దర్శకుడు పూరి జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ “ఫైటర్ “(వర్కింగ్ టైటిల్) మూవీ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత బాలకృష్ణ హీరోగా ఒక మూవీ తెరకెక్కించనున్నారు. కొన్ని రోజుల క్రితం పూరి జగన్నాథ్ ఒక ఇంటర్వ్యూ లో ఒక స్టార్ హీరో కొరకు స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్టు వెల్లడించారు. పూరి జగన్నాథ్ నరేట్ చేసిన స్క్రిప్ట్ కు ఇంప్రెస్ అయ్యి బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
4దశాబ్దాల సినీ కెరీర్ లో బాలకృష్ణ 105 సినిమాలలో నటించి ప్రేక్షకులను అలరించారు. 15 చిత్రాలలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయడం విశేషం. బాలకృష్ణ హీరోగా నటించే 106 వ మూవీ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కనుంది. వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందిన “సింహా” , “లెజెండ్ ” మూవీస్ ఘనవిజయం సాధించాయి. తరువాత మూవీ పూరి దర్శకత్వంలో రూపొందనుంది. ఆ విషయాన్ని పూరి జగన్నాథ్ స్వయంగా అనౌన్స్ చేశారు . వీరిద్దరి కాంబినేషన్ లో “పైసా వసూల్”మూవీ రూపొందిన విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: