తమిళ స్టార్ హీరో అజిత్ సాహసం

Thala Ajith Rides Back From Hyderabad To Chennai On Bike

బోనీ కపూర్ మూవీస్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు హెచ్. వినోత్ దర్శకత్వంలో వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ హీరో అజిత్ కుమార్ కథానాయకుడిగా యాక్షన్ ఎంటర్ టైనర్ “వాలిమై” తమిళ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హీరో అజిత్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీ లో హుమా ఖురేషి, యామీగౌతమ్ కథానాయికలు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“వాలిమై” మూవీ షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభమయింది. ఆ షెడ్యూల్ లో బైక్ ఛేజింగ్ సన్నివేశాలు దర్శకుడు తెరకెక్కించారు. హీరో అజిత్ కొరకు ఒక ప్రత్యేక బైక్ ను చిత్ర యూనిట్ తయారు చేయించింది. అంతర్జాతీయ బైక్ రేసర్ గా గుర్తింపు పొందిన అజిత్ షూటింగ్ ముగిసిన తరువాత ఆ బైక్ పై హైదరాబాద్ నుండి చెన్నై కు చేరుకోవాలని నిర్ణయించుకుని బైక్ పై 650 కిలోమీటర్లు ప్రయాణించి చెన్నై చేరుకున్నారు. అప్పుడు జరిగిన సంఘటనను చిత్ర యూనిట్ ఇప్పుడు వెల్లడించింది. అజిత్ బైక్ రైడింగ్ కు సంబంధించిన ఫొటోలను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఆఫొటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. “వాలిమై” మూవీ తదుపరి షూటింగ్ షెడ్యూల్ హైదారాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ లో జరుగనుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + twenty =