
ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 64


రంగం డైరెక్టర్ 'కెవి ఆనంద్' కన్నుమూత

అనసూయ లేటెస్ట్ ఫొటో

వ్యాక్సిన్ పై వరుణ్ తేజ్ సందేశం

ఎన్టీఆర్ కథ మొదలుపెట్టిన కొరటాల

అదే గొప్ప సాయం.. నారప్ప టీం రిక్వెస్ట్

తండ్రి సినిమాకు నిర్మాతగా సుమంత్ అశ్విన్

నచ్చినట్టు జీవిస్తా -శృతి హాసన్

"RRR"మేకర్స్ ప్రజలకు సందేశం

"F 3" మూవీ అప్ డేట్

బాలయ్య 'అఖండ' విజయం

సూపర్ హిట్ మూవీ రీమేక్ లో నయనతార ?

ప్రభాస్ పై శ్రుతి హాసన్ ప్రశంసలు

జున్నుతో నాని కరోనా ఫైటింగ్

"ఆచార్య "లో టెంపుల్ సిటీ సెట్ ప్రత్యేకత

'శ్యామ్ సింగరాయ్' హైలెట్ గా ఫ్లాష్ బ్యాక్ సీన్స్

'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వాయిదా కు కారణం

స్ట్రిక్ట్ రూల్స్ తో రజినీ 'అన్నాత్తే' షూట్
మాస్ చిత్రాల దర్శకుడు శివ దర్శకత్వంలో కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం 'అన్నాత్తే'. 'అన్నయ్య'గా తెలుగులోనూ డబ్బింగ్ వెర్షన్ రాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో శరవేగంగా జరుగుతోంది. తెలంగాణలో నైట్ కర్ఫ్యూ ఉన్నప్పటికీ అన్నాత్తే చిత్ర బృందం స్పెషల్ పర్మిషన్స్ తీసుకొని మరీ చిత్రీకరణ జరుపుతున్నారు.

రంగం డైరెక్టర్ 'కెవి ఆనంద్' కన్నుమూత
కొంతమంది డైరెక్టర్లు ఉంటారు.. చేసేవి తక్కువ సినిమాలు అయినా మంచి పేరు తెచ్చుకుంటారు. అలాంటి డైరెక్టర్లలో కెవి ఆనంద్ కూడా ఉంటాడు. కెమెర మెన్ లు డైరెక్టర్ గా మారి సినిమాలు చేయడం చూస్తుంటాం.. ఇక కెవి ఆనంద్ కూడా మొదట కెమెర మెన్ గా చేసి ఆతరువాత డైరెక్టర్ గా మారినవాడే. జీవా నటించిన రంగం.. సూర్య నటించిన బ్రదర్స్ చిత్రాలతో అతడి ప్రతిభ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. అలాంటి డైరెక్టర్ తుది శ్వాస విడిచారు. కెవి ఆనంద్ గుండెపోటుతో నేడు చెన్నైలో కన్నుమూశారు. కెవి ఆనంద్ మృతితో తెలుగు, తమిళ పరిశ్రమలు విషాదంలోకి వెళ్లాయి. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

అనసూయ లేటెస్ట్ ఫొటో
అందం , చక్కని హావభావాలతో అద్భుతంగా యాంకరింగ్ చేస్తూ అనసూయ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. స్టార్ యాంకర్ అనసూయ నటన కు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను సెలక్టివ్ గా ఎంపిక చేసుకుంటూ నటిస్తున్నారు . బ్లాక్ బస్టర్ “రంగస్థలం “మూవీ లో రంగమ్మత్త గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అనసూయ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్అందుకున్నారు .

వ్యాక్సిన్ పై వరుణ్ తేజ్ సందేశం
టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర యంగ్ హీరోగా రాణిస్తున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం బాక్సింగ్ నేపథ్యం లో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా "గని ", బ్లాక్ బస్టర్ "F 2 "మూవీ సీక్వెల్ "F 3 "మూవీ లో కథానాయకుడిగా నటిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆ రెండు మూవీస్ షూటింగ్స్ నిలిచిపోయాయి. బాక్సింగ్ లో ప్రత్యేక శిక్షణ పొంది వరుణ్ తేజ్ నటిస్తున్న "గని ", ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ "F 3 "మూవీస్ పై ప్రేక్షక , అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఎన్టీఆర్ కథ మొదలుపెట్టిన కొరటాల
ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. మరోవైపు కొరటాల ఆచార్య సినిమాతో బిజీగా ఉన్నాడు. వీరిద్దరి సినిమాలు అయిపోయిన తరువాత జులై తర్వాత షూటింగ్ మొదలు పెట్టి నాన్ స్టాప్ షూటింగ్ చేయాలని భావిస్తున్నాడు దర్శకుడు కొరటాల శివ. ఇక ఇదిలాఉండగా ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కథపై పలు వార్తలు వచ్చాయి. పల్లెటూరిలో ఉండే ఓ వ్యక్తి సిటీకి వచ్చి.. అక్కడ అతను ఎదుర్కొన్న పరిస్థితుల వల్ల అప్పటి నుంచి ఆయన ఎలా మారతాడు? అనే పాయింట్ తీసుకొని ఎన్టీఆర్‌ని ప్రేక్షకుల ముందుకు కొరటాల తీసుకొస్తున్నట్టు పలు కథనాలు వచ్చాయి.

ఇలియానా డిజిటల్ ఎంట్రీ
బ్లాక్ బస్టర్ “దేవదాసు ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యి తన అందం , అభినయం తో యూత్ ను ఆకట్టుకున్న ఇలియానా పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. టాలీవుడ్ లో టాప్ పొజిషన్ లో ఉండగానే బ్లాక్ బస్టర్ "బర్ఫీ "మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. పలు సూపర్ హిట్ మూవీస్ తో బాలీవుడ్ లో బిజీగా మారిన ఇలియానా 6 సంవత్సరాల తరువాత రవితేజ హీరోగా రూపొందిన "అమర్ అక్బర్ ఆంథోని "మూవీ తో టాలీవుడ్ కు రీ ఎంట్రీ అయ్యారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చిన్నప్పటి క్లాసికల్ డ్యాన్స్ షో
యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరస బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షక, అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.తన డ్యాన్స్ , ఫైట్స్ , డైలాగ్ డెలివరీ తో ఎన్టీఆర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న "రౌద్రం రణం రుధిరం "మూవీ లో కొమరం భీమ్ గా నటిస్తున్నారు. ఆ మూవీ అక్టోబర్ 13 వ తేదీ రిలీజ్ కానుంది. పలుదర్శకుల మూవీస్ కు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

అదే గొప్ప సాయం.. నారప్ప టీం రిక్వెస్ట్
టాలీవుడ్ లో ఇప్పటికే చాలా సినిమాలు రిలీజ్ లను వాయిదా వేసుకున్నాయి. ఇక ఇప్పుడు నారప్ప కూడా వెనక్కి తగ్గాడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకీ ప్రధాన పాత్రలో నారప్ప సినిమా వస్తుంది. ఇక ఈసినిమాను మే 14న రిలీజ్ చేయాలని డేట్ ఫిక్స్ చేశారు. కానీ ఇప్పుడున్న సెకండ్ వేవ్ కారణంతో ఈసినిమాను కూడా వాయిదా వేస్తున్నట్టు నిర్మాణ సంస్థ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా తెలియచేసింది.

తండ్రి సినిమాకు నిర్మాతగా సుమంత్ అశ్విన్
ఇప్పుడున్న యంగ్ హీరోలు అటు సినిమాలు చేస్తూనే మరో పక్క నిర్మాతలుగా కూడా మారి సినిమాలను నిర్మించేపనిలో పడ్డారు. కొంతమంది హీరోలు అయితే స్వంయంగా తామే సొంత ప్రొడక్షన్ హౌస్ లను నిర్మించి తమ బ్యానర్ లలోనే సినిమాను చేసేస్తున్నారు. ఇక ఇప్పుడు మరో యంగ్ హీరో కూడా నిర్మాతగా మారుతున్నాడు. ఈహీరో ఎవరో కాదు ఒకప్పుడు మనసంతా నువ్వే, ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఇలా పలు సూపర్ హిట్ సినిమాలను అందించిన ఎంఎస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్.

నచ్చినట్టు జీవిస్తా -శృతి హాసన్
తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో శృతి హాసన్ తన అందం అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. సూపర్ హిట్ “క్రాక్ “, “వకీల్ సాబ్ “మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి శృతి ప్రేక్షకులను అలరించారు.తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కి జోడీ గా శృతి నటించిన “లాభం”తమిళ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. సోషల్ మీడియా లో శృతి తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే . పలు ఫొటో షూట్స్ లో పాల్గొని శృతి ఆ ఫొటోలను సోషల్ మీడియా లో షేర్ చేస్తున్న విషయం తెలిసిందే.

"RRR"మేకర్స్ ప్రజలకు సందేశం
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఫ్రీడమ్ ఫైటర్స్ అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ అక్టోబర్ 13 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో ఎన్టీఆర్ కొమరం భీమ్ , రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్నారు. భారీ తారాగణం తో రూపొందుతున్న ఈ మూవీ లో అలియా భట్ , ఒలీవియా మోరిస్ కథానాయికలు. అజయ్ దేవగన్ , సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.“రౌద్రం రణం రుధిరం ” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను…
'పుష్పరాజ్' కు తప్పని కరోనా
మెగా హీరోల్లో ఇప్పటికే చాలామంది కోరనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ కు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం కాస్త ఎక్కువగా ఉండటంతో ఇప్పటికే చాలామంది హీరోలు తమ షూటింగ్ లను ఆపేసుకున్నారు. కానీ అల్లు అర్జున్ మాత్రం సినిమాను అనుకున్న టైమ్ కే రిలీజ్ చేయాలని తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పుష్ప షూటింగ్ ను ఆపలేదు. అయితే ఇప్పుడు బన్నీకి కూడా కరోనా పాజిటివ్ రావడంతో షూట్ కు బ్రేక్ చెప్పాల్సి వచ్చింది.

"F 3" మూవీ అప్ డేట్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ , వరుణ్ తేజ్ , తమన్నా , మెహరీన్ ప్రధాన పాత్రలలో రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ “F2 “ఫన్ &ఫ్రస్టేషన్” మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. హీరోలు వెంకటేష్, వరుణ్ తేజ్ లు తమ అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించారు. “F2 “మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది.

బాలయ్య 'అఖండ' విజయం
టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు, యంగ్ హీరోలకు సోషల్ మీడియాలో, డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ లో రికార్డ్స్ విషయంలో పోటీ ఉంటుందేమో కానీ సీనియర్ హీరోలు మాత్రం వీటికి దూరమే. అయితే ఇప్పుడు సీనియర్ హీరోలు కూడా వ్యూస్ విషయంలో తమ సత్తా చాటుతున్నారు. అందుకు పర్ఫెక్ట్ ఎగ్జామ్‌పుల్ అఖండ టీజర్ రికార్డ్స్.

సూపర్ హిట్ మూవీ రీమేక్ లో నయనతార ?
క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కె అజయ్ కుమార్ దర్శకత్వంలో మాధవి ప్రధాన పాత్రలో రూపొందిన "మాతృదేవోభవ"మూవీ 1991 సంవత్సరం లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రేక్షకులను ఆకట్టుకుని కల్ట్ క్లాసిక్ మూవీ గా నిలిచింది. ఈ మూవీ బెస్ట్ మూవీ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకుంది. కీరవాణి స్వరకల్పనలో వేటూరి రచన , కీరవాణి గానం చేసిన "రాలిపోయే పువ్వా " సాంగ్ విశేష ప్రేక్షకాదరణ పొందింది . బెస్ట్ లిరిసిస్ట్ గా వేటూరి నేషనల్ అవార్డ్ అందుకున్నారు.

ప్రభాస్ పై శ్రుతి హాసన్ ప్రశంసలు
తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో , తన అందం అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని శృతి హాసన్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. శృతి కథానాయిక గా రూపొందిన "క్రాక్ ", "వకీల్ సాబ్ "మూవీస్ ఘనవిజయం సాధించాయి. సోషల్ మీడియా లో శృతి తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే . తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కి జోడీ గా శృతి నటించిన "లాభం"తమిళ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

జున్నుతో నాని కరోనా ఫైటింగ్
న్యాచురల్ స్టార్ నాని వరుస సినిమాలను లైన్ లో పెట్టి ప్రస్తుతం షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా "టక్ జగదీష్" సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రీతువర్మ, ఐశ్వర్యా రాజేష్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాను... సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా అన్ని పనులు పూర్తిచేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. కరోనా ప్రభావం ఎక్కువగా లేకపోతే ఈసినిమా ఏప్రిల్ 23న రిలీజ్ అయ్యేది.

"ఆచార్య "లో టెంపుల్ సిటీ సెట్ ప్రత్యేకత
సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంట గా కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై భారీ బడ్జెట్ తో నక్సల్ బ్యాక్ గ్రౌండ్ తో , దేవాలయాల పరిరక్షణ వంటి సోషల్ మెసేజ్ తో “ఆచార్య “మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , పూజాహెగ్డే మరో జంటగా నటిస్తున్నారు. సోనూసూద్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా హీరోయిన్ రెజీనా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.

'శ్యామ్ సింగరాయ్' హైలెట్ గా ఫ్లాష్ బ్యాక్ సీన్స్
హిట్లు ఫ్లాపులతో పని లేకుండా టాలీవుడ్‌లో ఎప్పుడూ బిజీగా ఉండే హీరో న్యాచురల్ స్టార్ నాని. ఏడాదికి ఖచ్చితంగా రెండు సినిమాలైనా లైన్ లో పెడతాడు. రాహుల్ సంకీర్త్యన్‌తో కలిసి నాని ‘శ్యామ్ సింగరాయ్’ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇటీవలే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ రావడం చూశాం. కొద్దిరోజులుగా కలకత్తాలో షూటింగ్ జరుపుకోగా కరోనా సెకండ్ వేవ్ వల్ల అక్కడికి వెళ్లలేని పరిస్థితి ఉండటంతో ఇక్కడే హైదరాబాద్ శివార్లో 10 ఎకరాల్లో కలకత్తా నగరాన్నే సెట్ గా వేశారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది.

'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వాయిదా కు కారణం
'ది ఫ్యామిలీ మ్యాన్' అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన ఈ వెబ్ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మనోజ్ బాజ్‌పెయ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో స్పై థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ మంచి ప్రేక్షకాదరణే పొందింది. దీంతో మొదటి సీజన్ సూపర్ హిట్ అవ్వడంతో రెండో సీజన్ కూడా తెరకెక్కిస్తున్న సంగతి కూడా విదితమే. ఇక ఈ సీజన్ కోసం ఎంతోమంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ఎదురుచూపులకు తగ్గట్టు ఈ వెబ్ సిరీస్ రిలీజ్ అవ్వడం కూడా లేట్ అవుతుంది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిందే కరోనా వల్ల లేట్ అయింది. ఇక ఈఏడాది ఫిబ్రవరి 12 రిలీజ్ చేద్దామనుకున్నారు అది కూడా కుదరలేదు. సమ్మర్ లో రిలీజ్ అని చెప్పారు.