అల్లు అర్జున్ ‘సరైనోడు’కి 4 ఏళ్ళు

Stylish Star Allu Arjun Blockbuster Mass Entertainer Sarrainodu Completes 4 Years

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ప‌లు మాస్ ఎంట‌ర్‌టైన‌ర్స్ తెర‌కెక్కాయి. వాటిలో ‘సరైనోడు’ ఒకటి. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అర‌వింద్ నిర్మించిన ఈ చిత్రానికి యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాడు. ఇందులో బన్నీ సరసన రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ ట్రెసా నాయికలుగా నటించగా.. శ్రీకాంత్, ఆది పినిశెట్టి, సుమన్, సాయికుమార్, బ్రహ్మానందం, జయప్రకాశ్, వినయ ప్రసాద్, దేవదర్శిని, ప్రదీప్ రావత్, సురేఖావాణి, అన్నపూర్ణ, విద్యుల్లేఖ రామన్ ముఖ్య పాత్రలు పోషించారు. అంజలి ప్రత్యేక గీతంలో మెరిసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రామజోగయ్య శాస్త్రి, అనంత్ శ్రీరామ్, కృష్ణచైతన్య, శ్రీమణి, ‘బన్నీ’ సురేష్ గీత రచన చేయగా.. థమన్ స్వరాలు సమకూర్చాడు. “యూ ఆర్ మై ఎం.ఎల్.ఎ”, “బ్లాక్ బస్టర్”, “తెలుసా తెలుసా”, “అతిలోకసుందరి”, “ప్రైవేట్ పార్టీ”, “సరైనోడు”.. వంటి పాటలు అభిమానులను అలరించాయి. ఈ చిత్రంతో బెస్ట్ యాక్టర్‌గా ఫిల్మ్ ఫేర్ క్రిటిక్స్ అవార్డ్ – సౌత్‌ను కైవసం చేసుకున్నాడు బ‌న్నీ. 2016 ఏప్రిల్ 22న విడుదలై ఘనవిజయం సాధించిన ‘సరైనోడు’.. నేటితో 4 వ‌సంతాల‌ను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + nineteen =