తండ్రి సినిమాకు నిర్మాతగా సుమంత్ అశ్విన్

Tollywood Young Actor Sumanth Ashwin Turns Film Producer,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Hero Sumanth Ashwin Turns Producer For His Dad’s Next Directorial,Hero Sumanth Ashwin Is All Set To Make His Debut As A Producer,Ms Raju,Actor Sumanth Ashwin,Sumanth Ashwin,Hero Sumanth Ashwin,Sumanth Ashwin Latest News,Sumanth Ashwin Latest Film Updates,Sumanth Ashwin Movies,Sumanth Ashwin Movie,Sumanth Ashwin New Movie,Sumanth Ashwin Upcoming Movie,Sumanth Ashwin Nect Project.Sumanth Ashwin Upcoming Movie,Sumanth Ashwin Turns Film Producer,Sumanth Ashwin Turns Producer,Sumanth Ashwin Producer,Sumanth Ashwin To Make His Debut As A Producer,Hero Sumanth Ashwin Turns Producer,Actor Sumanth Ashwin Turns Producer

ఇప్పుడున్న యంగ్ హీరోలు అటు సినిమాలు చేస్తూనే మరో పక్క నిర్మాతలుగా కూడా మారి సినిమాలను నిర్మించేపనిలో పడ్డారు. కొంతమంది హీరోలు అయితే స్వంయంగా తామే సొంత ప్రొడక్షన్ హౌస్ లను నిర్మించి తమ బ్యానర్ లలోనే సినిమాను చేసేస్తున్నారు. ఇక ఇప్పుడు మరో యంగ్ హీరో కూడా నిర్మాతగా మారుతున్నాడు. ఈహీరో ఎవరో కాదు ఒకప్పుడు మనసంతా నువ్వే, ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఇలా పలు సూపర్ హిట్ సినిమాలను అందించిన ఎంఎస్‌ రాజు తనయుడు సుమంత్ అశ్విన్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సుమంత్ అశ్విన్ వైల్డ్ హనీ ప్రొడక్షన్స్ పేరుతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించి సినిమాలు నిర్మించబోతున్నాడు. ఈసినిమాకు తండ్రి ఎంఎస్ రాజు దర్శకత్వం వహించబోతున్నాడు. ఇక కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతున్న ఈ సినిమాకి 7 డేస్… 6 నైట్స్ టైటిల్ ఫిక్స్ చేశారట. ఎబిజి క్రియేషన్స్ నిర్మాణ సంస్థ భాగస్వామ్యంతో నిర్మించబోతున్న ఈ సినిమాలోని ఇతర నటీ నటులు..టెక్నీషియన్స్ గురించి త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడి కానున్నట్టు సమాచారం. మరి నిర్మాతగా ఎంత సక్సెస్ అవుతాడో చూడాలి.

కాగా ‘తూనీగ తూనీగ’ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు సుమంత్ అశ్విన్. తరువాత ‘అంతకు ముందు ఆ తరువాత’, ‘లవర్స్’‌ సినిమాలు మాత్రం అతడికి కమర్షియల్‌ బ్రేకిచ్చి హీరోగా నిలబెట్టాయి. అయితే కేరింత, కొలంబస్, ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్, హ్యాపీ వెడ్డింగ్, ప్రేమకథ చిత్రం 2 వంటి సినిమాలు చేసినా ఎలాంటి విజయం సాధించలేకపోయాయి. దీంతో కెరీర్ కాస్త డల్ అయింది. ఇక ప్రస్తుతం ఇతడు శ్రీకాంత్‌, భూమిక, తాన్యా హోప్‌తో కలిసి ‘ఇదే మా కథ’ లో నటిస్తున్నాడు. ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కానీ అవ్వలేదు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 18 =