బాలకృష్ణ పుట్టినరోజున ‘య‌న్.బి.కె.106’ ఫస్ట్ లుక్?

NBK106 First Look and Title Set To Be Unveiled on Nandamuri Balakrishna Birthday

‘సింహా’, ‘లెజెండ్’ వంటి ఘనవిజయాల తరువాత నటసింహ నందమూరి బాలకృష్ణ, యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతోంది. డివోష‌నల్ యాక్ష‌న్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. అందులో ఒక పాత్ర కోసం అఘోరాగా కనిపిస్తారని టాక్. మిర్యాల రవీంద‌ర్ రెడ్డి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి యువ సంగీత సంచల‌నం థమన్ బాణీలు అందిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే.. ‘యన్.బి.కె.106’కు సంబంధించి టైటిల్, ఫస్ట్ లుక్‌ని బాలయ్య 60వ పుట్టిన రోజు సందర్భంగా జూన్ 10న విడుదల చేయనున్నారని తెలిసింది. త్వరలోనే ఈ విషయంపై మరింత స్పష్టత రానుంది. మరి.. గత చిత్రాలతో సెన్సేషనల్ హిట్స్ అందుకున్న బాలయ్య, బోయపాటి కాంబినేషన్.. రాబోయే సినిమాతోనూ ఆ పరంపరని కొనసాగిస్తుందేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.