ప్రభాస్ ‘Mr.ప‌ర్‌ఫెక్ట్’కు 9 ఏళ్ళు

Young Rebel Star Prabhas Wholesome Family Entertainer Mr Perfect Completes 9 Years

“మనకు నచ్చింది చేస్తే కొంతే ఆనందం.. నలుగురికీ నచ్చింది చేస్తే ఎంతో ఆనందం..” అన్న పాయింట్‌తో తెరకెక్కిన చిత్రం ‘Mr.ప‌ర్‌ఫెక్ట్’. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ టైటిల్ రోల్‌లో న‌టించిన ఈ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో కాజల్ అగర్వాల్, తాప్సీ నాయిక‌లుగా నటించారు. టాలెంటెడ్ డైరెక్ట‌ర్ దశరథ్ తెరకెక్కించిన ఈ సినిమాలో కె.విశ్వనాథ్, మురళీమోహన్, ప్రకాష్‌ రాజ్, నాజర్, తులసి, ప్రగతి, కౌశల్, షాయాజీ షిండే, బ్రహ్మానందం, కాశీ విశ్వనాథ్, సమీర్ ముఖ్య భూమికలు పోషించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్, బాలాజి, సత్యమూర్తి సాహిత్యం సమకూర్చగా.. దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందించాడు. “చలి చలిగా”, “నింగి జారిపడ్డ”, “అగ్గిపుల్ల లాంటి”, “ఆకాశం బద్దలైన”, “బదులు తోచని”, “లైట్ తీసుకో”, “డోలు డోలు డోలు బాజే”, “రావుగారి అబ్బాయి”, “మొర వినరా”.. ఇలా ప్రతీ పాట జనాదరణ పొందింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మించిన ఈ సినిమా.. ఉత్తమ కుటుంబకథా చిత్రం విభాగంలో ప్రతిష్ఠాత్మకమైన ‘నాగిరెడ్డి మెమోరియల్ అవార్డు’ను కైవసం చేసుకోవడమే కాకుండా.. పలు ప్రాంతీయ పురస్కారాలను ద‌క్కించుకుంది. 2011 ఏప్రిల్ 22న విడుదలై ఘనవిజయం సాధించిన ‘Mr.ప‌ర్‌ఫెక్ట్’.. నేటితో 9 వ‌సంతాల‌ను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + twenty =