![[4:38 pm, 21/04/2020] Sarath: Director Puri Jagannadh To Make A New Movie With Nandamuri Balakrishna [4:38 pm, 21/04/2020] Sarath: Director Puri Jagannadh To Make A New Movie With Nandamuri Balakrishna](https://telugu.thetelugufilmnagar.com/storage/2020/04/ఫైటర్-తర్వాత-ఆ-హీరోతోనే-నా-సినిమా..-1-696x457.jpg)
మొత్తానికి పూరీ జగన్నాథ్ తన తర్వాత సినిమా ఎవరితో చేస్తున్నాడో క్లారిటీ ఇచ్చేసాడు. రీసెంట్ గా పూరీ జగన్నాథ్ ఇంట్లో ఉండే కొత్త సినిమా కథను రాసే పనిలో ఉన్నాడని.. ఓ అగ్ర హీరో కోసం పూరీ కథను సిద్ధం చేసే పనిలో పడ్డాడని.. అతను ఎవరో కాదు మెగా స్టార్ చిరంజీవి అని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనితో గతంలో 150 సినిమా చేయాలనుకున్న పూరీ కోరిక ఈసారి తీరబోతుంది అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ వార్తలన్నిటినీ బ్రేక్ చేసి.. తన తర్వాత హీరో ఎవరో చెప్పేశాడు. ఫైటర్ తర్వాత తన తర్వాత సినిమా బాలకృష్ణ తో చేస్తున్నాడట. బాలకృష్ణకి కాల్ చేసి కథ వినిపించగా… కథ నచ్చడంతో బాలకృష్ణ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ‘ఫైటర్’ పనులు పూర్తి కాగానే బాలకృష్ణ ప్రాజెక్టును పట్టాలెక్కించేలా పూరి ప్లాన్ చేసుకుంటున్నాడట. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పూరీ జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా ‘ఫైటర్’ అనే పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా చిత్రీకరణ వాయిదా వేశారు. బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ ఒక కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీ కి మణిశర్మ సంగీతం అందించనున్నారు. పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ భాషలలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























