సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంట గా కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై భారీ బడ్జెట్ తో నక్సల్ బ్యాక్ గ్రౌండ్ తో , దేవాలయాల పరిరక్షణ వంటి సోషల్ మెసేజ్ తో “ఆచార్య “మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , పూజాహెగ్డే మరో జంటగా నటిస్తున్నారు. సోనూసూద్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా హీరోయిన్ రెజీనా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“ఆచార్య “చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ సింగిల్ “లాహే లాహే “ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.”ఆచార్య “మూవీ కై20 ఎకరాలలో , 20 కోట్ల రూపాయలతో భారీ టెంపుల్ సిటీ సెట్ రూపొందిన విషయం తెలిసిందే. “ఆచార్య “మూవీ షూటింగ్ టెంపుల్ సిటీ సెట్ లో సగ భాగం పైగా జరుపుకుందనీ , కొన్ని కీలక సన్నివేశాలతో పాటు రెండు సాంగ్స్ , యాక్షన్ సన్నివేశాలను దర్శకుడు తెరకెక్కిస్తున్నారనీ సమాచారం. “ఆచార్య “మూవీ రిలీజ్ డేట్ మే 13గా చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా పడే అవకాశం ఉందని సమాచారం. దర్శకుడు కొరటాల , హీరోలు చిరంజీవి , రామ్ చరణ్ ల కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న “ఆచార్య” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: