బన్నీ తగ్గేదేలే – మూడు కన్ఫామ్.. మూడు లైన్ లో

Icon Staar Allu Arjun Announces An Interesting Line Up Of Movies,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Icon Staar Allu Arjun,Allu Arjun,Allu Arjun Latest News,Actor Allu Arjun,Hero Allu Arjun,Allu Arjun Latest Movie Updates,Allu Arjun New Movie Updates,Allu Arjun New Movie,Allu Arjun Latet Movies,Allu Arjun Upcoming Movies,Allu Arjun Next Projects,Allu Arjun Upcoming Projects,Allu Arjun Next Movies,Allu Arjun Line Up Of Movies,Allu Arjun Movie,Icon Staar Allu Arjun Movies,Allu Arjun Movie Updates,Allu Arjun Latest Movie News,Allu Arjun New Movies,Allu Arjun’s Upcoming Line-up Of Films As Revealed By Bunny Vas,Allu Arjun Line Up Of Movies With Star Directors,Allu Arjun’s Interesting Project Lineup With Star Directors,Allu Arjun Announces Line Up Of Movies,Allu Arjun Upcoming Line Up Movies,Prashanth Neel,Pushpa,AR Murugadoss,Boyapati Srinu,Pushpa Raj

సినిమాల రిలీజ్ ల సంగతి పక్కన పెడితే యంగ్ హీరోల నుండి స్టార్ హీరోలు వరుసగా సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ఇక బన్నీ కూడా ఇప్పుడు ఇదే ఫార్ములాను ఫాలో అయిపోతున్నాడు. ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పటి వరకూ స్టైలిష్ పాత్రల్లో నటించిన బన్నీ ఈ సినిమాలో అతడు డీ గ్లామర్‌గా కనిపిస్తున్నాడు. అంతేకాదు, చిత్తూరు యాసను కూడా మాట్లాడుతున్నాడు. ఇక ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈసినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్న సంగతి ఇందులో మొదటి భాగం దసరాకు గానీ సంక్రాంతికి గానీ విడుదల కాబోతుందని టాక్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలాఉండగా ఈసినిమా తరువాత బన్నీ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై ఇంత వరకూ క్లారిటీ లేదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అల్లు అర్జున్కు అత్యంత సన్నిహితుడు.. ప్రొడ్యూసర్ బన్నీ వాసు బన్నీ సినిమాల గురించి క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం బన్నీ పుష్ప సినిమా చేస్తున్నాడు. ఈ కథ అనుకున్నప్పుడు
ఇంత పెద్దగా అవుతుందని అనుకోలేదు.. అందుకే రెండు భాగాలుగా చేయాల్సివస్తుంది. ఇకఈసినిమా తరువాత వేణుశ్రీరామ్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా ఉన్న ‘ఐకాన్‌’ని చేస్తున్నాడు. ఆ తరువాత వెంటనే బన్నీ మరో మూడు సినిమాలు చేయనున్నారు. అందులో ఒకటి మురుగదాస్‌, మరొకటి బోయపాటి శ్రీను, ఇంకొకటి కొరటాల శివతో చేయనున్నాడు. ఇంకా ప్రశాంత్ నీల్ తో కూడా చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి అయితే అప్పుడే దాని గురించి చెప్పలేం అంటూ బన్నీ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి క్లారిటీఇచ్చేశాడు.

కాగా పాన్‌ ఇండియా సినిమాగా వస్తున్న ఈ సినిమాలో అల్లుఅర్జున్ పుష్ప రాజ్ అనే లారీ డ్రైవ‌ర్‌గా క‌నిపించ‌నుండ‌గా, ఆయ‌న‌కు జోడీగా ర‌ష్మిక మంద‌న్న న‌టిస్తోంది. ఫహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్న ఈసినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈసినిమా టీజర్ దేశవ్యాప్తంగా సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.మరి సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 3 =