‘పుష్ప’రాజ్‌తో పెతురాజ్.. ట్విస్ట్ అదేనా?

Actress Nivetha Pethuraj To Play Forest Officer In Allu Arjun Pushpa

‘అల వైకుంఠపురములో’ చిత్రంలో బంటుగా అలరించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. తదుపరి సినిమా కోసం “రాజ్..‘పుష్ప’రాజ్..” అంటూ సందడి చేయనున్నాడు. తన లక్కీ డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న ఆ చిత్రమే ‘పుష్ప’. ఇందులో బన్నీకి జోడిగా రష్మికా మందన్న నటిస్తోంది. కాగా, ‘అల వైకుంఠపురములో’ తరువాత టాలెంటెడ్ బ్యూటీ నివేదా పెతురాజ్ మరోసారి అల్లు స్టార్‌తో కలసి సందడి చేయబోతోందని టాక్. అంతేకాదు.. ఆమె పాత్రకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అదేమిటంటే.. ‘పుష్ప’లో ఫారెస్ట్ ఆఫీసర్‌గా దర్శనమివ్వనుందట పెతురాజ్. కథలో కీలక మలుపుకి కారణమయ్యే పాత్ర ఇదని వినికిడి. నివేదాకి ఆఫీసర్ పాత్రల్లో కనిపించడం ఇదే తొలిసారి కాదు. ఇదివరకు ‘రోషగాడు’(తమిళంలో ‘తిమిరు పుడిచ్చవన్’)లో సబ్-ఇన్‌స్పెక్ట‌ర్‌గానూ, రిలీజ్‌కి రెడీ అయిన రామ్ ‘రెడ్’లో ఇన్‌స్పెక్ట‌ర్‌గానూ నటించింది ఈ టాలెంటెడ్ బ్యూటీ. ఈ నేపథ్యంలోనే.. ‘పుష్ప’లోని ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రకి కూడా ఆమె బాడీ లాంగ్వేజ్, పర్సనాలిటీ చక్కగా సూట్ అవుతాయని మేకర్స్ భావిస్తున్నారట.

అయితే, పేర్లలో ఉండే కొద్దిపాటి క‌న్‌ఫ్యూజ‌న్‌ కారణంగా నివేదా పెతురాజ్‌కు బదులుగా నివేదా థామస్ పేరు వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి ‘అల వైకుంఠపురములో’ విషయంలోనూ ఇదే చోటుచేసుకుంది. అందులోని కీలక పాత్ర కోసం నివేదా పెతురాజ్‌ని యూనిట్ ఎంపిక చేసినా.. అప్ప‌ట్లో నివేదా థామస్ పేరే ప్రముఖంగా వినిపించింది. కట్ చేస్తే.. నివేదా పెతురాజ్‌నే సీన్‌లో కనిపించింది. మొత్తమ్మీద నివేదా పేరు జనాలను బాగానే క‌న్‌ఫ్యూజ్ చేస్తోంద‌ని అనుకోవాలి. ఏదేమైనా ‘పుష్ప’లో పెతురాజ్ ఎంట్రీపై యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మరి.. ఫారెస్ట్ ఆఫీసర్‌గా నివేదా ఏ స్థాయిలో రంజింపచేస్తుందో తెలియాలంటే ‘పుష్ప’ విడుదల వరకు వేచిచూడాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.