హిట్లు ఫ్లాపులతో పని లేకుండా టాలీవుడ్‌లో ఎప్పుడూ బిజీగా ఉండే హీరో న్యాచురల్ స్టార్ నాని. ఏడాదికి ఖచ్చితంగా రెండు సినిమాలైనా లైన్ లో పెడతాడు. రాహుల్ సంకీర్త్యన్‌తో కలిసి నాని ‘శ్యామ్ సింగరాయ్’ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇటీవలే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ రావడం చూశాం. కొద్దిరోజులుగా కలకత్తాలో షూటింగ్ జరుపుకోగా కరోనా సెకండ్ వేవ్ వల్ల అక్కడికి వెళ్లలేని పరిస్థితి ఉండటంతో ఇక్కడే హైదరాబాద్ శివార్లో 10 ఎకరాల్లో కలకత్తా నగరాన్నే సెట్ గా వేశారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఈ సినిమా కోసం హైదరాబాద్ లోనే కోల్ కత్తా నేపథ్యంలోని ‘కాళికాదేవి’ ఆలయం సెట్ ను వేశారు. కథ ప్రకారం 100 సంవత్సరాల క్రితం నాటి ఆలయంలా ఇది కనిపిస్తుందన్న మాట. 10 ఎకరాల్లో ఆరున్నర కోట్ల రూపాయల ఖర్చుతో ఈ సెట్ ను వేశారు. నాని ఫ్లాష్ బ్యాక్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తారని.. ఈ సెట్ లో చిత్రీకరించే సీన్స్ అన్నీ కూడా ఈసినిమాకు హైలెట్ కానున్నాయట.
కృతిశెట్టి, సాయిపల్లవి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమటం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బెంగాలీ నటుడు జిషు సేన్ గుప్తా కీలక పాత్రలో నటించనున్నాడు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ ఎస్. బోయనపల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మడోన్నా సెబాస్టియన్, రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా.. సను జాన్ వర్ఘీస్ సినిమాటోగ్రాఫర్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా పని చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: