‘ఫైటర్’ స్టోరీ లైన్ అదేనా?

Vijay Deverakonda Fighter Movie Has Got This Amazing Storyline

యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ, ‘ఇస్మార్ట్’ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో బాక్స‌ర్‌గా ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడు విజ‌య్. ఈ సినిమాకి ‘ఫైటర్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కథానాయికగా న‌టిస్తుండ‌గా.. ప్ర‌ముఖ న‌టి ర‌మ్య‌కృష్ణ ముఖ్య భూమిక‌ను పోషించ‌నుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ పూర్తి కాగా.. క‌రోనా ఎఫెక్ట్‌తో చిత్రీక‌ర‌ణ‌కు తాత్కాలికంగా బ్రేక్ ప‌డింది. ఇదిలా ఉంటే.. ‘ఫైటర్’ స్టోరీ లైన్‌కు సంబంధించి ఆసక్తికరమైన కథనం వెలుగులోకి వ‌చ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అదేమిటంటే.. ఈ సినిమా ఫ్లాష్‌బ్యాక్‌లో మాఫియా డాన్‌కి కొడుకుగా ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడ‌ట‌ విజయ్. ఆ ఎపిసోడ్‌లో కొంత మేర నెగ‌టివ్ షేడ్స్ కూడా ఉంటాయ‌ట‌. అయితే, అనూహ్య ప‌రిణామాల అనంత‌రం విజయ్ పాత్ర‌ మాఫియాకి ఎదురుతిర‌గాల్సి వ‌స్తుంద‌ట‌. ఈ నేపథ్యంలో.. విజయ్‌కి, మాఫియా ముఠాకి మధ్య జరిగే కొన్ని పోరాట దృశ్యాలు ఆసక్తికరంగా ఉంటాయని అంటున్నారు. అలాగే, మాఫియా డాన్ కొడుకు.. బాక్స‌ర్‌గా ఎందుకు మార‌తాడు? అనేది కీల‌కాంశంగా చెప్పుకుంటున్నారు. అంతేకాదు.. ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్‌ ప్రత్యేకాకర్షణగా నిలుస్తాయ‌ని.. పూరి తనదైన శైలిలో స్పెష‌ల్‌గా వీటిని డిజైన్ చేశాడ‌ని టాక్. మరి.. ఈ వార్తల్లో నిజ‌మెంతుందో తెలియాలంటే ఇంకొంతకాలం ఆగాల్సిందే.

బాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత క‌ర‌ణ్ జోహార్ స‌మ‌ర్ప‌ణ‌లో పూరీ జ‌గ‌న్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పాన్ – ఇండియా ఫిల్మ్.. ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌ని ప్ర‌చారం సాగుతోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − 4 =