపూర్, దర్శకుడు హెచ్. వినోద్ కాంబినేషన్ లోనే వచ్చిన ‘నెర్కొండ పార్వై’ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్టైంది. దానితోనే మళ్లీ సేమ్ కాంబినేషన్ తో ఈ సినిమా తీస్తున్నారు. మరి ఈ సినిమా వారికి ఎంత వరకూ సక్సెస్ అందిస్తుందో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 1 =