ద‌ర్శ‌కేంద్రుడి అద్భుత రూప‌క‌ల్ప‌న‌ ‘కల్పన’కి 43 ఏళ్ళు

K Raghavendra Rao Musical Blockbuster Kalpana Turns 43

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు త‌న కెరీర్ ఆరంభంలో పలు ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ రూపొందించారు. వాటిలో ‘కల్పన’ ఒకటి. జయచిత్ర టైటిల్ రోల్‌లో నటించిన ఈ చిత్రంలో మురళీమోహన్ కథానాయకుడిగా నటించారు. గుమ్మడి వెంకటేశ్వరరావు, కైకాల సత్యనారాయణ, రావుగోపాలరావు, అల్లు రామలింగయ్య, ప్రభాకరరెడ్డి, గిరిబాబు, జయమాలిని, ఛాయాదేవి, భానుప్రకాష్ ముఖ్య భూమికలు పోషించారు. హిందీనాట‌ ఘనవిజయం సాధించిన ‘అనామిక’(1973)చిత్రానికి రీమేక్‌గా ‘కల్పన’ని రూపొందించారు దర్శకేంద్రుడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వేటూరి సుందరరామమూర్తి, వీటూరి, సి.నారాయణరెడ్డి, గోపి గీతరచనకు చక్రవర్తి వీనులవిందైన బాణీలు అందించారు. “దిక్కులు చూడకు రామయ్యా”, “ఒక ఉదయంలో నా హృదయంలో”, “వదలనురా నిను రఘురామ”, “పొద్దువాలిపోయాక”, “అర్ధరాత్రి పొద్దు పొడిచేనా”.. ఇలా ప్రతీ పాట విశేషాదరణ పొందింది. శ్రీ అన్నపూర్ణ సినీ ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై దర్శకనిర్మాత క్రాంతికుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 1977 ఏప్రిల్ 22న విడుదలై ప్రేక్షకులను రంజింపచేసిన ‘కల్పన’.. నేటితో 43 వసంతాలను పూర్తి చేసుకుంటోంది

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + 1 =