కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Latest Tollywood News

ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 210

సినిమా వార్తలు

సైనిక శిక్షణ లో హీరో అడివి శేష్

సోనీ పిక్చర్స్ సమర్పణ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రొడక్షన్ హౌస్ GMB ఎంటర్ టైన్ మెంట్స్, A +S ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ "గూఢచారి" మూవీ ఫేమ్ శశికిరణ్ దర్శకత్వంలో అడివిశేష్ హీరోగా మేజర్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా యాక్షన్ డ్రామా "మేజర్ " మూవీ తెలుగు, హిందీ భాషలలో రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో శోభిత దూళిపాళ కథానాయిక.

Team TFNవాట్సాప్
Actress Samantha Akkineni Pens A Special Birthday Note To Mahanati Director Nag Ashwin
సినిమా వార్తలు

నాగ్ అశ్విన్ కు సమంత బర్త్ డే శుభాకాంక్షలు

సక్సెస్ ఫుల్ "ఎవడే సుబ్రమణ్యం" మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయిన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన లెజెండరీ యాక్ట్రెస్ సావిత్రి బయోపిక్ మూవీ "మహానటి " ఘనవిజయం సాధించింది. బెస్ట్ డైరెక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్న నాగ్ అశ్విన్ క్రిటిక్స్, ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం రానా నిర్మాతగా ఒక వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించనున్నారు.

Team TFNవాట్సాప్
Sensational Director Ram Gopal Varma New Tweet Goes Viral On Internet
సినిమా వార్తలు

ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుంది..!

పెళ్లి, ప్రేమ, అనుబంధాలు ఇలాంటి కాన్సెప్ట్ లకు దూరంగా వుండే వర్మ ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంటాడట. వర్మ గురించి తెలిసి ఇది నిజం అని నమ్మితే తప్పులో కాలేసినట్టే. అసలు సంగతేంటో తెలుసుకోవాలంటే మాత్రం స్టోరీలోకి వెళ్లాల్సిందే.

TFN Adminవాట్సాప్
Now Its Turn For Akkineni Nagarjuna and Nandamuri Balakrishna To Take Up The Real Man Challenge
సినిమా వార్తలు

చిరు, వెంకీ అయిపోయింది.. ఇప్పుడు నాగ్, బాలయ్య వంతు..!

మొత్తానికి సందీప్ వంగా మొదలు పెట్టిన 'బీ ది రియల్ మ్యాన్' ఛాలెంజ్ కు మాత్రం సూపర్ రెస్పాన్స్ వస్తుందనే చెప్పొచు. ఈ డైరెక్టర్ ఏం చేసినా అది సెన్సేషనే అన్నట్టు ఇప్పుడు ఈ ఛాలెంజ్ కూడా బాగా పాపులర్ అయిపోతుంది. మన స్టార్ హీరోలందరూ ఇంటి పనులు చేయడం.. గరిటె పట్టుకొని వంటలు కూడా చేయడం చేస్తున్నారు ఈ ఛాలెంజ్ వల్ల. సందీప్ మొదట రాజమౌళిని చాలెంజ్ చేయగా రాజమౌళి కీరవాణి, ఎన్టీఆర్‌, రామ్ చరణ్ లను చాలెంజ్‌ చేశాడు. అలా ఈ ఛాలెంజ్ ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోల మధ్య ఆసక్తికరంగా మారుతుంది.

TFN Adminవాట్సాప్
Macho Star Gopichand Donates 10 Lakh Rupees To Corona Crisis Charity Foundation
సినిమా వార్తలు

కరోనా క్రైసిస్ ఛారిటీ కి గోపీచంద్ విరాళం

కరోనా మహమ్మారి కారణం గా జనజీవవనం కష్టాలపాలయింది. అనేక పరిశ్రమలతో పాటు చిత్ర పరిశ్రమ కూడా మూతపడింది. చిత్ర పరిశ్రమ పై ఆధారపడిన సినీ కార్మికుల సంక్షేమానికై మెగా స్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ సంస్థ ఏర్పాటయిన విషయం తెలిసిందే. పలువురు సినీ ప్రముఖుల విరాళాలతో సినీ కార్మికులకు నిత్యావసర వస్తువులను ఈ సంస్థ అందజేస్తుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

అతిథి పాత్రలో హీరోయిన్ హెబ్బా పటేల్

"అలా ఎలా ? " మూవీ తో టాలీవుడ్ లో అడుగు పెట్టిన హెబ్బా పటేల్ సక్సెస్ ఫుల్ "కుమారి 21 F ", ఎక్కడికి పోతావు చిన్నవాడా ", "అంధగాడు " మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ "భీష్మ" మూవీ లో అతిథి పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించారు.హెబ్బా పటేల్ ఇప్పుడు మరో మూవీ లో అతిథి పాత్రలో నటించారు.

Team TFNవాట్సాప్
Mega Star Chiranjeevi Aces Be The Real Man Challenge Like A Pro
సినిమా వార్తలు

చిరంజీవి "బీ ది రియల్ మెన్ ఛాలెంజ్ "

ఇంటిపనులు చేయడంలో పురుషులు , మహిళలకు ఏ మాత్రం తీసిపోరనే కాన్సెప్ట్ "బీ ది రియల్ మెన్ ఛాలెంజ్ ". ఈ ఛాలెంజ్ కు దర్శకుడు రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ ను నామినేట్ చేసిన విషయం తెలిసిందే. ఇంటి పనులు చేస్తున్న వీడియో ను పోస్ట్ చేస్తూ ఎన్టీఆర్ ఆ ఛాలెంజ్ కు మెగా స్టార్ చిరంజీవిని నామినేట్ చేశారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

‘పుష్ప’రాజ్‌తో పెతురాజ్.. ట్విస్ట్ అదేనా?

‘అల వైకుంఠపురములో’ చిత్రంలో బంటుగా అలరించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. తదుపరి సినిమా కోసం “రాజ్..‘పుష్ప’రాజ్.." అంటూ సందడి చేయనున్నాడు. తన లక్కీ డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న ఆ చిత్రమే ‘పుష్ప’. ఇందులో బన్నీకి జోడిగా రష్మికా మందన్న నటిస్తోంది. కాగా, ‘అల వైకుంఠపురములో’ తరువాత టాలెంటెడ్ బ్యూటీ నివేదా పెతురాజ్ మరోసారి అల్లు స్టార్‌తో కలసి సందడి చేయబోతోందని టాక్. అంతేకాదు.. ఆమె పాత్రకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది.

Team TFNవాట్సాప్
ఫస్ట్ లుక్

బాలకృష్ణ పుట్టినరోజున ‘య‌న్.బి.కె.106’ ఫస్ట్ లుక్?

‘సింహా’, ‘లెజెండ్’ వంటి ఘనవిజయాల తరువాత నటసింహ నందమూరి బాలకృష్ణ, యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతోంది. డివోష‌నల్ యాక్ష‌న్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. అందులో ఒక పాత్ర కోసం అఘోరాగా కనిపిస్తారని టాక్. మిర్యాల రవీంద‌ర్ రెడ్డి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి యువ సంగీత సంచల‌నం థమన్ బాణీలు అందిస్తున్నాడు.

Team TFNవాట్సాప్
Thalapathy Vijay Son Jason Sanjay To Play The Lead In Uppena Tamil Remake
సినిమా వార్తలు

దళపతి తనయుడు హీరోగా తమిళ "ఉప్పెన"

మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వైష్ణవ తేజ్, కృతిశెట్టి జంటగా నిజ జీవిత సంఘటనలతో "ఉప్పెన" మూవీ రూపొందింది. తమిళ హీరో విజయ్ సేతుపతి విలన్ గా నటించిన ఈ మూవీ కి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. భారీ అంచనాలు ఉన్న "ఉప్పెన" మూవీ కరోనా కారణం గా విడుదల వాయిదాపడింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ రూపొందించిన మొదటి సినిమా ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’కు 38 ఏళ్ళు

తెలుగునాట శతకం చూసిన దర్శకులు అతి కొద్దిమందే ఉన్నారు. వారిలో అగ్రశ్రేణి దర్శకుడు కోడి రామకృష్ణ ఒకరు. అలాంటి కోడి రామకృష్ణ మెగా ఫోన్ పట్టి రూపొందించిన తొలి చిత్రం ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’. మెగాస్టార్ చిరంజీవి, మాధవి జంటగా నటించిన ఈ సినిమాలో గొల్లపూడి మారుతీరావు, సంగీత, పూర్ణిమ, అన్నపూర్ణ, పి.ఎల్.నారాయణ, కాకినాడ శ్యామల ముఖ్య భూమికలు పోషించారు. కోడి రామకృష్ణ కథకు గొల్లపూడి మారుతీరావు సంభాషణలు సమకూర్చారు. అంతేకాదు.. ఈ సినిమాతోనే గొల్లపూడి నటుడిగానూ తెరంగేట్రం చేయడం విశేషం.

Team TFNవాట్సాప్
NTR Timeless Classic Major Chandrakanth Completes 27 Years
సినిమా వార్తలు

మ‌హాన‌టుడు యన్టీఆర్ ‘మేజర్ చంద్రకాంత్’కు 27 ఏళ్ళు

మహాన‌టుడు నంద‌మూరి తార‌క రామారావు, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావుది సక్సెస్‌ఫుల్ కాంబినేషన్. అలాంటి వీరిద్దరి కలయికలో వచ్చిన చివరి చిత్రం ‘మేజర్ చంద్రకాంత్’. యన్టీఆర్ టైటిల్ రోల్‌లో నటించిన ఈ సినిమాలో మోహన్‌బాబు, నగ్మా, రమ్యకృష్ణ, శారద, అమ్రీష్ పూరి, గుమ్మడి, బాలయ్య, సుధ, ప్రసాద్‌బాబు, సాయికుమార్, శ్రీహరి, బ్రహ్మానందం, కిన్నెర, మాస్టర్ మంచు మనోజ్ కుమార్, బేబీ శ్రేష్ఠ ముఖ్య భూమికలు పోషించారు. శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ పతాకంపై మోహన్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ప్రభాస్ ‘డార్లింగ్’కు 10 ఏళ్ళు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. సింప్లిసిటీకి మరో పేరు. తానో పెద్ద స్టార్ అయినా.. ఎలాంటి భేషజాలు లేకుండా అందరితోనూ కలుపుగోలుగా ఉండ‌డం ప్ర‌భాస్ ప్ర‌త్యేక‌త‌. అందరినీ ‘డార్లింగ్.. డార్లింగ్’.. అంటూ పలకరిస్తూ.. అందరికి ‘డార్లింగ్’ అయిపోయాడు. ఇంకా చెప్పాలంటే ‘డార్లింగ్’ అంటే ప్రభాస్... ప్రభాస్ అంటే ‘డార్లింగ్’ అన్నంతలా ‘డార్లింగ్’ పదానికి పర్యాయపదంలా మారిపోయాడు. అలాంటి ‘డార్లింగ్’ని టైటిల్‌గా చేసుకుని ప్రభాస్ ఓ ఫుల్ లెన్త్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చేసి.. జనాల నీరాజనాలు అందుకున్నాడు. టాలెంటెడ్ డైరెక్ట‌ర్ ఎ.కరుణాకరన్ తెర‌కెక్కించిన ‘డార్లింగ్’లో ప్రభాస్‌కు జోడిగా కాజల్ అగర్వాల్ నటించగా.. ప్రభు, తులసి…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

అల్లరి నరేష్ 2.0 చూస్తారు 'నాంది' తో..!

అల్లరి సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న హీరో నరేష్. తన కెరీర్ ప్రారంభంలో వరుస సినిమాలతో.. వరుస హిట్లతో దూసుకుపోయిన అల్లరి నరేష్ గత కొంతకాలంగా కాస్త వెనుకపడ్డాడు. ఇక ఇటీవల మహర్షి సినిమాలో.. మహేష్ బాబు కు ఫ్రెండ్ గా కీలక పాత్రలో నటించి మంచి మార్కులే కొట్టేసాడు. ఇప్పుడు మరోసారి హీరోగా 'నాంది' అనే సినిమాతో మరో డిఫరెంట్ స్టోరీ తో వస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రిపోర్టర్ కి క్షమాపణలు చెప్పిన దుల్కర్..!

కొన్ని సినిమాలు చేసేప్పుడు అనుకోకుండా కొందరి మనోభావాలు దెబ్బతింటాయి. కొన్ని సినిమాలకు అయితే పెద్ద పెద్ద గొడవలే జరుగుతాయి. నిజానికి సినిమా తీసేవాళ్ళు ఆ ఉద్దేశంతో తీయకపోయినప్పటికీ ఒక్కోసారి ఆ పదాలనో, సన్నివేశాలనో తెసివేయాల్సి వస్తుంది. ఒక్కసారి క్షమాపణలు కూడా చెప్పాల్సి వస్తుంది. ఇక ఇప్పుడు మరో స్టార్ హీరో కూడా క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఆ హీరో ఎవరో కాదు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్. అసలు సంగతేంటంటే..

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'సోషల్ మీడియా క్వీన్' ఈజ్ బ్యాక్

ఫైనల్లీ సామ్ ఈజ్ బ్యాక్ కాదు కాదు 'సోషల్ మీడియా క్వీన్' ఈజ్ బ్యాక్ అనాలి. కొన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉన్నందుకు బాబోయ్ ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రూమర్లు చక్కర్లు కొట్టాయి. ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే సామ్ ఎందుకు సైలెంట్ అయింది.. సమంత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తుందా అని కొందరు అంటే... మరికొందరు కొత్త సినిమా కథలు వెతికే పనిలో ఉందంటూ.. ఈ లాక్ డౌన్ సమయంలో తను తన పూర్తి సమయాన్ని భర్త నాగ చైతన్యతో గడపాలనే ఇలాంటి వాటికి దూరంగా ఉందని.. అసలు సమంతకు ఏమైంది అబ్బో ఇలా ఎన్నో కథనాలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ రూమర్లకు కాస్త బ్రేక్ వేసి చాలా రోజుల తర్వాత సోషల్ మీడియాలోకి అడుగుపెట్టింది. తన కుక్కని హగ్…

TFN Adminవాట్సాప్
Thalapathy Vijay Donates 5 lakh Rupees Each To Both Telangana and Andhra Pradesh CM Relief Fund
సినిమా వార్తలు

తెలుగు రాష్ట్రాల కు విజయ్ సాయం..!

కరోనా కట్టడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తగిన సహాయం అందిస్తున్నాయి. సెలబ్రిటీస్ దగ్గరనుండి సామాన్య ప్రజల దాక ఇప్పటికే ఎంతో మంది దాతలు ముందుకొచ్చి ఎవరికి తోచిన సాయం చేస్తున్నారు. ఆకలితో బాధపడే వారికి ఆహారం అందిస్తూ.. ఆర్థికంగా చేయూత నిస్తూ కష్టకాలంలో ఒకరికి ఒకరు తోడుగా నిలుస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'తారక్' అన్నయ్యా నాపని అయిపోయింది..!

టాలీవుడ్‌లో ప్రస్తుతం 'బీ ద రియ‌ల్‌మెన్' అనే ఛాలెంజ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఛాలెంజ్ ను రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణి పూర్తి చేయగా ఇప్పుడు మరొకరు రియల్ మెన్ జాబితాలో చేరారు. అతనెవరో కాదు డైరెక్టర్ కొరటాల శివ. జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. బాల‌కృష్ణ‌, ఎన్టీఆర్, కొర‌టాల శివ‌, వెంక‌టేష్‌, నాగార్జున‌ల‌కి ఈ స‌వాల్ విసిరిన సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా ఛాలెంజ్‌ని స్వీక‌రించిన కొరటాల.. తన ఛాలెంజ్ ను పూర్తి చేసి ట్విట్టర్ వీడియో ను పోస్ట్ చేసాడు. ఇప్ప‌టికే నెల రోజు ఫూటేజ్ మిస్ అయింద‌ని చ‌మ‌త్క‌రించారు. అంతే కాదు మొదట్లో కొంచం కష్టంగా వున్నా.. రాను రాను అలవాటయ్యి..ఇప్పుడు సరదా అయింది…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

"ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ" మూవీ సీక్వెల్

స్వరాజ్ RSJ దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి హీరోగా రూపొందిన కామెడీ థ్రిల్లర్ "ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ" మూవీ 2019 సంవత్సరం జూన్ లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. చిన్న సినిమాగా రూపొంది భారీ విజయాన్ని సాధించి, హీరో నవీన్ కు మంచి గుర్తింపు నిచ్చింది. ఈమూవీ తరువాత నవీన్ నటించిన మూవీ ఏదీ రిలీజ్ కాలేదు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మహిళలకు పవన్ కళ్యాణ్ నివాళి గా "వకీల్ సాబ్"

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా కోర్ట్ డ్రామా "వకీల్ సాబ్" మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ సూపర్ హిట్ "పింక్ "మూవీకి తెలుగు రీమేక్ గా రూపొందుతుంది. దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మాతలుగా రూపొందుతున్న ఈ మూవీ లో నివేత థామస్, అంజలి, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్