బాలయ్య ‘అఖండ’ విజయం

Nandamuri Balakrishna Starrer Akhanda Movie Teaser Garners 45 Million Views,Akhanda Movie Teaser Garners 45 Million Views,Akhanda Teaser Record,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Nandamuri Balakrishna,Balakrishna,Balakrishna BB3,Akhanda,BB3​ Title Roar,Nandamuri Balakrishna BB3,Boyapati Srinu,Thaman S,Akhanda Movie,NBK 106,Balakrishna New Movie,Balakrishna Latest Movie,NBK 106 Movie,Akhanda NBK Movie,Balakrishna And Boyapati Movie,Balakrishna 106,NBK in Akhanda,Akhanda Telugu Movie,Balakrishna Akhanda,Balakrishna And Boyapati New Movie Akhanda,BB3 Akhanda,Akhanda Movie Teaser Record,Akhanda Teaser Creating Sensation,Akhanda Title Roar Teaser Has Crossed 45 Million Views Marks,Akhanda Title Roar Teaser 45 Million Views,Akhanda Teaser 45 Million Views On Youtube,Akhanda Movie Teaser Garners 45 Million Views,#Akhanda,#BB3​

టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు, యంగ్ హీరోలకు సోషల్ మీడియాలో, డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ లో రికార్డ్స్ విషయంలో పోటీ ఉంటుందేమో కానీ సీనియర్ హీరోలు మాత్రం వీటికి దూరమే. అయితే ఇప్పుడు సీనియర్ హీరోలు కూడా వ్యూస్ విషయంలో తమ సత్తా చాటుతున్నారు. అందుకు పర్ఫెక్ట్ ఎగ్జామ్‌పుల్‌ అఖండ టీజర్‌ రికార్డ్స్‌.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బాలయ్య-బోయపాటి కాంబినేషన్ లో అఖండ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. బాలయ్య ఈ చిత్రంలో ఫ్యాక్షనిస్ట్ గా అఘోరాగా రెండు పాత్రల్లో చేస్తున్నాడు. ఈమధ్యనే ఈసినిమా టైటిల్ తో పాటు టీజర్ ను కూడా రిలీజ్ చేయగా.. దానికి ఎంత రెస్పాన్స్ వచ్చిందో తెలుసు కదా. ఈ టీజర్‌ రికార్డ్‌ వ్యూస్‌తో దూసుకుపోతోంది. టాప్‌లో ట్రెండ్ అవుతూ స్టార్ హీరోలకు సైతం షాకిస్తున్నాడు. ఇప్ప‌టికే 45 మిలియ‌న్ పైగా వ్యూస్ తో దూసుకుపోతున్న బాల‌య్య సినిమా టీజ‌ర్.. అతి త్వ‌ర‌లో 50 మిలియ‌న్ వ్యూస్ ద‌క్కించుకునే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. దీంతో బాలయ్య అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

ఇక ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్ గా నటిస్తుంది. మిర్యాల స‌త్యనారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్పణ‌లో ద్వారకా క్రియేషన్స్ ప‌తాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సి.రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్నమైన షేడ్స్ లో కనిపించనున్నాడట. వాటిలో రాయలసీమ నేపథ్యంలో ఒక పాత్ర .. వారణాసి నేపథ్యంలో మరో పాత్ర ఉన్నట్టు తెలుస్తుంది. మే 28న ఈసినిమాను ప్రపంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌ చేస్తున్నట్టు ప్రకటించారు.. మరి ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో అది కుదురుతుందో లేదో చూడాలి.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + 4 =