
ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 63


కలసి పోరాడుదాం - తమన్నా

ది ఫ్యామిలీ మ్యాన్ 2 సమ్మర్ లో కన్ఫామ్

కృతి శెట్టి మనసులో మాట

'లైగర్' అప్ సెట్

కార్గిల్ కు నాగచైతన్య

పవన్ కళ్యాణ్ కు జోడీ గా నిత్యామీనన్

కన్నడ రీమేక్ గా "జయం"మూవీ

రష్మిక ఫేవరేట్ మూవీ

నిర్మాతగా కంగనా కొత్త సినిమా

కరోనా వ్యాప్తి నివారణకై నిఖిల్ సందేశం

'#SSMB28' అనౌన్స్ మెంట్ వచ్చేసింది

వైష్ణవ్ సినిమా రిలీజ్ పై క్రిష్ క్లారిటీ

కరోనా పేషెంట్స్ కు సమంత సాయం

మహి వి రాఘవ్ దర్శకత్వంలో ?

మరో పాన్ ఇండియాలో 'రానా'

ఓవర్ సీస్ లో "రాధేశ్యామ్"కు భారీ డిమాండ్

విజయ్ దేవరకొండ గెస్ట్ రోల్ మూవీస్

'దాసరి' కి పద్మ పురస్కారం ఇవ్వాలి.. 'చిరు' విన్నపం
ఒకప్పుడు ఇండస్ట్రీలో పెద్ద ఎవరంటే దాసరి నారాయణ రావు అని ఎవర్ని అడిగినా చెపుతారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా దాసరి దగ్గరుండి సమస్యను పరిష్కారం చేసేవారు. ఇక దాసరి చనిపోయాక ఇండస్ట్రీ పెద్ద దిక్కును కోల్పోయింది. ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరునే ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అయ్యారు. చిరునే దాసరి ప్లేస్ ను రీప్లేస్ చేశారు. ఇండస్ట్రీలో ఉన్న సమస్యలపై స్పందిస్తున్నారు. పెద్దరికంగా వ్యవహరిస్తున్నారు. ఇక దాసరి పుట్టినరోజు సందర్భంగా ఆయనను స్మృసించుకున్నారు చిరు. అంతేకాదు ఆయనకు పద్మ పురస్కారం ఇవ్వాలని కూడా ప్రభుత్వాన్ని కోరారు.

కలసి పోరాడుదాం - తమన్నా
తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ తమన్నా స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. తమన్నా కథానాయికగా రూపొందిన స్పోర్ట్స్ డ్రామా కరోనా కారణం తో విడుదల వాయిదా పడింది. కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం తో ఆసుపత్రిల్లో బెడ్స్ లేక, ఆక్సిజన్ సీలిండర్లు దొరక్క మరణించే వారి సంఖ్య అధికమవుతున్న విషయం తెలిసిందే. సినీ సెలబ్రిటీస్ సోషల్ మీడియా ద్వారా తమవంతు సాయం అందిస్తున్నారు . ప్రజలకు ధైర్యం చెబుతూ వారిని అప్రమత్తం చేస్తున్నారు.స్టార్ హీరోయిన్ తమన్నా కూడా తాజాగా ఒక పోస్ట్ చేశారు.

ది ఫ్యామిలీ మ్యాన్ 2 సమ్మర్ లో కన్ఫామ్
మనోజ్ బాజ్‌పెయ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో స్పై థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన 'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో వచ్చి ఎంత హిట్ అయిందో తెలుసు. దీంతో మొదటి సీజన్ సూపర్ హిట్ అవ్వడంతో రెండో సీజన్ కూడా తెరకెక్కిస్తున్న సంగతి కూడా విదితమే. ఇక ఈ సిరీస్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని చాలా మంది చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే టీజర్‌ను కూడా రిలీజ్ చేశారు. అప్పటి నుండి ఇది ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఎప్పుడో రిలీజ్ కావాల్సిందే కరోనా వల్ల లేట్ అయింది.

కృతి శెట్టి మనసులో మాట
బ్లాక్ బస్టర్ "ఉప్పెన మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కృతిశెట్టి ఆమూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కృతిశెట్టి టాలీవుడ్ లో పలు మూవీ ఆఫర్స్ అందుకుంటున్నారు. నేచురల్ స్టార్ నానితో పీరియాడికల్ మూవీ 'శ్యామ్ సింగరాయ్'లో నటిస్తున్న కృతి, సుధీర్ బాబు సరసన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అనే సినిమాలో కూడా కథానాయికగా నటిస్తున్నారు. లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ కథానాయకుడిగా రూపొందుతున్న మూవీ కి కృతి శెట్టి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

'లైగర్' అప్ సెట్
విజయ్ దేవరకొండ సినిమా వచ్చి కూడా రెండేళ్లు అవుతుంది. 2020 లో వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా వచ్చింది.. ఆ తరువాత ఇప్పటివరకూ మరే సినిమా రాలేదు. ప్రస్తుతం పూరీ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలైంది.. అయితే గత ఏడాది కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడింది. ముంబైలో షూట్ వల్ల అక్కడి నుండి ఇక్కడికి వచ్చేయాల్సి వచ్చింది. మళ్లీ పరిస్థితులు కాస్త నార్మల్ గా రావడంతో ముంబై వెళ్లారు షూట్ కోసం. కానీ సెకండ్ వేవ్ వల్ల మళ్లీ షూటింగ్ లకు బ్రేక్ పడింది. ఫస్ట్ వేవ్ తో పోల్చుకుంటే సెకండ్ వేవ్ ఎఫెక్ట్ చాలా దారుణంగా ఉంది. మళ్లీ ఎప్పుడు షూటింగ్ లు మొదలవుతాయో కూడా తెలీదు…

కార్గిల్ కు నాగచైతన్య
అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ , వయాకామ్ 18 స్టూడియోస్ బ్యానర్స్ పై అద్వైత్ చందన్ దర్శకత్వంలో అమీర్ ఖాన్ , కరీనా కపూర్ జంటగా బ్లాక్ బస్టర్ హాలీవుడ్ మూవీ "ఫారెస్ట్ గంప్ " ఆధారంగా "లాల్ సింగ్ చద్దా "హిందీ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో టాలీవుడ్ హీరో నాగచైతన్య ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. "లాల్ సింగ్ చద్దా" మూవీ తో హీరో నాగచైతన్య బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

"సలార్ "మూవీ లో శ్రీనిధి శెట్టి స్పెషల్ సాంగ్ ?
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా రూపొందిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “జూలై 30 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో ప్రభాస్ ప్రస్తుతం “ఆదిపురుష్ “మూవీ తో పాటు “సలార్ “మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 “మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , శృతిహాసన్ జంటగా తెలుగు , కన్నడ భాషలలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “సలార్ “మూవీ 2022 సంవత్సరం ఏప్రిల్ 14 వ తేదీ రిలీజ్ కానుంది. రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నారు .

పవన్ కళ్యాణ్ కు జోడీ గా నిత్యామీనన్
దర్శకుడు సాచి దర్శకత్వంలో పృథ్విరాజ్ సుకుమారన్ , బిజూ మీనన్ ప్రధాన పాత్రలలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “అయ్యప్పనుమ్ కోషియమ్ “మలయాళ మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో ఘనవిజయం సాధించింది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో”అయ్యప్పనుమ్ కోషియమ్ ” మూవీ తెలుగు రీమేక్ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం.

కన్నడ రీమేక్ గా "జయం"మూవీ
చిత్రం మూవీస్ బ్యానర్ పై తేజ దర్శకత్వంలో నితిన్ , సదా జంటగా రూపొందిన "జయం "మూవీ 2002 సంవత్సరం జనవరి 14 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. హీరో నితిన్ కథానాయకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయిన "జయం " మూవీ లో గోపీచంద్ నెగటివ్ రోల్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ విలన్ గా నంది అవార్డ్ అందుకున్నారు. ప్రేక్షకుల , విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ మూవీ కి ఆర్ పి పట్నాయక్ సంగీతం అందించారు. "జయం "మూవీ సాంగ్స్ ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకున్నాయి.

రష్మిక ఫేవరేట్ మూవీ
బ్లాక్ బస్టర్ "కిరిక్ పార్టీ "కన్నడ మూవీ తో కెరీర్ ప్రారంభించిన రష్మిక బ్లాక్ బస్టర్ "ఛలో " మూవీ తో టాలీవుడ్ లో అడుగుపెట్టారు. పలు కన్నడ , తెలుగు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించి సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్నారు."సుల్తాన్ "మూవీ తో రష్మిక తమిళ ప్రేక్షకులను అలరించారు. రష్మిక ప్రస్తుతం యాక్షన్ థ్రిల్లర్ "పుష్ప "మూవీలో కథానాయికగా నటిస్తున్నారు. "ఆడాళ్ళూ మీకు జోహార్లు "మూవీ కి రష్మిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

"ముగ్గురు మొనగాళ్లు" టైటిల్ పోస్టర్ రిలీజ్
చిత్ర మందిర్ స్టూడియోస్ బ్యానర్ పై అభిలాష్ రెడ్డి దర్శకత్వం లో వై ఎస్ ఆర్ , దీక్షిత్ శెట్టి జంటగా ఒక మూవీ తెరకెక్కుతుంది. చిత్ర యూనిట్ ఆ మూవీ టైటిల్ ను "ముగ్గురు మొనగాళ్లు" గా ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ వెరైటీ గా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంది. త్రీ మంకీస్ స్ఫూర్తి తో టైటిల్ పోస్టర్ రూపొందింది. "ముగ్గురు మొనగాళ్లు" మూవీ కి సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.

నిర్మాతగా కంగనా కొత్త సినిమా
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నటిగా ఎంత పేరుతెచ్చుకుందో నిరంతరం వివాదాలతో కూడా ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. ఇక ఇప్పుడు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది కంగనా. ఇన్ని రోజులు హీరోయిన్ గా అలరించిన కంగనా ఇప్పుడు నిర్మాతగా కూడా మారనుంది. కంగనా మణికర్ణిక ఫిలిమ్స్ పేరుతో బ్యానర్ స్థాపించింది. ఆమెకు జాతియ అవార్డు తెచ్చిపెట్టిన 'మణికర్ణిక' చిత్రంపేరునే కంగనా తన బ్యానర్ కు పెట్టడం విశేషం.

కరోనా వ్యాప్తి నివారణకై నిఖిల్ సందేశం
కరోనా మహమ్మారి ఎఫెక్ట్ తో షూటింగ్స్ నిలిచిపోయి , థియేటర్స్ మూతబడి , రిలీజ్ లు ఆగిపోయి చిత్రపరిశ్రమ పలు విధాలుగా నష్టపోయిన విషయం తెలిసిందే. 9 నెలల తరువాత చిత్ర పరిశ్రమ షూటింగ్స్ తో కళ కళ లాడింది. తిరిగి కరోనా సెకండ్ వేవ్ తో షూటింగ్స్ నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. మూవీ రిలీజ్ లు వాయిదా పడ్డాయి. యంగ్ హీరో నిఖిల్ కథానాయకుడిగా రూపొందుతున్న "కార్తికేయ 2 ", "18 పేజెస్ " మూవీ షూటింగ్స్ నిలిచిపోయాయి.

'#SSMB28' అనౌన్స్ మెంట్ వచ్చేసింది
సూపర్ స్టార్ మహేష్ బాబు - డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో సినిమా రానుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి తివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా రావాలి. ఈసినిమా ఎప్పుడో ప్రకటించారు. ఆర్ఆర్ఆర్ షూటింగ్ తరువాత ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా సెట్స్ పైకి వెళుతుంది అన్నారు. కానీ ఎమైందో కానీ మహేష్ సినిమా మధ్యలోకి వచ్చింది. ఎన్టీఆర్-కొరటాల సినిమా అనౌన్స్ మెంట్ వచ్చేసింది.

వైష్ణవ్ సినిమా రిలీజ్ పై క్రిష్ క్లారిటీ
ఉప్పెన సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన మెగా హీరో వైష్ణవ్ తేజ్. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక రెండో సినిమాగా క్రిష్ దర్శకత్వంలో రకుల్- వైష్ణవ్ తేజ్ ప్రధాన పాత్రలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈసినిమా షూటింగ్ అయితే ప్రస్తుతం పూర్తి అయింది. ఇక క్రిష్ గురించి తెలిసిందే కదా.. ఈసినిమా షూటింగ్ ను సింగిల్ షెడ్యూల్ లో చాలా తక్కువ రోజుల్లోనే పూర్తిచేశాడు. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది.

కరోనా పేషెంట్స్ కు సమంత సాయం
కరోనా సెకండ్ వేవ్ విజృంభణ తో దేశంలో పరిస్థితులు విషమంగా మారాయి. వైద్య సదుపాయాలు లేక ఆక్సిజన్ సరఫరా కరువై వేలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఆక్సిజన్ కు డిమాండ్ ఏర్పడింది. స్టార్ హీరోయిన్ సమంత తన ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలిసిందే. సమంత ఇప్పుడు కరోనా కష్టకాలం లో కొందరికైనా సాయపడాలని ఒక కొత్త కార్యక్రమం చేపట్టారు.

మహి వి రాఘవ్ దర్శకత్వంలో ?
యంగ్ హీరో నితిన్ వరస మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. హీరో నితిన్ ప్రస్తుతం శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై మేర్లపాక గాంధీ దర్శకత్వంలో బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “అంధాధున్ ” మూవీ తెలుగు రీమేక్ గా రూపొందుతున్న “మాస్ట్రో ” మూవీ లో నటిస్తున్నారు. “మాస్ట్రో ” మూవీ తరువాత నితిన్ , కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కనున్న పీరియాడికల్ మూవీ “పవర్ పేట “లో నటిస్తారు. సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందనున్న ఒక మూవీ కి హీరో నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

మరో పాన్ ఇండియాలో 'రానా'
డిఫరెంట్ సినిమాలు చేయడంలో రానా ఎప్పుడూ ముందుంటాడు. తన మొదటి సినిమా లీడర్ నుండి ఇప్పటివరకూ చేసిన సినిమాల్లో ప్రతి సినిమాలో ఏదో ఒక విభిన్నత ఉంటుంది. ఇక ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న రానా మరో పాన్ ఇండియాకు రెడీ అయ్యాడు. సీహెచ్ రాంబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాను విశ్వశాంతి పిక్చర్స్ బ్యానర్ పై అధినేత ఆచంట గోపినాథ్ ఈ సినిమా నిర్మించనున్నారు.

ఓవర్ సీస్ లో "రాధేశ్యామ్"కు భారీ డిమాండ్
రెబెల్ స్టార్ కృష్ణం రాజు సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి - సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో రూపొందుతున్న పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ జూలై 30 వ తేదీ రిలీజ్ కానుంది. కృష్ణం రాజు , బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ ముఖ్య పాత్రలలో నటించారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి.

విజయ్ దేవరకొండ గెస్ట్ రోల్ మూవీస్
సక్సెస్ ఫుల్ "నువ్విలా "మూవీ తో విజయ్ దేవరకొండ టాలీవుడ్ కు పరిచయం అయ్యి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ", "ఎవడే సుబ్రహ్మణ్యం "మూవీస్ లో నటించారు. విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన "పెళ్ళిచూపులు "మూవీ ఘనవిజయం సాధించడంతో హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యారు. సెన్సేషనల్ హిట్ "అర్జున్ రెడ్డి "మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి విజయ్ బెస్ట్ యాక్టర్ గా అవార్డ్ అందుకుని క్రేజీ హీరోగా మారారు. సూపర్ హిట్ "గీత గోవిందం ", "టాక్సీవాలా "మూవీస్ తో విజయ్ ప్రేక్షకులను అలరించారు. విజయ్ ప్రస్తుతం తెలుగు , హిందీ భాషలలో రూపొందుతున్న "లైగర్ "మూవీ లో కథానాయకుడిగా నటిస్తున్నారు.