యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. సింప్లిసిటీకి మరో పేరు. తానో పెద్ద స్టార్ అయినా.. ఎలాంటి భేషజాలు లేకుండా అందరితోనూ కలుపుగోలుగా ఉండడం ప్రభాస్ ప్రత్యేకత. అందరినీ ‘డార్లింగ్.. డార్లింగ్’.. అంటూ పలకరిస్తూ.. అందరికి ‘డార్లింగ్’ అయిపోయాడు. ఇంకా చెప్పాలంటే ‘డార్లింగ్’ అంటే ప్రభాస్… ప్రభాస్ అంటే ‘డార్లింగ్’ అన్నంతలా ‘డార్లింగ్’ పదానికి పర్యాయపదంలా మారిపోయాడు. అలాంటి ‘డార్లింగ్’ని టైటిల్‌గా చేసుకుని ప్రభాస్ ఓ ఫుల్ లెన్త్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చేసి.. జనాల నీరాజనాలు అందుకున్నాడు. టాలెంటెడ్ డైరెక్టర్ ఎ.కరుణాకరన్ తెరకెక్కించిన ‘డార్లింగ్’లో ప్రభాస్‌కు జోడిగా కాజల్ అగర్వాల్ నటించగా.. ప్రభు, తులసి, చంద్రమోహన్, ‘ఆహుతి’ ప్రసాద్, ఎం.ఎస్.నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, కోట శ్రీనివాసరావు, ముకేష్ రిషి, శ్రీనివాస్ రెడ్డి, శ్రద్ధా దాస్ ముఖ్య భూమికలు పోషించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్ సాహిత్యం సమకూర్చగా.. జి.వి.ప్రకాష్ కుమార్ వినసొంపైన బాణీలు అందించారు. “ఇంకా ఏదో”, “నీవే”, “ప్రాణమా”, “హే బుల్లె”, “హో సాహోరే”, “ఆకాశం కన్నా పైన”.. వంటి పాటలు ప్రేక్షకులను అలరించాయి. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా.. బెస్ట్ ఎడిటర్(కోటగిరి వెంకటేశ్వరరావు), బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ – మేల్(ఆర్.సి.ఎం.రాజు) విభాగాల్లో ‘నంది’ పురస్కారాలను కైవసం చేసుకుంది. కన్నడంలో ‘బుల్‌బుల్’ పేరుతో ఈ చిత్రాన్ని పునఃనిర్మించారు. 2010 ఏప్రిల్ 23న విడుదలై ఘనవిజయం సాధించిన ‘డార్లింగ్’.. నేటితో 10 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.




‘డార్లింగ్’ – కొన్ని విశేషాలు:
* ప్రభాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన తొలి చిత్రమిది. ఆ తరువాత ‘Mr. పర్‌ఫెక్ట్’తోనూ ఈ జోడీ అలరించింది.
* ‘ఛత్రపతి’(2005) తరువాత ప్రభాస్‌కు సాలిడ్ హిట్‌ని అందించిన మూవీ ‘డార్లింగ్’. ఈ రెండు చిత్రాలకు బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మాత కావడం విశేషం.
* అటు దర్శకుడు కరుణాకరన్‌తోనూ, ఇటు సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్‌తోనూ ప్రభాస్ చేసిన ఏకైక చిత్రం ‘డార్లింగ్’నే కావడం మరో విశేషం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: