
ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 56



అనంతపురం యాసలో "నారప్ప "

జయాపజయాలు సమానమే - కృతి సనన్
అల్లు అర్జున్ బాలీవుడ్ ప్లాన్స్

"రాధేశ్యామ్ "మూవీ షూటింగ్ త్వరలో పునః ప్రారంభం
బన్నీ తగ్గేదేలే - మూడు కన్ఫామ్.. మూడు లైన్ లో

గ్రామాలలో నిఖిల్ వ్యాక్సినేషన్ డ్రైవ్

కాజల్ అగర్వాల్ బర్త్ డే సెలబ్రేషన్స్ షురూ

నెగటివ్ రోల్ లో నటించాలని ఉంది - మీనా

హైదరాబాద్ సెట్ లో "లైగర్ "షూటింగ్

కృతిశెట్టి న్యూ టాలెంట్

నాని 'గ్యాంగ్ లీడర్' 3 భాషల్లో రీమేక్..!

తెలుగు భాష పై బాలకృష్ణ ఛాలెంజ్

థ్యాంక్యూ.. జులై చివరికి కంప్లీట్ చేయాలి

ప్రతీ మూవీ "బాహుబలి "కాదు - తమన్నా

వైష్ణవ్ తేజ్ ఫేవరేట్ హీరో , హీరోయిన్ , మూవీ

జూలై నెలాఖరులో సెట్స్ పైకి "ఆచార్య "

పవన్ సినిమాలో లేనంటున్న మలయాళ బ్యూటీ
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయ్యప్పనుమ్ కోషియనుమ్ సినిమా రీమేక్, దానితో పాటు క్రిష్ సినిమా కూడా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈరెండు సినిమాలు షూటింగ్ దశలోనే ఉన్నాయి.ఇక ఈసినిమా తరువాత హరీష్ శంకర్ తో సినిమా చేస్తున్నాడు. ఇక ఇటీవలే ఈసినిమా గురించి పలు వార్తలు వస్తున్న నేపథ్యంలో వాటికి చిత్రయూనిట్ కూడాక్లారిటీ ఇచ్చింది.

జులై నుండి సెట్స్ పైకి "ఆచార్య ", "రాధేశ్యామ్ ", "సర్కారు వారి పాట ", "శ్యామ్ సింగ రాయ్ "
కరోనా ఫస్ట్ వేవ్ తో చిత్ర పరిశ్రమ పలు నష్టాలకు గురి అయిన విషయం తెలిసిందే. సినీ కార్మికులు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 9 నెలల తరువాత షూటింగ్స్ సజావుగా జరుగుతున్న తరుణంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో తిరిగి చిత్ర పరిశ్రమ గడ్డు సమస్యను ఎదుర్కొంటుంది. షూటింగ్స్ నిలిచిపోయి , థియేటర్స్ మూతబడి సినీ సెలబ్రిటీస్ తో పాటు సినీ కార్మికులు ఇళ్ళకే పరిమితం అయ్యారు. పలు మూవీస్ విడుదల వాయిదా పడ్డాయి. ప్రస్తుతం కరోనా క్లిష్ట పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకొంటూ ఉండడం తో దర్శక , నిర్మాతలు షూటింగ్స్ కై సన్నాహాలు చేసుకుంటున్నారు.

అనంతపురం యాసలో "నారప్ప "
సురేష్ ప్రొడక్షన్స్ , వి క్రియేషన్స్ బ్యానర్స్ పై శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ , ప్రియమణి జంటగా యాక్షన్ డ్రామా"నారప్ప "మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ "అసురన్ "తమిళ మూవీ తెలుగురీమేక్ గా రూపొందుతున్న ఈ మూవీ లో కార్తీక్ రత్నం , ప్రకాష్ రాజ్ , రావు రమేష్ , సంపత్ రాజ్ , మురళీశర్మ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

జయాపజయాలు సమానమే - కృతి సనన్
“1:నేనొక్కడినే ” మూవీ తో కెరీర్ ప్రారంభించిన కృతి సనన్ బ్లాక్ బస్టర్ “హీరోపంతి ” మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. బ్లాక్ బస్టర్ “దిల్ వాలే “మూవీ ఘనవిజయం సాధించడంతో కృతి సనన్ బాలీవుడ్ లో బిజీగా మారారు. బాలీవుడ్ లో పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన కృతి ప్రస్తుతం 4 హిందీ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా తెలుగు , హిందీ భాషలలో భారీ బడ్జెట్ తో 3D ఫార్మాట్ లో తెరకెక్కుతున్న “ఆదిపురుష్ “మూవీలో కృతి సనన్ కథానాయికగా నటిస్తున్నారు. “ఆదిపురుష్ “మూవీలో సీత పాత్రలో నటిస్తున్న కృతి తెలుగు భాషను నేర్చుకొనడం విశేషం.
అల్లు అర్జున్ బాలీవుడ్ ప్లాన్స్
మైత్రీమూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక మందన్న జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “ రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. మొదటి భాగం ఆగస్ట్ 13 వ తేదీ, రెండవ భాగం 2022 సంవత్సరం లో రిలీజ్ కానుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి.“పుష్ప “మూవీ తెలుగు భాషతో పాటు కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషల డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి.

"రాధేశ్యామ్ "మూవీ షూటింగ్ త్వరలో పునః ప్రారంభం
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే జంటగా గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెలుగు , హిందీ భాషలలో రూపొందుతున్న పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ జూలై 30వ తేదీ రిలీజ్ కానుంది. భాగ్యశ్రీ , సాషా ఛత్రి , మురళీశర్మ , ప్రియదర్శి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. “రాధేశ్యామ్ “మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది.
బన్నీ తగ్గేదేలే - మూడు కన్ఫామ్.. మూడు లైన్ లో
సినిమాల రిలీజ్ ల సంగతి పక్కన పెడితే యంగ్ హీరోల నుండి స్టార్ హీరోలు వరుసగా సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ఇక బన్నీ కూడా ఇప్పుడు ఇదే ఫార్ములాను ఫాలో అయిపోతున్నాడు. ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పటి వరకూ స్టైలిష్ పాత్రల్లో నటించిన బన్నీ ఈ సినిమాలో అతడు డీ గ్లామర్‌గా కనిపిస్తున్నాడు. అంతేకాదు, చిత్తూరు యాసను కూడా మాట్లాడుతున్నాడు. ఇక ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈసినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్న సంగతి ఇందులో మొదటి భాగం దసరాకు గానీ సంక్రాంతికి గానీ విడుదల కాబోతుందని టాక్.

గ్రామాలలో నిఖిల్ వ్యాక్సినేషన్ డ్రైవ్
కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కరోనా బాధితులు హాస్పిటల్ బెడ్స్ , ఆక్సిజన్ సిలిండర్లు కొరతతో కష్టాలపాలవుతున్నారు. సినీ సెలబ్రిటీస్ కరోనా బాధితులకు తమ వంతు సాయం అందిస్తున్నారు. యంగ్ హీరో నిఖిల్ ప్రజలకు కరోనా వ్యాప్తి నివారణకై తగు జాగ్రత్తలు చెబుతూ సోషల్ మీడియా లో పోస్ట్స్ పెడుతున్నారు. తన వంతు సాయంగా నిఖిల్ ఆక్సిజన్ సిలిండర్స్ , మెడిసిన్స్ కరోనా బాధితులకు అందజేస్తున్న విషయం తెలిసిందే. హీరో నిఖిల్ ఇప్పుడు గ్రామాలలో నిఖిల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టాలనే నిర్ణయం తీసుకున్నారు.

"ఆదిత్య 369 "సీక్వెల్ తో మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ
నందమూరి బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ అనేది గత కొన్ని సంవత్సరాలుగా హాట్ టాపిక్ గా ఉన్న విషయం తెలిసిందే.ఇక మోక్షజ్ఞ సినిమాలు చేయడేమో అని ఆందోళనలో ఉన్న ఫ్యాన్స్‌కి బాలకృష్ణ తన పుట్టినరోజున గుడ్ న్యూస్ చెప్పారు. మోక్షజ్ఞ సినీ ఎంట్రీని కన్ఫర్మ్ చేస్తూ అందుకు సంబంధించిన వివరాలు కూడా వెల్లడించి బాలకృష్ణ అభిమానులను సర్ ప్రైజ్ చేశారు.

కాజల్ అగర్వాల్ బర్త్ డే సెలబ్రేషన్స్ షురూ
తెలుగు , తమిళ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో కాజల్ అగర్వాల్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం “ఆచార్య “ , నాగార్జున యాక్షన్ ఎంటర్ టైనర్ (తెలుగు ), “ఇండియన్ 2 “, “హే సనామికా “, హారర్ మూవీ “ఘోస్టీ “(తమిళ )మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.. కాజల్ అగర్వాల్ బాలీవుడ్ లో ప్రయోగాత్మక మూవీ “ఉమ ” కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాజల్ ఇప్పుడు బ్లాక్ బస్టర్ "ఖైదీ "తమిళ మూవీ హిందీ రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

నెగటివ్ రోల్ లో నటించాలని ఉంది - మీనా
తమిళ , తెలుగు , మలయాళ , హిందీ భాషలలో బాల నటిగా సుమారు 45 మూవీస్ లో నటించిన మీనా 1989సంవత్సరం లో "ఒరు పుదియ కథై "మూవీ తో కోలీవుడ్ , "నవయుగం "మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. సూపర్ హిట్ "సీతారామయ్య గారి మనవరాలు "మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి మీనా బెస్ట్ యాక్ట్రెస్ గా నంది అవార్డ్ అందుకున్నారు. దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో మీనా తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్నారు.

హైదరాబాద్ సెట్ లో "లైగర్ "షూటింగ్
పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెలుగు , హిందీ భాషలలో సాలా క్రాస్‌బ్రీడ్ క్యాప్షన్ తో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “లైగర్ “మూవీ సెప్టెంబర్ 9వ తేదీ రిలీజ్ కానుంది.హీరో విజయ్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే నటిస్తున్నారు. రమ్యకృష్ణ , రోనిత్ రాయ్ , అలీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మణిశర్మ , తనిష్ బాగ్చి సంగీతం అందిస్తున్నారు.

కృతిశెట్టి న్యూ టాలెంట్
“ఉప్పెన “మూవీతో కృతి శెట్టి టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. "ఉప్పెన "మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచి, 100 కోట్ల క్లబ్ లో చేరింది. ”ఉప్పెన ” మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్న కృతి శెట్టి టాలీవుడ్ లో పలు మూవీ ఆఫర్స్ అందుకుంటున్నారు. కృతి శెట్టి కథానాయికగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.

నాని 'గ్యాంగ్ లీడర్' 3 భాషల్లో రీమేక్..!
పక్క ఇండస్ట్రీలో హిట్ అయిన సినిమాలను మనం ఎలా రీమేక్ చేసుకుంటున్నామో.. తెలుగులో హిట్ అయిన సినిమాలు ఇప్పుడు పలు భాషల్లో కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఎన్నో సినిమాలు ముఖ్యంగా బాలీవుడ్ లో మన తెలుగు సినిమాలు రీమేక్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పటికే న్యాచురుల్ స్టార్ నాని క్రికెట్ నేపథ్యంలో నటించిన జెర్సీ సినిమా హిందీలో రీమేక్ అవుతుండగా.. ఇప్పుడు మరో సినిమా రీమేక్ అవుతున్నట్టు తెలుస్తుంది. అది నాని- విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన గ్యాంగ్ లీడర్ సినిమా.

తెలుగు భాష పై బాలకృష్ణ ఛాలెంజ్
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ఎంటర్ టైనర్ "అఖండ "మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. హీరో బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో "#NBK107 "మూవీ అనౌన్స్ అయిన విషయం తెలిసిందే.

మైండ్ బ్లోయింగ్ ఫస్ట్ లుక్ తో వస్తాం..!
ప్రస్తుతం రమేష్‌వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా ఖిలాడి సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈ సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మరోవైపు అర్జున్, అనసూయ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

థ్యాంక్యూ.. జులై చివరికి కంప్లీట్ చేయాలి
మనం’తర్వాత హీరో నాగచైతన్య, దర్శకుడు విక్రమ్ కె. కుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘థ్యాంక్యూ’. ఇక ఈసినిమా కూడా షూటింగ్ దశలోనే ఉంది. కరోనా పరిస్థితుల్లో కూడా ఇటలీ షెడ్యూల్ ను చాలా కష్టపడి ముగించుకొని వచ్చారు చిత్రయూనిట్. ఇక ఇప్పుడిప్పుడే పరిస్థితులు కాస్త నెమ్మదిస్తుండటంతో మళ్లీ షూటింగ్ లకు ప్లాన్ చేస్తున్నారు అందరూ. ఈనేపథ్యంలోనే ఈసినిమా షూటింగ్ ను తొందరగా కంప్లీట్ చేయాలని చూస్తున్నట్టు తెలుపుతున్నాడు విక్రమ్.

ప్రతీ మూవీ "బాహుబలి "కాదు - తమన్నా
"బాహుబలి ", "బాహుబలి 2 ", "సైరా నరసింహా రెడ్డి " వంటి భారీ బడ్జెట్ మూవీస్ లో తమన్నా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తన అద్భుతమైన డ్యాన్స్ స్కిల్ తో పలుసూపర్ హిట్ మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ తో తమన్నా ప్రేక్షకులను అలరిస్తున్నారు. స్టార్ హీరోయిన్ తమన్నా కథానాయికగా రూపొందిన స్పోర్ట్స్ డ్రామా “సీటీ మార్ “ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. తమన్నా ప్రస్తుతం “గుర్తుందా శీతాకాలం “, “F 3 ” మూవీస్ లో కథానాయికగా, ”మాస్ట్రో ” మూవీ లో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

వైష్ణవ్ తేజ్ ఫేవరేట్ హీరో , హీరోయిన్ , మూవీ
మెగా స్టార్ చిరంజీవి మేనల్లుడు , హీరో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ సూపర్ హిట్ “ఉప్పెన “మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యారు. “ఉప్పెన “మూవీ ఘనవిజయం సాధించి కలెక్షన్స్ లో రికార్డ్స్ క్రియేట్ చేసి 100కోట్ల క్లబ్ లో చేరింది. దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో గ్రామీణ నేపథ్యంలో రూపొందిన మూవీ షూటింగ్ ను వైష్ణవ్ తేజ్ కంప్లీట్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో ఒక మూవీ కి , ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ బ్యానర్ లో ఒక మూవీ కి వైష్ణవ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

జూలై నెలాఖరులో సెట్స్ పైకి "ఆచార్య "
మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంట గా కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో “ఆచార్య “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. . ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , పూజాహెగ్డే మరో జంటగా నటిస్తున్నారు. సోనూసూద్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా హీరోయిన్ రెజీనా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.“ఆచార్య “చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ సింగిల్ “లాహే లాహే “ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. టెంపుల్ టౌన్ సెట్ , రామ్ చరణ్ , పూజాహెగ్డే ల సాంగ్ “ఆచార్య “మూవీకి హైలైట్…