మహానటుడు నందమూరి తారక రామారావు, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావుది సక్సెస్‌ఫుల్ కాంబినేషన్. అలాంటి వీరిద్దరి కలయికలో వచ్చిన చివరి చిత్రం ‘మేజర్ చంద్రకాంత్’. యన్టీఆర్ టైటిల్ రోల్‌లో నటించిన ఈ సినిమాలో మోహన్‌బాబు, నగ్మా, రమ్యకృష్ణ, శారద, అమ్రీష్ పూరి, గుమ్మడి, బాలయ్య, సుధ, ప్రసాద్‌బాబు, సాయికుమార్, శ్రీహరి, బ్రహ్మానందం, కిన్నెర, మాస్టర్ మంచు మనోజ్ కుమార్, బేబీ శ్రేష్ఠ ముఖ్య భూమికలు పోషించారు. శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ పతాకంపై మోహన్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
జాలాది, రసరాజు, గురుచరణ్, కీరవాణి సాహిత్యం సమకూర్చగా.. స్వరవాణి కీరవాణి బాణీలు అందించారు. వాటిలో “పుణ్యభూమి నా దేశం” విశేషాదరణ పొందగా.. “నీక్కావలసింది”, “సుఖీభవ సుమంగళి”, “ముద్దుల్తో ఓనమాలు”, “ఉలికిపడకు అల్లరి మొగుడా”, “బుంగమూతి”, “లప్పంటప్పం” వంటి పాటలు కూడా శ్రోతలను బాగా అలరించాయి. 1993 ఏప్రిల్ 23న విడుదలై ఘనవిజయం సాధించిన ‘మేజర్ చంద్రకాంత్’.. నేటితో 27 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























