పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెలుగు , హిందీ భాషలలో సాలా క్రాస్‌బ్రీడ్ క్యాప్షన్ తో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “లైగర్ “మూవీ సెప్టెంబర్ 9వ తేదీ రిలీజ్ కానుంది.హీరో విజయ్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే నటిస్తున్నారు. రమ్యకృష్ణ , రోనిత్ రాయ్ , అలీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మణిశర్మ , తనిష్ బాగ్చి సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఒక షూటింగ్ షెడ్యూల్ ముంబై లో జరుపుకున్న “లైగర్ “మూవీ కరోనా కారణం గా చాలా గ్యాప్ తరువాత ముంబై లో సెకండ్ షెడ్యూల్ ప్రారంభమయ్యింది. ముంబై లో కోవిడ్ -19 ఎఫెక్ట్ ఎక్కువగా ఉండడంతో”లైగర్ “చిత్ర యూనిట్ షూటింగ్ నిలిపివేశారు. విదేశాల్లో ప్లాన్ చేసిన షెడ్యూల్ అంతా హైదరాబాద్‌లో వేసిన సెట్‌లో చేయడానికి సన్నాహాలు చేస్తున్నారనీ , కరోనా నేపథ్యంలో చిత్రబృందం తో కలిసి విదేశాలు వెళ్ళడం కంటే హైదరాబాద్ లో షూటింగ్ చేయడం ఉత్తమం అనే నిర్ణయానికి వచ్చారనీ సమాచారం. పలు హాలీవుడ్ మూవీస్ కు స్టంట్స్ రూపొందించిన ఆండీ లాగ్ “లైగర్ ” మూవీ కి స్టంట్స్ తెరకెక్కించనున్నారు. ఆయనతో పాటు కొంతమంది విదేశీ బాక్సర్లను హైదరాబాద్ తీసుకువచ్చి మిగతా షూటింగ్ అంతా ఇక్కడే పూర్తి చేసేలా ప్లాన్ చేశారు. “లైగర్ “మూవీ కై మిక్డ్స్ మార్షల్ ఆర్ట్స్‌లో విజయ్ దేవరకొండ శిక్షణ తీసుకున్న విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: